BRO 1st Week Collections: 98.50 కోట్లు రావాలి.. కానీ వారంలోనే ఢమాల్.. బేబి 12 అయితే బ్రో 6తో దారుణం
ఈ మధ్య కాలంలో తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అవుతోన్న చిత్రాల్లో 'బ్రో (BRO)' ఒకటి. దీనికి కారణం ఈ సినిమా మెగా ఫ్యామిలీకి చెందిన ఇద్దరు హీరోలు పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ కలిసి నటించడమే. దీంతో ఈ చిత్రంపై ఆరంభం నుంచే అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగా దీన్ని ఎంతో గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. కానీ, ఈ సినిమాకు కలెక్షన్లు మాత్రం ఆశించిన స్థాయిలో రావట్లేదు. దీంతో వారంలోనే ఈ మూవీ తేలిపోయింది. మరి ఇంకెందుకు ఆలస్యం? బ్రో మూవీ 7 రోజుల రిపోర్టుపై మీరే లుక్కేయండి!
మెగా మల్టీస్టారర్‌గా వచ్చింది:పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్ కాంబోలో వచ్చిన మల్టీస్టారర్ మూవీనే 'బ్రో (BRO)'. సముద్రఖని తెరకెక్కించిన ఈ చిత్రం 'వినోదయ సీతమ్' అనే తమిళ మూవీకి రీమేక్‌గా వచ్చింది. ఇందులో కేతిక శర్మ, ప్రియా ప్రకాశ్ వారియర్ హీరోయిన్లుగా చేశారు. ఈ సినిమాకు థమన్ సంగీతాన్ని సమకూర్చాడు. దీన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ.. జీ సంస్థతో కలిసి నిర్మించింది.

బ్రో మూవీ బిజినెస్ డీటేల్స్:సందేశాత్మక కథతో వచ్చిన 'బ్రో (BRO)' మూవీకి నైజాంలో రూ. 30 కోట్లు, సీడెడ్‌లో రూ. 13.20 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 37.30 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 80.50 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, కర్నాకట ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 5 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 12 కోట్లతో కలిపి.. దీనికి ప్రపంచ వ్యాప్తంగా రూ. 97.50 కోట్లు బిజినెస్ జరిగింది.
7వ రోజు తెలుగు వసూళ్లిలా:'బ్రో (BRO)'కి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 7వ రోజూ పడిపోయింది. ఫలితంగా నైజాంలో రూ. 20 లక్షలు, సీడెడ్‌లో రూ. 10 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 9 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 5 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 4 లక్షలు, గుంటూరులో రూ. 4 లక్షలు, కృష్ణాలో రూ. 5 లక్షలు, నెల్లూరులో రూ. 3 లక్షలతో కలిపి.. రూ. 60 లక్షలు షేర్, రూ. 1.00 కోట్లు గ్రాస్ వచ్చింది.

7 రోజులకూ కలిపి ఎంతంటే:'బ్రో (BRO)'కి వారం రోజుల్లో తెలుగులో తక్కువ స్పందనే వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 19.76 కోట్లు, సీడెడ్‌లో రూ. 6.47 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 6.55 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 4.61 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 4.20 కోట్లు, గుంటూరులో రూ. 4.33 కోట్లు, కృష్ణాలో రూ. 3.18 కోట్లు, నెల్లూరులో రూ. 1.61 కోట్లతో కలిపి.. రూ. 50.71 కోట్లు షేర్, రూ. 79.75 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతంటే:7 రోజుల్లో ఏపీ, తెలంగాణలో భారీ స్థాయిలో రూ. 50.71 కోట్లు రాబట్టిన మెగా మల్టీస్టారర్ 'బ్రో (BRO)' మూవీ ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 5.70 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 6.80 కోట్లు వసూలు చేసింది. వీటితో కలిపితే వారం రోజుల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా దీనికి రూ. 63.21 కోట్లు షేర్, రూ. 105.80 కోట్లు గ్రాస్ వచ్చింది.

టార్గెట్ ఇలా.. ఎంత రావాలి?:డివోషనల్ కాన్సెప్టుతో వచ్చిన 'బ్రో (BRO)' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 97.50 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 98.50 కోట్లుగా నమోదైంది. ఇక, 7 రోజుల్లో దీనికి రూ. 63.21 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 35.29 కోట్లు రాబడితేనే ఈ మూవీ క్లీన్ హిట్ స్టేటస్‌ను చేరుకుంటుంది.

బేబి కంటే తక్కువ.. కష్టమే:పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్ హీరోలుగా నటించిన 'బ్రో (BRO)' మూవీ కేవలం ఆరు రోజులు మాత్రమే తెలుగు రాష్ట్రాల్లో రూ. కోటి కంటే ఎక్కువ షేర్ రాబట్టింది. అదే 'బేబి' మూవీ ఏకంగా 12 రోజులు ఈ మార్కును దాటింది. దీంతో చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. ఇక, ఇదే ప్రదర్శన కొనసాగితే 'బ్రో' మూవీ టార్గెట్‌ను చేరుకోవడం కష్టమే అని చెప్పుకోవచ్చు.


Click it and Unblock the Notifications











