BRO Closing Collections: బ్రో మూవీ ఖేల్ ఖతం.. అన్ని కోట్ల నష్టాలతో డిజాస్టర్.. పవన్ చెత్త రికార్డు

సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత ఏకధాటిగా ప్రాజెక్టులను పూర్తి చేస్తూ సత్తా చాటుతోన్నాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. ఇలా ఇప్పటికే పలు చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన అతడు.. ఇటీవలే 'బ్రో (BRO)' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

ఇందులో సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ కూడా నటించడంతో దీనిపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. కానీ, వీటిని అందుకోవడంలో ఈ సినిమా విఫలం అయింది. ఫలితంగా ఆడియెన్స్ రెస్పాన్స్‌ను అంతగా దక్కించుకోలేక నష్టాలతో రన్ ముగించింది. మరి 'బ్రో (BRO)' క్లోజింగ్ కలెక్షన్లు మీరే చూడండి!

Pawan Kalyan Starrer BRO Movie Closing Worldwide Official Box Office Collections

బ్రో అంటూ వచ్చిన హీరోలు: పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్ కాంబోలో రూపొందిన మెగా మల్టీస్టారర్ మూవీనే 'బ్రో (BRO)'. సముద్రఖని తెరకెక్కించిన ఈ చిత్రం 'వినోదయ సీతమ్' అనే తమిళ మూవీకి రీమేక్‌గా వచ్చింది. ఇందులో కేతిక శర్మ, ప్రియా ప్రకాశ్ వారియర్ హీరోయిన్లుగా చేశారు. దీన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ.. జీ సంస్థతో కలిసి నిర్మించింది. ఈ సినిమాకు థమన్ మ్యూజిక్‌ను అందించాడు.

Pawan Kalyan Starrer BRO Movie Closing Worldwide Official Box Office Collections

బ్రో మూవీ బిజినెస్ డీటేల్స్: డివోషనల్ సబ్జెక్టుతో వచ్చిన 'బ్రో (BRO)' మూవీకి నైజాంలో రూ. 30 కోట్లు, సీడెడ్‌లో రూ. 14.20 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 37.30 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 80.50 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, కర్నాకట ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 5 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 14 కోట్లతో కలిపి.. దీనికి ప్రపంచ వ్యాప్తంగా రూ. 97.50 కోట్లు బిజినెస్ అయింది.

Pawan Kalyan Starrer BRO Movie Closing Worldwide Official Box Office Collections

అలాంటి టాక్.. తక్కువగానే: ఎమోషనల్ కంటెంట్‌తో రూపొందిన 'బ్రో (BRO)' మూవీకి మొదటి రోజే మంచి టాక్ వచ్చింది. అయినప్పటికీ దీనికి ఓపెనింగ్ భారీ స్థాయిలో రాలేదు. దీనికితోడు ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఈ చిత్రం అంతగా రాణించలేకపోయింది. ఇలా ఈ సినిమా 2 వారాల్లోనే దాదాపుగా రన్‌ను కంప్లీట్ చేసుకుంది. ఫలితంగా దీనికి కోట్లలోనే నష్టాలు కూడా ఎదురయ్యాయి.

Pawan Kalyan Starrer BRO Movie Closing Worldwide Official Box Office Collections

తెలుగులో ఎంత వచ్చింది: ఫుల్ రన్‌లో 'బ్రో (BRO)' మూవీకి తెలుగులో తక్కువ స్పందనే వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 20.90 కోట్లు, సీడెడ్‌లో రూ. 6.95 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 6.93 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 4.87 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 4.39 కోట్లు, గుంటూరులో రూ. 4.54 కోట్లు, కృష్ణాలో రూ. 3.51 కోట్లు, నెల్లూరులో రూ. 1.78 కోట్లతో కలిపి.. రూ. 53.87 కోట్లు షేర్, రూ. 85.20 కోట్లు గ్రాస్ వచ్చింది.

Pawan Kalyan Starrer BRO Movie Closing Worldwide Official Box Office Collections

ప్రపంచ వ్యాప్తంగా ఎంతంటే: ఆంధ్రా, తెలంగాణలో ఫుల్ రన్‌లో రూ. 53.87 కోట్లు రాబట్టిన మెగా మల్టీస్టారర్ 'బ్రో (BRO)' మూవీ.. ప్రపంచ వ్యాప్తంగా పర్వాలేదనిపించింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 6.25 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 7.28 కోట్లు వసూలు చేసింది. వీటితో కలిపితే మొత్తంగా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా దీనికి రూ. 67.40 కోట్లు షేర్‌, రూ. 113.30 కోట్లు గ్రాస్ వచ్చింది.

టార్గెట్ ఇలా.. ఎంత రావాలి?: మామా అల్లుడు నటించిన 'బ్రో (BRO)' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 97.50 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 98.50 కోట్లుగా నమోదైంది. ఇక, ఫుల్ రన్‌లో దీనికి రూ. 67.40 కోట్లు వచ్చాయి. అంటే.. ఈ సినిమాకు మొత్తంగా రూ. 31.10 కోట్లు మేర నష్టాలు వచ్చినట్లు చెప్పుకోవాలి.

Pawan Kalyan Starrer BRO Movie Closing Worldwide Official Box Office Collections

పవన్ ఖాతాలో చెత్త రికార్డు: సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత పవన్ కల్యాణ్ మూడు సినిమాలు చేశాడు. అందులో థియేట్రికల్ రన్ పరంగా 'వకీల్ సాబ్' సినిమాకు రూ. 3.64 కోట్లు నష్టం వచ్చింది. ఆ తర్వాత వచ్చిన 'భీమ్లా నాయక్' మూవీకి రూ. 10.37 కోట్లు లాస్ వచ్చింది. ఇప్పుడు 'బ్రో' కూడా రూ. 31.10 కోట్లు నష్టాలు చవి చూసింది. దీంతో వరుసగా 3 ఫ్లాపులతో పవన్ ఖాతాలో చెత్త రికార్డు నమోదైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X