BRO 13 Days Collections: బ్రో మూవీ ఢమాల్.. పవన్ సినిమాకు ఇంత తక్కువా.. ఊహించని నష్టాల దిశగా!
చాలా గ్యాప్ తర్వాత సినిమాల్లోకి వచ్చిన పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. వరుస పెట్టి మూవీలను చేస్తూ వెళ్తున్నాడు. ఇలా ఇప్పటికే చాలా చిత్రాలను ప్రేక్షకులకు అందించిన ఈ స్టార్ హీరో.. ఇటీవలే 'బ్రో (BRO)' అనే సినిమాతో వచ్చాడు. ఇందులో సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ కూడా నటించాడు.
దీంతో ఈ చిత్రంపై ఆరంభంలోనే అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. కానీ, ఊహించని విధంగా దీనికి వసూళ్లు చాలా తక్కువగా వస్తున్నాయి. ముఖ్యంగా ఈ వారం వీక్ డేస్‌లో ఈ చిత్రం డౌన్ అవుతూనే ఉంది. ఈ నేపథ్యంలో బ్రో 13 రోజుల్లో ఎంత రాబట్టిందో చూద్దాం పదండి!

మెగా కాంబోలో వచ్చేసిన బ్రో: మెగా హీరోలు పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన చిత్రమే 'బ్రో (BRO)'. సముద్రఖని తెరకెక్కించిన ఈ చిత్రం 'వినోదయ సీతమ్' అనే తమిళ మూవీకి రీమేక్‌గా వచ్చింది. ఇందులో కేతిక శర్మ, ప్రియా ప్రకాశ్ వారియర్ హీరోయిన్లుగా చేశారు. దీన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ.. జీ సంస్థతో కలిసి నిర్మించింది. ఈ సినిమాకు థమన్ సంగీతాన్ని అందించాడు.

బ్రో మూవీ బిజినెస్ డీటేల్స్: సందేశాత్మక కథతో వచ్చిన 'బ్రో (BRO)' మూవీకి నైజాంలో రూ. 30 కోట్లు, సీడెడ్‌లో రూ. 13.20 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 37.30 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 80.50 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, కర్నాకట ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 5 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 13 కోట్లతో కలిపి.. దీనికి ప్రపంచ వ్యాప్తంగా రూ. 97.50 కోట్లు బిజినెస్ అయింది.

13వ రోజు తెలుగు వసూళ్లిలా: 13వ రోజు 'బ్రో (BRO)'కి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భారీగా పడిపోయింది. ఫలితంగా నైజాంలో రూ. 4 లక్షలు, సీడెడ్‌లో రూ. 2 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 1 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 1 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 1 లక్షలు, గుంటూరులో రూ. 1 లక్షలు, కృష్ణాలో రూ. 1 లక్షలు, నెల్లూరులో రూ. 1 లక్షలతో కలిపి.. రూ. 12 లక్షలు షేర్, రూ. 25 లక్షలు గ్రాస్ వచ్చింది.

13 రోజులకూ కలిపి ఎంతంటే: 'బ్రో (BRO)'కి తెలుగులో 13 రోజుల్లో తక్కువ స్పందనే వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 23.85 కోట్లు, సీడెడ్‌లో రూ. 6.92 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 6.91 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 4.85 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 4.38 కోట్లు, గుంటూరులో రూ. 4.53 కోట్లు, కృష్ణాలో రూ. 3.50 కోట్లు, నెల్లూరులో రూ. 1.77 కోట్లతో కలిపి.. రూ. 53.71 కోట్లు షేర్, రూ. 84.90 కోట్లు గ్రాస్ వచ్చింది.
ప్రపంచ వ్యాప్తంగా ఎంతంటే: ఏపీ, తెలంగాణలో 13 రోజుల్లో భారీ స్థాయిలో రూ. 53.71 కోట్లు రాబట్టిన మెగా మల్టీస్టారర్ 'బ్రో (BRO)' మూవీ ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 6.22 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 7.25 కోట్లు వసూలు చేసింది. వీటితో కలిపితే 13 రోజుల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా దీనికి రూ. 67.18 కోట్లు షేర్, రూ. 112.85 కోట్లు గ్రాస్ వచ్చింది.

టార్గెట్ ఇలా.. ఎంత రావాలి?: క్రేజీ కాంబోలో రూపొందిన 'బ్రో (BRO)' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 97.50 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 98.50 కోట్లుగా నమోదైంది. ఇక, 13 రోజుల్లో దీనికి రూ. 67.18 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 31.32 కోట్లు రాబడితేనే ఈ మూవీ క్లీన్ హిట్ స్టేటస్‌ను చేరుకుంటుంది.


Click it and Unblock the Notifications











