BRO Collections: పరాయి గడ్డపై పవన్ సంచలనం.. ఎన్టీఆర్‌ రికార్డు సమం.. టాప్‌లో ఉన్నది ఎవరంటే!

సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత గతంలో ఎన్నడూ లేనంత వేగంగా ప్రాజెక్టులను పూర్తి చేస్తూ వస్తున్నాడు టాలీవుడ్ టాప్ హీరో పవర్ స్టార్ పవన్ కల్యాణ్. ఇలా ఇప్పటికే పలు చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన అతడు.. ఇప్పుడు 'బ్రో (BRO)' అనే సినిమాతో వచ్చాడు. మల్టీస్టారర్‌గా రూపొందిన ఈ మూవీలో సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ కూడా నటించాడు. దీంతో ఇది ఆరంభంలోనే అంచనాలను ఏర్పరచుకుని విడుదలైంది. దీనికి భారీ రెస్పాన్స్ కూడా లభిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఓవర్సీస్‌లో ఈ చిత్రం రికార్డు సాధించింది. ఆ వివరాలు మీకోసం!

డివోషనల్ కాన్సెప్టుతోనే బ్రో
పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్ కాంబోలో వచ్చిన డివోషనల్ మూవీనే 'బ్రో (BRO)'. సముద్రఖని తెరకెక్కించిన ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. ఇందులో కేతిక శర్మ, ప్రియా ప్రకాశ్ వారియర్ హీరోయిన్లుగా నటించారు. దీనికి థమన్ సంగీతాన్ని అందించాడు. ఈ చిత్రం 'వినోదయ సీతమ్' అనే తమిళ సినిమాకు రీమేక్‌గా వచ్చింది.

BRO Movie

భారీ రెస్పాన్స్‌.. వసూళ్లు ఫుల్
టాలీవుడ్‌లోని ఇద్దరు స్టార్లు కలిసి నటించిన 'బ్రో (BRO)' మూవీ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఓవర్సీస్‌లో సహా చాలా ప్రాంతాల్లో దీనికి మంచి టాక్ వచ్చింది. ఫలితంగా మొదటి రోజు నుంచే థియేటర్లన్నీ ప్రేక్షకుల రాకతో సందడిగా మారాయి. దీంతో అన్ని చోట్లా పండుగ వాతావరణం నెలకొంది. తద్వారా ఈ చిత్రానికి కలెక్షన్లు భారీ స్థాయిలోనే వస్తున్నాయి.

ఓవర్సీస్‌లో మరింత ఎక్కువ
మిగిలిన ఏరియాలతో పోల్చుకుంటే ఓవర్సీస్‌లో 'బ్రో (BRO)' మూవీ సందడి మరింత ముందుగానే ప్రారంభం అయింది. అక్కడ ఈ చిత్రానికి సంబంధించిన బుకింగ్స్ ముందుగానే ఓపెన్ అయ్యాయి. దీనికితోడు మెగా అభిమానులు ఈ చిత్రం కోసం ముందు నుంచే ఆసక్తిని చూపించారు. దీంతో యూఎస్ సహా ఎన్నారైలు ఎక్కువున్న దేశాల్లో మరింత ఎక్కువ రెస్పాన్స్ వస్తోంది.

ప్రీమియర్స్‌‌, ఫస్ట్ డే ఇలానే
పవన్ కల్యాణ్, సాయి తేజ్ నటించిన 'బ్రో (BRO)' మూవీకి ఓవర్సీస్‌లో మంచి స్పందనే వచ్చింది. ముఖ్యంగా యూఎస్, కెనెడాలో 238 లొకేషన్లలో ఈ సినిమా ప్రీమియర్స్ ప్రదర్శించారు. ఇలా ఈ సినిమాకు ప్రీమియర్స్ ద్వారానే 647k డాలర్స్ గ్రాస్ వచ్చింది. అలాగే, ఫస్ట్ డే 216K డాలర్లు వచ్చాయి. ఇలా ప్రీమియర్స్ ప్లస్ ఫస్ట్ డే ఈ సినిమా 863K డాలర్లు రాబట్టింది.

రెండో రోజునే ఆ మార్క్ చేరి
ఓవర్సీస్‌లో ప్రీమియర్స్ ప్లస్ ఫస్ట్ డే వరకే 863K డాలర్లు వసూలు చేసిన 'బ్రో (BRO)' మూవీ.. రెండో రోజు మాత్రం తక్కువ స్పందననే అందుకుంది. ఫలితంగా శనివారం ఈ చిత్రానికి విదేశాల్లో 185K డాలర్లే వచ్చాయి. ఇలా ఈ చిత్రం అప్పుడే అక్కడ 1.04 మిలియన్ డాలర్లను వసూలు చేసింది. తద్వారా ఈ మార్కును చేరిన సినిమాగా 'బ్రో (BRO)' ఘనత సాధించింది.

BRO Movie

ఎన్టీఆర్‌తో సమానంగా పవన్
ఓవర్సీస్‌లో 'బ్రో (BRO)' మూవీ 1 మిలియన్ డాలర్ల మార్కును చేరుకోవడంతో.. పవన్ కల్యాణ్ ఖాతాలో కొన్ని ఘనతలు వచ్చి చేరాయి. ముందుగా అక్కడ ఈ మార్కును చేరుకున్న పవర్ స్టార్ ఏడో సినిమాగా ఇది నిలిచింది. తద్వారా ఓవర్సీస్‌లో ఏడుసార్లు ఒక మిలియన్ డాలర్ల మార్కును చేరుకున్న జూనియర్ ఎన్టీఆర్‌ రికార్డును పవన్ కల్యాణ్ సమం చేసేశాడు.

టాప్‌లో వాళ్లే.. పవన్ మూవీలు
ఓవర్సీస్‌లో అత్యధికంగా మహేశ్ బాబు 11 సార్లు ఒక మిలియన్ డాలర్ల మార్కును చేరాడు. ఆ తర్వాత నాని ఎనిమిది సినిమాలతో రెండో స్థానంలో ఉన్నాడు. ఇప్పుడు పవన్, ఎన్టీఆర్ మూడో స్థానంలో కొనసాగుతున్నారు. ఇక, గతంలో గబ్బర్ సింగ్, సర్దార్ గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది, కాటమరాయుడు, అజ్ఞాతవాసి, భీమ్లా నాయక్ మూవీలో మిలియన్ క్లజ్‌లో చేరాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X