వామ్మో పవన్ రేంజ్ మామూలుగా లేదు.. తక్కువ రోజుల్లో ఎక్కువ రెమ్యునరేషన్.. అంటే ప్రభాస్ కంటే ఎక్కువే..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎలాంటి సినిమా చేసిన కూడా ఆ సినిమాకు ఊహించని స్థాయిలో భారీ ఓపెనింగ్స్ అందుతాయి అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సినిమా కంటెంట్ ఎలా ఉంది అనే విషయం పక్కన పెడితే పవన్ కళ్యాణ్ స్టార్ ఇమేజ్ తోనే బాక్స్ ఆఫీస్ వద్ద సాలిడ్ ఓపెనింగ్స్ అందుతూ ఉంటాయి. ఇక పవన్ కళ్యాణ్ తో సినిమాలు చేసేందుకు ప్రముఖ నిర్మాతలు చాలా వరకు లైన్లో ఉన్నారు. ఇక పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చేస్తున్న ఒక ప్రాజెక్టుకు తక్కువ రోజులలో మిగతా హీరోల కంటే ఎక్కువ స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లుగా అర్థమవుతోంది. ఆ వివరాల్లోకి వెళితే..

వరుసగా సినిమాలు
పవన్ ఒకవైపు రాజకీయాలతో బిజీగా ఉంటూనే మరోవైపు సినిమాలతో కూడా నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నాడు. వచ్చే ఎలక్షన్స్ కు ప్రణాళికలు రచిస్తున్న పవన్ కళ్యాణ్ ఆర్థికంగా కూడా కాస్త బలంగా ఉండాలి అని ముందుగానే వీలైనన్ని ఎక్కువ ప్రాజెక్టులు చేయాలని అనుకుంటున్నాడు. ప్రస్తుతం అయితే నాలుగు ప్రాజెక్టులు లైన్లో ఉన్న విషయం తెలిసిందే. ఇక అందులో రెండు సెట్స్ పై ఉండగా మరో రెండు ప్రాజెక్టుల షూటింగ్ స్టార్ట్ కావాల్సి ఉంది.

ముందుగా ఆ సినిమా
పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా ముందుగా విడుదల కావాల్సి ఉంది. క్రిష్ దర్శకత్వంలో తెరపైకి రాబోతున్న ఈ చారిత్రాత్మక మూవీ ఫ్యాన్ ఇండియా రేంజ్ లోనే విడుదల కాబోతోంది. అలాగే ఇటీవల వినోదయ సీతం రీమేక్ కూడా స్టార్ట్ చేశాడు. ఇక వీటి తర్వాత సుజిత్ ఓజి మూవీతోపాటు హరిష్ శంకర్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కూడా పూర్తి చేయాల్సి ఉంది.

తక్కువ డేట్స్ ఇచ్చిన పవన్
ఇక ప్రస్తుతం వినోదయ సితం సినిమా కోసం పవన్ కళ్యాణ్ అది తక్కువగా డేట్స్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. 20 రోజుల నుంచి 30 రోజుల మధ్యలోనే పవన్ కళ్యాణ్ ఆ సినిమా కాల్ షీట్స్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. వీలైనంతవరకు నెలరోజుల టైమ్ లో ఆ సినిమాకు సంబంధించిన పనులను కూడా పవన్ కళ్యాణ్ పూర్తి చేసుకునే అవకాశం ఉందట.

షాకింగ్ రెమ్యునరేషన్
అయితే పవన్ కళ్యాణ్ వినోదయ సితం సినిమాకు 50 కోట్లకు పైగానే రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఇంతకుముందు కొన్ని సినిమాలకు పవన్ 60 కోట్లకు పైగా తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఈ సినిమాకు ఇస్తున్న డేట్స్ ప్రకారం పవన్ కళ్యాణ్ 50 కోట్ల నుంచి 55 కోట్ల మధ్యలోనే రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది.

ప్రభాస్, మహేష్ లతో పోలిస్తే..
ఈ లెక్కన చూస్తే పవన్ కళ్యాణ్ ప్రముఖ హీరోలు ప్రభాస్ మహేష్ బాబు కంటే అతి తక్కువ టైంలో ఎక్కువ స్థాయిలో ఆదాయం అందుకుంటున్నాడు అని చెప్పవచ్చు. ప్రభాస్ ఒక్క సినిమాకు మినిమం ఏడాది పాటు టైం తీసుకుంటున్నాడు. ఇక ఆ సినిమాలకు పడే కష్టం వేరు. ఇక ప్రభాస్ సినిమాలకు దాదాపు అతను 200 రోజులకు పైగా కాల్షీట్స్ ఇస్తున్నాడు. మహేష్ బాబు కూడా మినిమం 70 నుంచి 90 రోజుల కాల్ షీట్స్ ఇస్తున్నాడు. అంటే పవన్ కళ్యాణ్ మాత్రం కేవలం 30 రోజుల కాల్షిప్స్ తోనే 50 కోట్లకు పైగా ఆదాయాన్ని అందుకుంటున్నాడు. అంటే అతని క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు.


Click it and Unblock the Notifications











