BRO 12 Days Collections: బ్రో మూవీకి బిగ్ షాక్.. వసూళ్లలో ఊహించని కోత.. అన్ని కోట్లు నష్టాల దిశగా!

గతంలో కంటే ఇప్పుడు టాలీవుడ్‌లో మల్టీస్టారర్, రీమేక్ మూవీలు ఎక్కువగా వస్తున్నాయి. అలాంటి వాటికి అన్ని వర్గాల వాళ్ల నుంచి మంచి స్పందన వస్తుండడంతో మరిన్ని ప్రాజెక్టులు పట్టాలెక్కుతున్నాయి. ఇటీవల అలా వచ్చిన సినిమానే 'బ్రో (BRO)'. ఇందులో మెగా హీరోలు పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ కలిసి నటించడంతో హైప్ పెరిగింది. కానీ, దీనికి వసూళ్లు మాత్రం ఆశించినట్లుగా రావట్లేదు. ఫలితంగా ఈ చిత్రం నష్టాల దిశగానే సాగుతోంది. ఈ నేపథ్యంలో బ్రో మూవీ 12 రోజుల్లో ఎంత రాబట్టిందో మీరే చూడండి!

మామా అల్లుడు కాంబోలో బ్రో:మామా అల్లుడు పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన చిత్రమే 'బ్రో (BRO)'. సముద్రఖని తెరకెక్కించిన ఈ చిత్రం 'వినోదయ సీతమ్' అనే తమిళ మూవీకి రీమేక్‌గా వచ్చింది. ఇందులో కేతిక శర్మ, ప్రియా ప్రకాశ్ వారియర్ హీరోయిన్లుగా చేశారు. దీన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ.. జీ సంస్థతో కలిసి నిర్మించింది. ఈ సినిమాకు థమన్ సంగీతాన్ని సమకూర్చాడు.

Pawan Kalyan Starrer BRO Movie 12 Days Worldwide Official Box Office Collections

బ్రో మూవీ బిజినెస్ డీటేల్స్:డివోషనల్ సబ్జెక్టుతో వచ్చిన 'బ్రో (BRO)' మూవీకి నైజాంలో రూ. 30 కోట్లు, సీడెడ్‌లో రూ. 13.20 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 37.30 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 80.50 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, కర్నాకట ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 5 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 12 కోట్లతో కలిపి.. దీనికి ప్రపంచ వ్యాప్తంగా రూ. 97.50 కోట్లు బిజినెస్ జరిగింది.

Pawan Kalyan Starrer BRO Movie 12 Days Worldwide Official Box Office Collections

12వ రోజు తెలుగు వసూళ్లిలా:12వ రోజు 'బ్రో (BRO)'కి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భారీగా పడిపోయింది. ఫలితంగా నైజాంలో రూ. 8 లక్షలు, సీడెడ్‌లో రూ. 3 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 2 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 2 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 1 లక్షలు, గుంటూరులో రూ. 1 లక్షలు, కృష్ణాలో రూ. 2 లక్షలు, నెల్లూరులో రూ. 1 లక్షలతో కలిపి.. రూ. 20 లక్షలు షేర్, రూ. 40 లక్షలు గ్రాస్ వచ్చింది.

Pawan Kalyan Starrer BRO Movie 12 Days Worldwide Official Box Office Collections

12 రోజులకూ కలిపి ఎంతంటే:'బ్రో (BRO)'కి తెలుగులో 12 రోజుల్లో తక్కువ స్పందనే వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 23.81 కోట్లు, సీడెడ్‌లో రూ. 6.90 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 6.90 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 4.84 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 4.37 కోట్లు, గుంటూరులో రూ. 4.52 కోట్లు, కృష్ణాలో రూ. 3.49 కోట్లు, నెల్లూరులో రూ. 1.76 కోట్లతో కలిపి.. రూ. 53.59 కోట్లు షేర్, రూ. 84.65 కోట్లు గ్రాస్ వచ్చింది.

Pawan Kalyan Starrer BRO Movie 12 Days Worldwide Official Box Office Collections

ప్రపంచ వ్యాప్తంగా ఎంతంటే:12 రోజుల్లో ఏపీ, తెలంగాణలో భారీ స్థాయిలో రూ. 53.59 కోట్లు రాబట్టిన మెగా మల్టీస్టారర్ 'బ్రో (BRO)' మూవీ ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 6.18 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 7.20 కోట్లు వసూలు చేసింది. వీటితో కలిపితే 12 రోజుల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా దీనికి రూ. 66.97 కోట్లు షేర్‌, రూ. 112.40 కోట్లు గ్రాస్ వచ్చింది.

Pawan Kalyan Starrer BRO Movie 12 Days Worldwide Official Box Office Collections

టార్గెట్ ఇలా.. ఎంత రావాలి?:క్రేజీ కాంబోలో రూపొందిన 'బ్రో (BRO)' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 97.50 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 98.50 కోట్లుగా నమోదైంది. ఇక, 12 రోజుల్లో దీనికి రూ. 66.97 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 31.53 కోట్లు రాబడితేనే ఈ మూవీ క్లీన్ హిట్ స్టేటస్‌ను చేరుకుంటుంది.

Pawan Kalyan Starrer BRO Movie 12 Days Worldwide Official Box Office Collections

టార్గెట్ చేరడం కష్టమే కదా:పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన 'బ్రో (BRO)' మూవీకి కలెక్షన్లు ఆశించిన స్థాయిలో రావడం లేదు. దీనికితోడు మరో రెండు రోజుల్లో 'జైలర్', తర్వాత 'భోళా శంకర్' వస్తున్నాయి. కాబట్టి ఆ తర్వాత ఈ మూవీ మరింత పడిపోయి టార్గెట్‌ను చేరడం కష్టంగా మారొచ్చు. పైగా దీనికి రూ. 25 కోట్లు పైగానే నష్టాలు వచ్చే ప్రమాదం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X