BRO 6 Days Collections: మెగా హీరోలకు షాక్.. 6వ రోజు ఊహించని విధంగా.. అదే జరిగితే హిట్ అవడం కష్టమే!

టాలీవుడ్‌లో మెగా ఫ్యామిలీకి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. దీనికి కారణం ఆ కుటుంబంలో ఉన్న చాలా మంది హీరోలు స్టార్లుగా వెలుగొందుతుండడమే. అందులో ఇద్దరు హీరో పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన చిత్రమే 'బ్రో (BRO)'. డివోషనల్ కాన్సెప్టుతో రూపొందిన ఈ సినిమా భారీ అంచనాలతో విడుదలైంది. అందుకు తగ్గట్లుగానే ఓపెనింగ్స్ రాబట్టింది. కానీ, వీక్ డేస్‌లో మాత్రం ఇది తేలిపోతుంది. ఫలితంగా వసూళ్లు డౌన్ అవుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో 'బ్రో (BRO)' మూవీ 6 రోజుల రిపోర్టును మీరే చూడండి!

సందేశాత్మక కథతో వచ్చింది:పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన సందేశాత్మక సినిమానే 'బ్రో (BRO)'. సముద్రఖని తెరకెక్కించిన ఈ చిత్రం 'వినోదయ సీతమ్' అనే తమిళ మూవీకి రీమేక్‌గా వచ్చింది. ఇందులో కేతిక శర్మ, ప్రియా ప్రకాశ్ వారియర్ హీరోయిన్లుగా చేశారు. దీన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. ఈ సినిమాకు థమన్ సంగీతాన్ని సమకూర్చాడు.

Pawan Kalyan Starrer BRO Movie 6 Days Worldwide Official Box Office Collections

బ్రో మూవీ బిజినెస్ డీటేల్స్:మెగా మల్టీస్టారర్‌గా వచ్చిన 'బ్రో (BRO)' మూవీకి నైజాంలో రూ. 30 కోట్లు, సీడెడ్‌లో రూ. 13.20 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 37.30 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 80.50 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, కర్నాకట ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 5 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 12 కోట్లతో కలిపి.. దీనికి ప్రపంచ వ్యాప్తంగా రూ. 97.50 కోట్లు బిజినెస్ అయింది.

6వ రోజు తెలుగు వసూళ్లిలా:'బ్రో (BRO)'కి ఆంధ్రా, తెలంగాణలో 6వ రోజూ డౌన్ అయిపోయింది. ఫలితంగా నైజాంలో రూ. 41 లక్షలు, సీడెడ్‌లో రూ. 17 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 15 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 8 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 6 లక్షలు, గుంటూరులో రూ. 7 లక్షలు, కృష్ణాలో రూ. 8 లక్షలు, నెల్లూరులో రూ. 4 లక్షలతో కలిపి.. రూ. 1.06 కోట్లు షేర్, రూ. 1.70 కోట్లు గ్రాస్ వచ్చింది.

Pawan Kalyan Starrer BRO Movie 6 Days Worldwide Official Box Office Collections

6 రోజులకూ కలిపి ఎంతంటే:'బ్రో (BRO)'కి ఆరు రోజుల్లో తెలుగులో తక్కువ స్పందనే వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 19.56 కోట్లు, సీడెడ్‌లో రూ. 6.37 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 6.46 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 4.56 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 4.16 కోట్లు, గుంటూరులో రూ. 4.29 కోట్లు, కృష్ణాలో రూ. 3.13 కోట్లు, నెల్లూరులో రూ. 1.58 కోట్లతో కలిపి.. రూ. 50.11 కోట్లు షేర్, రూ. 78.75 కోట్లు గ్రాస్ వచ్చింది.

Pawan Kalyan Starrer BRO Movie 6 Days Worldwide Official Box Office Collections

ప్రపంచ వ్యాప్తంగా ఎంతంటే:6 రోజుల్లో ఏపీ, తెలంగాణలో భారీ స్థాయిలో రూ. 50.11 కోట్లు రాబట్టిన మెగా మల్టీస్టారర్ 'బ్రో (BRO)' మూవీ ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 5.60 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 6.55 కోట్లు వసూలు చేసింది. వీటితో కలిపితే 6 రోజుల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా దీనికి రూ. 62.26 కోట్లు షేర్‌, రూ. 104.20 కోట్లు గ్రాస్ వచ్చింది.

Pawan Kalyan Starrer BRO Movie 6 Days Worldwide Official Box Office Collections

టార్గెట్ ఇలా.. ఎంత రావాలి?:క్రేజీ కాంబినేషన్‌లో వచ్చిన 'బ్రో (BRO)' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 97.50 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 98.50 కోట్లుగా నమోదైంది. ఇక, 6 రోజుల్లో దీనికి రూ. 62.26 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 36.24 కోట్లు రాబడితేనే ఈ మూవీ క్లీన్ హిట్ స్టేటస్‌ను చేరుకుంటుంది.

Pawan Kalyan Starrer BRO Movie 6 Days Worldwide Official Box Office Collections

ఇలా అయితే హిట్ కష్టమే:మెగా హీరోలు పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్ హీరోలుగా నటించిన 'బ్రో (BRO)' మూవీకి ఆరంభం నుంచే మంచి టాక్ తెచ్చుకున్నా వసూళ్లను మాత్రం ఆశించిన స్థాయిలో రాబట్టడం లేదు. దీంతో ఈ చిత్రం మొదటి ఆరు రోజుల్లో 60 శాతం వసూళ్లను మాత్రమే కలెక్ట్ చేసింది. ఇదే కంటిన్యూ అయితే మాత్రం ఈ సినిమా బ్రేక్ ఈవెన్‌ టార్గెట్‌ను చేరడం కష్టమే అని చెప్పాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X