Bro Day 8 collections: బేబీ కంటే తక్కువగా బ్రో కలెక్షన్స్... ఇంకా ఎన్ని కోట్లు వస్తే హిట్ అవుతుందంటే?
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రాజకీయాల్లో బిజీ ఉంటూనే సినిమాలపై కూడా దృష్టి పెట్టారు. ఇక ఆయన మేనల్లుడితో కలిసి నటించిన చిత్రం బ్రో ది అవతార్. ఇక ఈ సినిమా విడుదలై మిక్స్ డ్ టాక్ సొంతం చేసుకుంది. మొదటి మూడు రోజులు కలెక్షన్స్ పర్వాలేదనిపించినా... క్రమం క్రమం తగ్గుతూ వస్తున్నాయి. ఇక మొదటి వారం పూర్తి చేసుకున్న బ్రో మూవీ... ఇక రెండో వారం మొదటి రోజు అంటే 8వ రోజు కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం.
మెగా హీరోలు పవన్ కల్యాణ్, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన చిత్ర బ్రో. ఇక కేతిక శర్మ హీరోయిన్ గా నటించగా... ప్రియా ప్రకాష్ వారియర్ సాయి తేజుకు చెల్లెలిగా నటించింది. తమిళ సినిమా వినోదయ సీతంకు రీమేక్ గా తెరకెక్కిన బ్రో... ఒరిజినల్ తెరెక్కించిన సముద్రఖని.. తెలుగు వర్షన్ కు కూడా ఆయనే దర్శకత్వం వహించారు. ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్.. తెలుగు నెటివిటీకి తగ్గట్లుగా మాటలు, స్క్రీన్ ప్లై అందించారు. తమన్ సంగీతం అందించారు.

బ్రో మూవీని పీపూల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఇక ఈ సినిమా జులై 28న ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో విడుదల అయింది. విడుదల అయిన మొదటి రోజు నుంచి ఈ సినిమాకు మిక్స్ డ్ టాక్ లభించింది. ఇక నిత్యం వివాదాల్లో ఈ మూవీ ఉంటూ హాట్ టాపిక్ గా మారుతోంది. అందుకు కారణం ఈ సినిమాలోని శ్యాం బాబు పాత్ర డ్యాన్స్ వీడియో.. ఏపీ మంత్రి అంబటి రాంబాబును పోలీ ఉందంటూ.. వివాదం కొనసాగుతుంది. ఇక బ్రో కలెక్షన్స్ రోజు రోజుకూ తగ్గుతూ వస్తున్నాయి.

బిజినెస్...
ఇక ఈ సినిమా బిజినెస్ విషయానికి వస్తే... నైజాంలో రూ. 30 కోట్లు, సీడెడ్‌లో రూ. 13.20 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 37.30 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 80.50 కోట్ల బిజినెస్ చేసుకుందని తెలుస్తోంది. అలాగే.. కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 5 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 12 కోట్లతో కలిపి ప్రపంచ వ్యాప్తంగా రూ. 97.50 కోట్లు బిజినెస్ జరిపిందని లెక్కలు చెబుతున్నాయి.
ఏడు రోజుల్లో...
ఇక బ్రో సినిమా ఆరురోజుల్లో ఇండియా వైడ్ గా రాబట్టిన కలెక్షన్ల విషయానికి వస్తే... మొదటి రోజు రూ.30.05 కోట్లు వసూళ్లు చేయగా.. రెండో రోజు రూ.17.05కోట్లు వసూలు చేసింది. ఇక మూడో రోజు రూ.16.90కోట్లు రాబట్టగా... నాలుగో రోజు కలెక్షన్లు దారుణంగా తగ్గిపోయాయి. కేవలం రూ.3.85 కోట్లు మాత్రమే రాబట్టింది. ఇక ఐదో రోజు కూడా కలెక్షన్లు తగ్గి.. కేవలం రూ.2.95కోట్లు వసూళ్లు చేసింది. ఆరవ రోజు కేవలం రూ.2.10లక్షలు రాబట్టగా.. ఇక ఏడో రోజు రూ.1.30 కోట్లు వసూలు చేసింది.
ఎనిమిదవ రోజు...
బ్రో సినిమా ఏడు రోజుల్లో ఇండియా వైడ్ నెట్ కలెక్షన్లు చూస్తే.. కేవలం రూ.74.20 కోట్లు వసూలు చేయగా.. ఇక ఎనిమిదో రోజు అయినా శుక్రవారం నాడు ట్రెడ్ వర్గాల ప్రకారం కేవలం రూ.1 కోటి మాత్రమే రాబట్టనుంది. ఇన్ని రోజుల్లో ఇదే తక్కువగా రికార్డ్ అయినట్లు తెలుస్తోంది. మొత్తంగా ఈ సినిమాకు ఇండియా వైడ్ నెట్ కలెక్షన్స్ చూసుకుంటే.. 8 రోజుల్లో కేవలం రూ75.20 కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఇక రోజురోజుకు బేబీ వసూలు చేసిన కలెక్షన్స్ కూడా బ్రో వసూలు చేయలేకపోతుంది.

ఆక్యూపెన్సీ, కలెక్షన్స్...
ఇక బ్రో చిత్రానికి తెలుగులో ఎనిమిదో రోజు అయిన శుక్రవారం నాడు ఉదయం 13.67%, మధ్యాహ్నాం 15.86%, సాయంత్రం 18.26 శాతంగా థియేటర్ ఆక్యుపెన్సీ నమోదు అయింది. ఇక 8 రోజుల్లో బ్రో సినిమా వరల్డ్ వైడ్ గా రూ.101.08 కోట్లు రాబట్టినట్లు ట్రెడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇండియా వ్యాప్తంగా రూ.74.2 కోట్ల నెట్ రాబట్టగా... గ్రాస్ రూ.87.08 కోట్లు రాబట్టింది. ఇక ఓవర్సీస్ లో 14 కోట్లు రాబట్టింది.
లాభాల్లోకి రావాలంటే...
బ్రో సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 97.50 కోట్లు కాగా... ఇక ఈ మూవీ లాభాల్లోకి రావాలంటే... ఇంకో రూ. 23.3 కోట్లు రాబట్టాలి. ఇక ఇప్పటికే బ్రో కలెక్షన్స్ తగ్గుతూ వస్తున్నాయి. త్వరలో రజనీ కాంత్ జైలర్, చిరంజీవి భోళాశంకర్ రిలీజ్ కాబోతున్నాయి. ఈలోపే బ్రో బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకుంటే... సినిమా గట్టెక్కనుంది. కానీ బ్రో మూవీ కలెక్షన్స్ రోజు రోజుకూ తగ్గుతూ వస్తున్నాయి. ఈ సినిమా గట్టెక్కడం కష్టమే అనిపిస్తుంది.


Click it and Unblock the Notifications











