BRO 2 Days Collections: రెండో రోజు అన్ని కోట్లు.. ఇవేం కలెక్షన్లు బ్రో.. పవన్ హిట్ కొట్టాలంటే!
'బ్రో.. బ్రో.. బ్రో' ఈ మధ్య కాలంలో తెలుగు రాష్ట్రాల్లో సెన్సేషన్ అవుతోన్న చిత్రాల్లో ఇది ఒకటి. అంతలా ఈ సినిమా ఆరంభం నుంచే భారీ స్థాయిలో అంచనాలను ఏర్పరచుకుంది. దీనికి కారణం ఇందులో పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ కలిసి నటించడమే. ఒకే కుటుంబానికి చెందిన హీరోలు చేసిన ఈ మూవీకి మంచి టాక్ రావడంతో ఓపెనింగ్స్ భారీగా వచ్చాయి. కానీ, రెండో రోజు మాత్రం ఊహించని విధంగా డౌన్ అయింది. దీంతో కలెక్షన్లు సగానికి సగం పడిపోయాయి. మరి 'బ్రో (BRO)' మూవీ రెండు రోజుల రిపోర్టును మీరే చూడండి!
మెగా కాంబోలో వచ్చిన బ్రో: మెగా హీరోలు పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన మూవీనే 'బ్రో (BRO)'. సముద్రఖని తెరకెక్కించిన ఈ చిత్రం 'వినోదయ సీతమ్' అనే తమిళ మూవీకి రీమేక్‌గా వచ్చింది. దీన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. దీనికి థమన్ సంగీతాన్ని సమకూర్చాడు. ఇందులో కేతిక శర్మ, ప్రియా ప్రకాశ్ వారియర్ హీరోయిన్లుగా నటించారు.

బ్రో మూవీ బిజినెస్ డీటేల్స్: క్రేజీ కాన్సెప్టుతో రూపొందిన 'బ్రో (BRO)' మూవీకి నైజాంలో రూ. 30 కోట్లు, సీడెడ్‌లో రూ. 13.20 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 37.30 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 80.50 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, కర్నాకట ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 5 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 12 కోట్లతో కలిపి.. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ. 97.50 కోట్లు బిజినెస్ జరిపింది.
2వ రోజు తెలుగు వసూళ్లిలా
'బ్రో (BRO)'కి ఆంధ్రా, తెలంగాణలో 2వ రోజూ మంచి స్పందనే వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 4.80 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.35 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 1.48 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 64 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 28 లక్షలు, గుంటూరులో రూ. 74 లక్షలు, కృష్ణాలో రూ. 76 లక్షలు, నెల్లూరులో రూ. 33 లక్షలతో కలిపి.. రూ. 10.38 కోట్లు షేర్, రూ. 16.85 కోట్లు గ్రాస్ వచ్చింది.

2 రోజులకూ కలిపి ఎంతంటే: 'బ్రో (BRO)'కి తెలుగులో రెండు రోజుల్లో డీసెంట్ రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 13.25 కోట్లు, సీడెడ్‌లో రూ. 4.05 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 4.08 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 3.09 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 3.26 కోట్లు, గుంటూరులో రూ. 3.25 కోట్లు, కృష్ణాలో రూ. 1.97 కోట్లు, నెల్లూరులో రూ. 1.04 కోట్లతో కలిపి.. రూ. 33.99 కోట్లు షేర్, రూ. 52.35 కోట్లు గ్రాస్ వచ్చింది.
ప్రపంచ వ్యాప్తంగా ఎంతంటే: ఏపీ, తెలంగాణలో భారీ స్థాయిలో రూ. 33.99 కోట్లు రాబట్టిన మెగా మల్టీస్టారర్ 'బ్రో (BRO)' మూవీ ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 3.15 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 5.10 కోట్లు వసూలు చేసింది. వీటితో కలిపితే రెండు రోజుల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా దీనికి రూ. 42.24 కోట్లు షేర్, రూ. 69.50 కోట్లు గ్రాస్ వచ్చింది.

టార్గెట్ ఇలా.. ఎంత రావాలి?: మెగా హీరోలు నటించిన 'బ్రో (BRO)' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 97.50 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 98.50 కోట్లుగా నమోదైంది. ఇక, 2 రోజుల్లో దీనికి రూ. 42.24 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 56.26 కోట్లు రాబడితేనే ఈ మూవీ క్లీన్ హిట్ స్టేటస్‌ను చేరుకుంటుంది.
రెండో రోజు పర్వాలేదు బ్రో: పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన 'బ్రో (BRO)' మూవీకి ఆరంభం నుంచే మంచి టాక్ వచ్చినా ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల ప్రేక్షకుల స్పందన అంతగా రాలేదు. అయినప్పటికీ రెండో రోజు మాత్రం ఇది బాగానే హోల్డ్ చేసింది. ఇలా ఈ చిత్రం అప్పుడే రూ. 70 కోట్లు వరకూ గ్రాస్‌ను రాబట్టింది. ఇక, ఆదివారం ఈ చిత్రం మరింత రాణించాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











