Bro Day 9 collections: హమ్మయ్యా వీకెండ్ వచ్చేసింది.. బ్రోకు పెరిగిన కలెక్షన్స్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తన మేనల్లుడితో కలిసి నటించిన చిత్రం బ్రో. ఇక ఈ చిత్రం విడుదలైన మొదటి రోజు నుంచి మిక్స్ డ్ టాక్ వచ్చింది. అయినా కలెక్షన్ల పరంగా మొదటి మూడు రోజులు పర్వాలేదనిపించినా... తర్వాత తగ్గుతూ వచ్చాయి. ఇక సినిమా రిలీజ్ అయి 9 రోజులు కావొస్తుంది. ఇక కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం.

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రాజకీయాల్లో బిజీ ఉంటూనే సినిమాలపై కూడా ఫోకస్ చేశారు. ఇక ఆయన మేనల్లుడితో కలిసి నటించిన చిత్రం బ్రో ది అవతార్. ఇక ఈ సినిమా విడుదలై మిక్స్ డ్ టాక్ సొంతం చేసుకుంది. మొదటి మూడు రోజులు కలెక్షన్స్ పర్వాలేదనిపించింది. ఇక ఈ సినిమా కలెక్షన్స్ తగ్గుతూ వస్తున్నాయి. ఇక రెండో వారం రెండో రోజు అంటే 9వ రోజు కలెక్షన్స్ వివరాలు బయటకు వచ్చాయి.

Pawan Kalyan

మెగా హీరోలు పవన్ కల్యాణ్, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన చిత్ర బ్రో. ఇక కేతిక శర్మ హీరోయిన్ గా నటించగా... ప్రియా ప్రకాష్ వారియర్ సాయి తేజుకు చెల్లెలిగా నటించింది. తమిళ సినిమా వినోదయ సీతంకు రీమేక్ గా తెరకెక్కిన బ్రో... ఒరిజినల్ తెరెక్కించిన సముద్రఖని.. తెలుగు వర్షన్ కు కూడా ఆయనే దర్శకత్వం వహించారు. ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్.. తెలుగు నెటివిటీకి తగ్గట్లుగా మాటలు, స్క్రీన్ ప్లై అందించారు. బ్రో మూవీని పీపూల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.

బిజినెస్...:ఇక ఈ సినిమా బిజినెస్ విషయానికి వస్తే... నైజాంలో రూ. 30 కోట్లు, సీడెడ్‌లో రూ. 13.20 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 37.30 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 80.50 కోట్ల బిజినెస్ చేసుకుందని తెలుస్తోంది. అలాగే.. కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 5 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 12 కోట్లతో కలిపి ప్రపంచ వ్యాప్తంగా రూ. 97.50 కోట్లు బిజినెస్ జరిపిందని లెక్కలు చెబుతున్నాయి.

Pawan Kalyan

ఎనిమిది రోజుల్లో...: ఇక బ్రో సినిమా ఆరురోజుల్లో ఇండియా వైడ్ గా రాబట్టిన కలెక్షన్ల విషయానికి వస్తే... మొదటి రోజు రూ.30.05 కోట్లు వసూళ్లు చేయగా.. రెండో రోజు రూ.17.05కోట్లు వసూలు చేసింది. ఇక మూడో రోజు రూ.16.90కోట్లు రాబట్టగా... నాలుగో రోజు కలెక్షన్లు దారుణంగా తగ్గిపోయాయి. కేవలం రూ.3.85 కోట్లు మాత్రమే రాబట్టింది. ఇక ఐదో రోజు కూడా కలెక్షన్లు తగ్గి.. కేవలం రూ.2.95కోట్లు వసూళ్లు చేసింది. ఆరవ రోజు కేవలం రూ.2.10లక్షలు రాబట్టగా.. ఇక ఏడో రోజు రూ.1.30 కోట్లు, ఎనిమిదో రోజు కేవలం 90 లక్షలు వసూలు చేసింది.

Pawan Kalyan

తొమ్మిదో రోజు...: బ్రో సినిమా ఎనిమిది రోజుల్లో ఇండియా వైడ్ నెట్ కలెక్షన్లు చూస్తే.. కేవలం రూ.75.30 కోట్లు వసూలు చేయగా.. ఇక తొమ్మిదో రోజు అయినా శనివారం నాడు ట్రెడ్ వర్గాల ప్రకారం రూ.1.10 లక్షలు మాత్రమే రాబట్టనుంది. ఇది నిన్నటి కంటే కాస్త మెరుగ్గా కలెక్షన్లను రాబట్టనుంది. ఎందుకంటే వీకెండ్ కాబట్టి.. ఈ సినిమాకు కలిసొచ్చే అవకాశం ఉంది. మొత్తంగా ఈ సినిమాకు ఇండియా వైడ్ నెట్ కలెక్షన్స్ చూసుకుంటే.. 9 రోజుల్లో కేవలం రూ75.20 కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది.

Pawan Kalyan

ఆక్యూపెన్సీ, కలెక్షన్స్...: ఇక బ్రో చిత్రానికి తెలుగులో ఎనిమిదో రోజు అయిన శుక్రవారం నాడు ఉదయం 15.52%, మధ్యాహ్నాం 23.35%, సాయంత్రం29.32% శాతంగా థియేటర్ ఆక్యుపెన్సీ నమోదు అయింది. ఇక 9 రోజుల్లో బ్రో సినిమా వరల్డ్ వైడ్ గా రూ.101.08 కోట్లు రాబట్టినట్లు ట్రెడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇండియా వ్యాప్తంగా రూ.74.2 కోట్ల నెట్ రాబట్టగా... గ్రాస్ రూ.87.08 కోట్లు రాబట్టింది. ఇక ఓవర్సీస్ లో 14 కోట్లు రాబట్టింది.

Pawan Kalyan

లాభాల్లోకి రావాలంటే...: బ్రో సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 97.50 కోట్లు కాగా... ఇక ఈ మూవీ లాభాల్లోకి రావాలంటే... ఇంకో రూ. 22.3 కోట్లు రాబట్టాలి. ఇక ఇప్పటికే బ్రో కలెక్షన్స్ తగ్గుతూ వస్తున్నాయి. త్వరలో రజనీ కాంత్ జైలర్, చిరంజీవి భోళాశంకర్ రిలీజ్ కాబోతున్నాయి. ఈలోపే బ్రో బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకుంటే... సినిమా గట్టెక్కనుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X