BRO 11 Days Collections: సగానికి సగం డౌన్.. 11 రోజుల్లో అన్ని కోట్లు కానీ.. పవన్‌కు మరో షాక్ ఖాయం!

మెగా ఫ్యామిలీలో చాలా మంది హీరోలు ఉన్నారు. అందులో కొందరు మాత్రం భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సొంతం చేసుకున్నారు. వారిలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఒకరు. రీఎంట్రీలో వరుసగా సినిమాలు చేస్తోన్న అతడు.. తన మేనల్లుడు సుప్రీమ్ హీరో సాయి థరమ్ తేజ్‌తో కలిసి 'బ్రో (BRO)' మూవీ చేశాడు. డివోషనల్ కాన్సెప్టుతో సందేశాత్మకంగా రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల కోసం ఎదురీదుతోంది. ఈ పరిస్థితుల్లో 11వ రోజు వసూళ్లు మళ్లీ సగానికి సగం పడిపోయాయి. ఈ నేపథ్యంలో అసలు బ్రో మూవీ ఎంత రాబట్టిందో మీరే చూడండి మరి!

సందేశాత్మక కథతో వచ్చింది:పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్ కాంబోలో వచ్చిన మెసేజ్ ఓరియెంటెడ్ మూవీనే 'బ్రో (BRO)'. సముద్రఖని తెరకెక్కించిన ఈ చిత్రం 'వినోదయ సీతమ్' అనే తమిళ మూవీకి రీమేక్‌గా వచ్చింది. ఇందులో కేతిక శర్మ, ప్రియా ప్రకాశ్ వారియర్ హీరోయిన్లుగా చేశారు. ఈ సినిమాకు థమన్ సంగీతాన్ని సమకూర్చాడు. దీన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ.. జీ సంస్థతో కలిసి నిర్మించింది.

Pawan Kalyan Starrer BRO Movie 11 Days Worldwide Official Box Office Collections

బ్రో మూవీ బిజినెస్ డీటేల్స్:మెగా మల్టీస్టారర్‌దా వచ్చిన 'బ్రో (BRO)' మూవీకి నైజాంలో రూ. 30 కోట్లు, సీడెడ్‌లో రూ. 13.20 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 37.30 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 80.50 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, కర్నాకట ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 5 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 12 కోట్లతో కలిపి.. దీనికి ప్రపంచ వ్యాప్తంగా రూ. 97.50 కోట్లు బిజినెస్ అయింది.

11వ రోజు తెలుగు వసూళ్లిలా:'బ్రో (BRO)'కి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 11వ రోజు భారీగా పడిపోయింది. ఫలితంగా నైజాంలో రూ. 14 లక్షలు, సీడెడ్‌లో రూ. 5 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 4 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 3 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 2 లక్షలు, గుంటూరులో రూ. 2 లక్షలు, కృష్ణాలో రూ. 3 లక్షలు, నెల్లూరులో రూ. 2 లక్షలతో కలిపి.. రూ. 35 లక్షలు షేర్, రూ. 65 లక్షలు గ్రాస్ వచ్చింది.

Pawan Kalyan Starrer BRO Movie 11 Days Worldwide Official Box Office Collections

11 రోజులకూ కలిపి ఎంతంటే:11 రోజుల్లో 'బ్రో (BRO)'కి తెలుగులో తక్కువ స్పందనే వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 23.73 కోట్లు, సీడెడ్‌లో రూ. 6.87 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 6.88 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 4.82 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 4.36 కోట్లు, గుంటూరులో రూ. 4.51 కోట్లు, కృష్ణాలో రూ. 3.47 కోట్లు, నెల్లూరులో రూ. 1.75 కోట్లతో కలిపి.. రూ. 53.39 కోట్లు షేర్, రూ. 84.25 కోట్లు గ్రాస్ వచ్చింది.

Pawan Kalyan Starrer BRO Movie 11 Days Worldwide Official Box Office Collections

ప్రపంచ వ్యాప్తంగా ఎంతంటే:ఏపీ, తెలంగాణలో 11 రోజుల్లో భారీ స్థాయిలో రూ. 53.39 కోట్లు రాబట్టిన మెగా మల్టీస్టారర్ 'బ్రో (BRO)' మూవీ ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 6.12 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 7.15 కోట్లు వసూలు చేసింది. వీటితో కలిపితే 11 రోజుల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా దీనికి రూ. 66.66 కోట్లు షేర్‌, రూ. 111.80 కోట్లు గ్రాస్ వచ్చింది.

Pawan Kalyan Starrer BRO Movie 11 Days Worldwide Official Box Office Collections

టార్గెట్ ఇలా.. ఎంత రావాలి?:మెగా కాంబోలో రూపొందిన 'బ్రో (BRO)' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 97.50 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 98.50 కోట్లుగా నమోదైంది. ఇక, 11 రోజుల్లో దీనికి రూ. 66.66 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 31.84 కోట్లు రాబడితేనే ఈ మూవీ క్లీన్ హిట్ స్టేటస్‌ను చేరుకుంటుంది.

Pawan Kalyan Starrer BRO Movie 11 Days Worldwide Official Box Office Collections

ఇలా అయితే హిట్ కష్టమే:పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్ హీరోలుగా నటించిన 'బ్రో (BRO)' మూవీకి కలెక్షన్లు ఆశించిన స్థాయిలో రావడం లేదు. దీనికితోడు మరో రెండు రోజుల్లో 'జైలర్', తర్వాత 'భోళా శంకర్' వస్తున్నాయి. కాబట్టి ఆ తర్వాత ఈ మూవీ మరింత పడిపోయే ప్రమాదం ఉంది. అంటే.. ప్రస్తు పరిస్థితుల్లో టార్గెట్ చేరడం కష్టమనే చెప్పాలి. అదే జరిగితే రూ. 25 కోట్లకు పైగా నష్టాలు వస్తాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X