BRO 3 Days Collections: సండే షాకింగ్ కలెక్షన్లు.. 3 రోజుల్లోనే అన్ని కోట్లు కానీ.. ఇంకా అంత రావాలా!
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ - సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన చిత్రమే 'బ్రో (BRO)'. మెగా మల్టీస్టారర్‌గా రూపొందిన ఈ సినిమా ఎన్నో అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అందుకు అనుగుణంగానే దీనికి మంచి టాక్ రావడంతో ఓపెనింగ్స్ డీసెంట్‌గా వచ్చాయి. అయితే, రెండో రోజు ఈ చిత్రం బాగా డౌన్ అయింది. ఈ క్రమంలోనే మూడో రోజైన ఆదివారం అదే రకమైన కలెక్షన్లను రాణించింది. సండే మరింత ఎక్కువగా వసూళ్లు వస్తాయనుకున్నా అంచనాలను చేరుకోలేదు. మరి 'బ్రో (BRO)' మూవీ మూడు రోజుల రిపోర్టును మీరే చూడండి!
మెగా మల్టీస్టారర్‌గా వచ్చింది:ఒకే ఫ్యామిలీ హీరోలు పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన మూవీనే 'బ్రో (BRO)'. సముద్రఖని తెరకెక్కించిన ఈ చిత్రం 'వినోదయ సీతమ్' అనే తమిళ మూవీకి రీమేక్‌గా వచ్చింది. దీన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. దీనికి థమన్ సంగీతాన్ని సమకూర్చాడు. ఇందులో కేతిక శర్మ, ప్రియా ప్రకాశ్ వారియర్ హీరోయిన్లుగా చేశారు.

బ్రో మూవీ బిజినెస్ డీటేల్స్:మంచి మెసేజ్‌తో రూపొందిన 'బ్రో (BRO)' మూవీకి నైజాంలో రూ. 30 కోట్లు, సీడెడ్‌లో రూ. 13.20 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 37.30 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 80.50 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, కర్నాకట ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 5 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 12 కోట్లతో కలిపి.. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ. 97.50 కోట్లు బిజినెస్ అయింది.
3వ రోజు తెలుగు వసూళ్లిలా:'బ్రో (BRO)'కి ఆంధ్రా, తెలంగాణలో 3వ రోజూ డీసెంట్ రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 4.20 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.55 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 1.66 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 80 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 39 లక్షలు, గుంటూరులో రూ. 75 లక్షలు, కృష్ణాలో రూ. 78 లక్షలు, నెల్లూరులో రూ. 35 లక్షలతో కలిపి.. రూ. 10.48 కోట్లు షేర్, రూ. 17.00 కోట్లు గ్రాస్ వచ్చింది.

3 రోజులకూ కలిపి ఎంతంటే:'బ్రో (BRO)'కి మూడు రోజుల్లో తెలుగులో మంచి స్పందనే వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 17.45 కోట్లు, సీడెడ్‌లో రూ. 5.56 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 5.74 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 3.93 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 3.74 కోట్లు, గుంటూరులో రూ. 4.00 కోట్లు, కృష్ణాలో రూ. 2.75 కోట్లు, నెల్లూరులో రూ. 1.39 కోట్లతో కలిపి.. రూ. 44.56 కోట్లు షేర్, రూ. 72.50 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతంటే:3 రోజుల్లో ఏపీ, తెలంగాణలో భారీ స్థాయిలో రూ. 44.56 కోట్లు రాబట్టిన మెగా మల్టీస్టారర్ 'బ్రో (BRO)' మూవీ ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 4.85 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 5.85 కోట్లు వసూలు చేసింది. వీటితో కలిపితే 3 రోజుల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా దీనికి రూ. 55.26 కోట్లు షేర్, రూ. 91.75 కోట్లు గ్రాస్ వచ్చింది.

టార్గెట్ ఇలా.. ఎంత రావాలి?:క్రేజీ కాన్సెప్టుతో వచ్చిన 'బ్రో (BRO)' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 97.50 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 98.50 కోట్లుగా నమోదైంది. ఇక, 3 రోజుల్లో దీనికి రూ. 55.26 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 43.24 కోట్లు రాబడితేనే ఈ మూవీ క్లీన్ హిట్ స్టేటస్‌ను చేరుకుంటుంది.

వీకెండ్ డీసెంట్.. టెస్ట్ స్టార్ట్:పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్ హీరోలుగా నటించిన 'బ్రో (BRO)' మూవీకి ఆరంభం నుంచే మంచి టాక్ వచ్చినా ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల ప్రేక్షకుల స్పందన అంతగా రాలేదు. అయినప్పటికీ వీకెండ్‌లోనే ఈ సినిమా యాభై శాతం కంటే ఎక్కువ వసూళ్లను రాబట్టింది. ఇక, వీక్ డేస్‌లో దీని పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అనేది ఆసక్తికరంగా మారింది.


Click it and Unblock the Notifications











