BRO Collections: చిరంజీవి రికార్డు బ్రేక్ చేసిన పవన్.. ఆ పాన్ ఇండియా మూవీలు ఔట్.. బాలయ్య మాత్రం సేఫ్

తెలుగు సినీ ఇండస్ట్రీలో మల్టీస్టారర్ మూవీల హవా కనిపిస్తోంది. ఇలా ఇప్పటికే వచ్చిన చాలా చిత్రాలు సెన్సేషన్ క్రియేట్ చేశాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు వచ్చిన మరో క్రేజీ మూవీనే 'బ్రో (BRO)'. మెగా ఫ్యామిలీకి చెందిన పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన ఈ చిత్రం విడుదలకు ముందే ఎన్నో అంచనాలను ఏర్పరచుకుంది.

అందుకు అనుగుణంగానే ఈ చిత్రం శుక్రవారమే ఎంతో గ్రాండ్‌గా రిలీజ్ అయింది. ఇక, ఈ 'బ్రో (BRO)' మూవీ ఓవర్సీస్‌లో అదిరిపోయే రికార్డులు నమోదు చేసుకుంది. ఆ వివరాలను మీరే చూడండి!

Pawan Kalyan Starrer BRO Movie Beats Waltair Veerayya Overseas Premiere Collections Record

మెగా మల్టీస్టారర్‌గా వచ్చింది: పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్‌లో రూపొందిన సినిమానే 'బ్రో (BRO)'. సముద్రఖని తెరకెక్కించిన ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. ఇందులో కేతిక శర్మ, ప్రియా ప్రకాశ్ వారియర్ హీరోయిన్లుగా నటించారు. దీనికి థమన్ సంగీతాన్ని అందించాడు. ఈ చిత్రం 'వినోదయ సీతమ్' అనే తమిళ సినిమాకు రీమేక్‌గా రూపొందింది.

Pawan Kalyan Starrer BRO Movie Beats Waltair Veerayya Overseas Premiere Collections Record

భారీ రిలీజ్.. థియేటర్లు ఫుల్: క్రేజీ మల్టీస్టారర్‌గా రూపొందిన 'బ్రో (BRO)' మూవీ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీన్ని ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 1500లకు పైగా థియేటర్లలో రిలీజ్ చేశారు. దీంతో అన్ని థియేటర్లూ ప్రేక్షకులతో కళకళలాడిపోయాయి. మరీ ముఖ్యంగా ఏపీ, తెలంగాణలోని సినిమా హాళ్లన్నీ మెగా అభిమానుల ధాటికి మోత మోగుతూ హౌస్‌ఫుల్ బోర్డులతో కనిపించాయి.

Pawan Kalyan Starrer BRO Movie Beats Waltair Veerayya Overseas Premiere Collections Record

అలాంటి టాక్.. రెస్పాన్స్‌తో: పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్ నటించిన 'బ్రో (BRO)' మూవీకి ఆరంభంలోనే మంచి టాక్ వచ్చింది. దీంతో ఈ చిత్రం హిట్‌గా నిలుస్తుందని, ప్రేక్షకుల నుంచి రెస్పాన్స్ బాగుంటుందని అంతా అనుకున్నారు. అందుకు అనుగుణంగానే దీనికి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లోనూ ఈ సినిమాకు అదిరిపోయే రెస్పాన్స్ దక్కింది. ముఖ్యంగా నైట్ షోలకు భారీ స్పందన దక్కింది.

Pawan Kalyan Starrer BRO Movie Beats Waltair Veerayya Overseas Premiere Collections Record

ప్రీమియర్స్‌‌కు ఎంత అంటే: క్రేజీ కాంబినేషన్‌లో రూపొందిన 'బ్రో (BRO)' మూవీకి ఓవర్సీస్‌లో మంచి స్పందనే దక్కింది. ముఖ్యంగా యూఎస్, కెనెడాలో 238 లొకేషన్లలో ఈ సినిమా ప్రీమియర్స్ ప్రదర్శించారు. ఈ నేపథ్యంలో యూఎస్ బాక్సాఫీస్ రిపోర్టు ప్రకారం.. ఈ సినిమాకు ప్రీమియర్స్ ద్వారానే 647k డాలర్స్ గ్రాస్ వచ్చింది. అంటే ఇండియన్ కరెన్సీలో రూ. 5.32 కోట్లు గ్రాస్ వచ్చినట్లు లెక్క.

Pawan Kalyan Starrer BRO Movie Beats Waltair Veerayya Overseas Premiere Collections Record

మొదటి రోజుతో కలిపి అలా: పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్ ప్రధాన పాత్రల్లో సముద్రఖని తెరకెక్కించిన 'బ్రో (BRO)' మూవీకి యూఎస్‌లో మొదటి రోజు మంచి స్పందన దక్కింది. ఫలితంగా ఈ సినిమాకు దాదాపు 179K డాలర్లు వసూలైనట్లు తెలిసింది. దీంతో ప్రీమియర్స్ ప్లస్ మొదటి రోజు కలెక్షన్లు కలిపి అక్కడ 827K డాలర్లు వచ్చాయి. అంటే రూ. 6.80 కోట్లు గ్రాస్ అక్కడ వసూలు అయింది.

Pawan Kalyan Starrer BRO Movie Beats Waltair Veerayya Overseas Premiere Collections Record

చిరంజీవికి షాక్.. ఆ రెండు: మెగా మల్టీస్టారర్‌గా వచ్చిన 'బ్రో (BRO)' మూవీ ప్రీమియర్స్ కలెక్షన్లతో కొన్ని రికార్డులను బ్రేక్ చేసింది. ముఖ్యంగా ఈ చిత్రం చిరంజీవి నటించిన 'వాల్తేరు వీరయ్య' ప్రీమియర్ కలెక్షన్ల రికార్డు (638k)ను బద్దలు కొట్టింది. అలాగే, పాన్ ఇండియా రేంజ్‌లో విడుదలైన 'దసరా' (526K డాలర్లు), 'లైగర్' (504K డాలర్లు) రికార్డులను సైతం ఇది బ్రేక్ చేసేసింది.

Pawan Kalyan Starrer BRO Movie Beats Waltair Veerayya Overseas Premiere Collections Record

బాలయ్య రికార్డు సేఫ్‌గానే: ఈ సంవత్సరంలో విడుదలైన భారీ తెలుగు చిత్రాలను చూసుకుంటే 'బ్రో (BRO)' మూవీ.. నందమూరి బాలకృష్ణ నటించిన 'వీర సింహా రెడ్డి' ప్రీమియర్స్ రికార్డును మాత్రం టచ్ చేయలేకపోయింది. ఆ మూవీ ప్రీమియర్స్ ద్వారా 708k డాలర్స్ వసూలు చేసింది. కానీ, 'బ్రో (BRO)' మూవీ మాత్రం 647k డాలర్స్‌తోనే ఆగిపోవడంతో బాలయ్య రికార్డు సేఫ్ అయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X