OG: పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్ ఎంతంటే.. ఆ రేంజ్ లో బిజినెస్ అయితేనే నిర్మాతకు లాభాలు!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యువ దర్శకుడు సుజిత్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాకు సంబంధించిన లాంచ్ ఈవెంట్ కూడా ఇటీవల జరిగింది. వీలైనంత త్వరగా రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలుపెట్టాలని నిర్మాత డివివి దానయ్య ప్రణాళికలు రచిస్తున్నాడు. అయితే ఈ సినిమాకు పవన్ కళ్యాణ్ ఏ స్థాయిలో రెమ్యూనరేషన్ అందుకుంటున్నాడు అనే విషయం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఆ వివరాల్లోకి వెళితే..

ముందే వివరిస్తున్న పవన్
పవన్ కళ్యాణ్ లైనప్ ప్రస్తుతం చాలా పవర్ఫుల్ గా ఉంది. ఒకవైపు రాజకీయాల్లో పాల్గొంటూనే మరొకవైపు విభిన్నమైన సినిమాలను లైన్లో పెడుతున్నారు. అయితే ఎక్కువ శాతం మాత్రం ఆయన రాజకీయాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు.
ఇక ఏదైనా సినిమా ఒప్పుకునే ముందు మాత్రం తన పరిస్థితి గురించి కూడా పూర్తిస్థాయిలో వివరణ ఇచ్చిన తర్వాతనే సినిమాలు చేసేందుకు ఒప్పుకుంటున్నారు. ఇక పవన్ కళ్యాణ్ డేట్స్ ఎప్పుడు ఇచ్చిన కూడా సినిమాలు చేయడానికి నిర్మాతలు దర్శకులు రెడీ అవుతున్నారు.

మరో సినిమా మొదలు
పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హరిహర వీరమల్లు సినిమా రెడీ అవుతున్న విషయం తెలిసిందే. క్రిష్ దర్శకత్వంలో రాబోతున్న ఆ పాన్ ఇండియా సినిమాపై అంచనాలు మామూలుగా లేవు. అంతేకాకుండా వినోదాయ సీతం రీమేక్ కూడా త్వరలోనే మొదలు కాబోతోంది. అందులో సాయిధరమ్ తేజ్ మరొక ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నాడు.

సరికొత్తగా OG ప్రాజెక్ట్
ఇక రీసెంట్ గా పవన్ కళ్యాణ్ హరిష్ శంకర్ తో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాతో పాటు యువ దర్శకుడు సుజీథ్ తో ఒక కొత్త ప్రాజెక్టును మొదలు పెట్టిన విషయం తెలిసిందే. ఓజి అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమాను లాంచ్ చేశారు. ఇక త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలుపెట్టాలని అనుకుంటున్నారు. ఇప్పటికే బడ్జెట్ విషయంలో కూడా నిర్మాత ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ సినిమా మాఫియా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనుందట.

పవన్ OG రెమ్యునరేషన్
ఇక పవన్ కళ్యాణ్ OG ప్రాజెక్టు కోసం కేవలం 40 రోజుల డేట్స్ మాత్రమే ఇవ్వబోతున్నట్లుగా గత కొంతకాలంగా అనేక రకాల రూమర్స్ అయితే వస్తున్నాయి. అయితే రీసెంట్ గా వచ్చిన టాక్ ప్రకారం అయితే ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ దాదాపు 75 కోట్లకు వరకు రెమ్యునరేషన్ అందుకుంటున్నట్లు సమాచారం. అంతేకాకుండా సినిమా బిజినెస్ లో కూడా మరి కొంత శాతం షేర్ అందుకునే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

100 కోట్లు వస్తేనే..
ఇక నిర్మాత డివివి దానయ్య ఈ సినిమాను 120 కోట్ల భారీ ప్రాజెక్టుతో నిర్మించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అంటే పవన్ కళ్యాణ్ పారితోషికంతో కలిపి దాదాపు 200 కోట్ల వరకు ఖర్చు చేయబోతున్నారట.
అంటే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద నాన్ థియేట్రికల్ గా 100 కోట్లు రాబడితేనే ఎంతో కొంత లాభం వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే థియేట్రికల్ గా కూడా మరొక 100 కోట్లు తప్పనిసరిగా ఈ సినిమా బిజినెస్ చేయాల్సి ఉంటుంది. మరి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి బజ్ క్రియేట్ చేస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











