BRO 2 Weeks Collections: 98.50 కోట్ల టార్గెట్.. 2 వారాల్లో దారుణంగా.. పవన్ సినిమాకు కోట్ల నష్టాలు!

ఈ మధ్య కాలంలో టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారిన చిత్రాల్లో.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన 'బ్రో (BRO)' ఒకటి. ఒకే ఫ్యామిలీకి చెందిన ఇద్దరు హీరోలు కలిసి నటించిన చిత్రం కావడంతో ఈ మూవీ యమా హైప్‌ను క్రియేట్ చేసుకుంది. అందుకు తగ్గట్లుగానే ఇది ఎంతో గ్రాండ్‌గా రిలీజ్ అయింది. కానీ, దీనికి ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ మాత్రం రాలేదు. ఫలితంగా ఈ సినిమా తక్కువ వసూళ్లనే రాబడుతోంది. ముఖ్యంగా రెండు వారాల్లోనే నిరాశపరిచింది. మరి ఈ చిత్రం 14 రోజుల్లో ఎంత రాబట్టిందో మీరే చూడండి!

మెగా మల్టీస్టారర్‌గా వచ్చింది:పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన మెగా మల్టీస్టారర్ మూవీనే 'బ్రో (BRO)'. సముద్రఖని తెరకెక్కించిన ఈ చిత్రం 'వినోదయ సీతమ్' అనే తమిళ మూవీకి రీమేక్‌గా వచ్చింది. ఇందులో కేతిక శర్మ, ప్రియా ప్రకాశ్ వారియర్ హీరోయిన్లుగా చేశారు. దీన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ.. జీ సంస్థతో కలిసి నిర్మించింది. ఈ సినిమాకు థమన్ సంగీతాన్ని ఇచ్చాడు.

Pawan Kalyan Starrer BRO Movie 2 Weeks Worldwide Official Box Office Collections

బ్రో మూవీ బిజినెస్ డీటేల్స్:క్రేజీ కాంబినేషన్‌లో రూపొందిన 'బ్రో (BRO)' మూవీకి నైజాంలో రూ. 30 కోట్లు, సీడెడ్‌లో రూ. 14.20 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 37.30 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 80.50 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, కర్నాకట ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 5 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 14 కోట్లతో కలిపి.. దీనికి ప్రపంచ వ్యాప్తంగా రూ. 97.50 కోట్లు బిజినెస్ జరిగింది.

14వ రోజు తెలుగు వసూళ్లిలా:'బ్రో (BRO)' మూవీ 14వ రోజు ఏపీ, తెలంగాణలో మరింతగా పడిపోయింది. ఫలితంగా నైజాంలో రూ. 3 లక్షలు, సీడెడ్‌లో రూ. 1 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 1 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 1 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 1 లక్షలు, గుంటూరులో రూ. 1 లక్షలు, కృష్ణాలో రూ. 1 లక్షలు, నెల్లూరులో రూ. 1 లక్షలతో కలిపి.. రూ. 10 లక్షలు షేర్, రూ. 20 లక్షలు గ్రాస్ వచ్చింది.

Pawan Kalyan Starrer BRO Movie 2 Weeks Worldwide Official Box Office Collections

14 రోజులకూ కలిపి ఎంతంటే:2 వారాల్లో 'బ్రో (BRO)' మూవీకి తెలుగులో తక్కువ స్పందనే వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 23.88 కోట్లు, సీడెడ్‌లో రూ. 6.93 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 6.92 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 4.86 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 4.39 కోట్లు, గుంటూరులో రూ. 4.54 కోట్లు, కృష్ణాలో రూ. 3.51 కోట్లు, నెల్లూరులో రూ. 1.78 కోట్లతో కలిపి.. రూ. 53.81 కోట్లు షేర్, రూ. 85.10 కోట్లు గ్రాస్ వచ్చింది.

Pawan Kalyan Starrer BRO Movie 2 Weeks Worldwide Official Box Office Collections

ప్రపంచ వ్యాప్తంగా ఎంతంటే:ఆంధ్రా, తెలంగాణలో 2 వారాల్లో రూ. 53.81 కోట్లు రాబట్టిన మెగా మల్టీస్టారర్ 'బ్రో (BRO)' మూవీ.. ప్రపంచ వ్యాప్తంగా పర్వాలేదనిపించింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 6.25 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 7.27 కోట్లు వసూలు చేసింది. వీటితో కలిపితే 14 రోజుల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా దీనికి రూ. 67.33 కోట్లు షేర్‌, రూ. 113.15 కోట్లు గ్రాస్ వచ్చింది.

Pawan Kalyan Starrer BRO Movie 2 Weeks Worldwide Official Box Office Collections

టార్గెట్ ఇలా.. ఎంత రావాలి?:డివోషనల్ సబ్జెక్టుతో వచ్చిన 'బ్రో (BRO)' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 97.50 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 98.50 కోట్లుగా నమోదైంది. ఇక, 14 రోజుల్లో దీనికి రూ. 67.33 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 31.17 కోట్లు రాబడితేనే ఈ మూవీ క్లీన్ హిట్ స్టేటస్‌ను చేరుకుంటుంది.

ఏకంగా అన్ని కోట్లు నష్టాలు:మెగా హీరోలు పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన 'బ్రో (BRO)' మూవీ రెండు వారాల్లోనే తేలిపోయింది. పైగా పెద్ద సినిమాలు కూడా విడుదల అయ్యాయి. దీంతో ఈ చిత్రం దాదాపుగా రన్‌ను ముగించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇలా టార్గెట్‌కు ఇప్పుడు చాలా దూరంలోనే ఉండిపోయింది. ఇదే కంటిన్యూ అయితే దీనికి రూ. 30 కోట్లు నష్టాలు వచ్చే చాన్స్ ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X