BRO 5 Days Collections: బ్రో కలెక్షన్లకు గండి.. 5 రోజుల్లో దారుణంగా.. అన్ని కోట్లు వస్తేనే హిట్టా!
తెలుగు సినీ ఇండస్ట్రీలో మల్టీస్టారర్ మూవీల హవా కనిపిస్తోంది. ఇలా ఇప్పటికే చాలా సినిమాలు వచ్చి ప్రేక్షకులను అలరించాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు వచ్చిన చిత్రమే 'బ్రో (BRO)'. పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన ఈ సినిమా ఎన్నో అంచనాలను ఏర్పరచుకుని విడుదలైంది. అందుకు తగ్గట్లుగానే వీకెండ్‌లో సత్తా చాటిన ఈ చిత్రం.. సోమవారం భారీగా స్పందనను కోల్పోయింది. ఈ క్రమంలోనే మంగళవారం కూడా మరింత డౌన్ అయింది. ఈ నేపథ్యంలో 'బ్రో (BRO)' మూవీ 5 రోజుల రిపోర్టును మీరే చూడండి!
మేనల్లుడితో వచ్చిన పవన్:మెగా హీరోలు పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన మూవీనే 'బ్రో (BRO)'. సముద్రఖని తెరకెక్కించిన ఈ చిత్రం 'వినోదయ సీతమ్' అనే తమిళ మూవీకి రీమేక్‌గా వచ్చింది. ఇందులో కేతిక శర్మ, ప్రియా ప్రకాశ్ వారియర్ హీరోయిన్లుగా చేశారు. దీన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. ఈ సినిమాకు థమన్ సంగీతాన్ని అందించాడు.

బ్రో మూవీ బిజినెస్ డీటేల్స్:సందేశాత్మక కథతో వచ్చిన 'బ్రో (BRO)' మూవీకి నైజాంలో రూ. 30 కోట్లు, సీడెడ్‌లో రూ. 13.20 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 37.30 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 80.50 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, కర్నాకట ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 5 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 12 కోట్లతో కలిపి.. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ. 97.50 కోట్లు బిజినెస్ చేసింది.
5వ రోజు తెలుగు వసూళ్లిలా:'బ్రో (BRO)'కి ఆంధ్రా, తెలంగాణలో 5వ రోజూ డౌన్ అయిపోయింది. ఫలితంగా నైజాంలో రూ. 72 లక్షలు, సీడెడ్‌లో రూ. 25 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 24 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 11 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 8 లక్షలు, గుంటూరులో రూ. 9 లక్షలు, కృష్ణాలో రూ. 12 లక్షలు, నెల్లూరులో రూ. 7 లక్షలతో కలిపి.. రూ. 1.68 కోట్లు షేర్, రూ. 3.00 కోట్లు గ్రాస్ వచ్చింది.

5 రోజులకూ కలిపి ఎంతంటే:'బ్రో (BRO)'కి ఐదు రోజుల్లో తెలుగులో తక్కువ స్పందనే వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 19.16 కోట్లు, సీడెడ్‌లో రూ. 6.21 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 6.31 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 4.19 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 3.92 కోట్లు, గుంటూరులో రూ. 4.22 కోట్లు, కృష్ణాలో రూ. 3.05 కోట్లు, నెల్లూరులో రూ. 1.54 కోట్లతో కలిపి.. రూ. 48.60 కోట్లు షేర్, రూ. 76.55 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతంటే:5 రోజుల్లో ఏపీ, తెలంగాణలో భారీ స్థాయిలో రూ. 48.60 కోట్లు రాబట్టిన మెగా మల్టీస్టారర్ 'బ్రో (BRO)' మూవీ ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 5.42 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 6.40 కోట్లు వసూలు చేసింది. వీటితో కలిపితే 5 రోజుల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా దీనికి రూ. 60.42 కోట్లు షేర్, రూ. 101.10 కోట్లు గ్రాస్ వచ్చింది.

టార్గెట్ ఇలా.. ఎంత రావాలి?:డివోషనల్ సబ్జెక్టుతో వచ్చిన 'బ్రో (BRO)' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 97.50 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 98.50 కోట్లుగా నమోదైంది. ఇక, 5 రోజుల్లో దీనికి రూ. 60.42 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 38.08 కోట్లు రాబడితేనే ఈ మూవీ క్లీన్ హిట్ స్టేటస్‌ను చేరుకుంటుంది.

సెంచరీ పూర్తి చేసిన బ్రో:మెగా ఫ్యామిలీకి చెందిన పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్ హీరోలుగా నటించిన 'బ్రో (BRO)' మూవీకి ఆరంభం నుంచే మంచి టాక్ వచ్చినా ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల ప్రేక్షకుల స్పందన అంతగా రాలేదు. అయినప్పటికీ ఈ సినిమా ఐదు రోజుల్లోనే రూ. 100 కోట్లు గ్రాస్‌ను పూర్తి చేసి సత్తా చాటింది. తద్వారా పవన్ కల్యాణ్ కెరీర్ మరో బెస్ట్ మూవీగా నిలిచింది.


Click it and Unblock the Notifications











