BRO Day 1 Collections: ఈ కలెక్షన్లు ఏంటి బ్రో.. తొలి రోజే ఈ రేంజ్‌లోనా.. ఆ డిజాస్టర్ కంటే తక్కువే!
టాలీవుడ్‌లో మెగా ఫ్యామిలీకి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. దీనికి కారణం ఆ కుటుంబం నుంచి ఎంతో మంది హీరోలు ఇండస్ట్రీలో హవాను చూపిస్తూ దూసుకుపోవడమే. అందులో పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ కలిసి చేసిన చిత్రమే 'బ్రో (BRO)'.
డివోషనల్ కాన్సెప్టుతో రూపొందిన ఈ చిత్రం శుక్రవారమే విడుదలైంది. దీనికి ప్రతికూల వాతావరణ పరిస్థితుల మధ్యన కూడా మొదటి రోజు మంచి స్పందనే లభించింది. కానీ, కలెక్షన్లు మాత్రం ఆశించిన స్థాయిలో దక్కలేదు. మరి 'బ్రో (BRO)' మూవీ ఫస్ట్ డే రిపోర్టును మీరే చూడండి!

బ్రో అంటూ వచ్చిన హీరోలు: పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్‌లో రూపొందిన సినిమానే 'బ్రో (BRO)'. సముద్రఖని తెరకెక్కించిన ఈ చిత్రం 'వినోదయ సీతమ్' అనే తమిళ మూవీకి రీమేక్‌గా వచ్చింది. దీన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. ఇందులో కేతిక శర్మ, ప్రియా ప్రకాశ్ వారియర్ హీరోయిన్లుగా నటించారు. దీనికి థమన్ సంగీతాన్ని సమకూర్చాడు.

బ్రో మూవీ బిజినెస్ డీటేల్స్: మెగా హీరోలో కాంబోలో వచ్చిన 'బ్రో (BRO)' మూవీకి నైజాంలో రూ. 30 కోట్లు, సీడెడ్‌లో రూ. 13.20 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 37.30 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 80.50 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, కర్నాకట ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 5 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 12 కోట్లతో కలిపి.. ప్రపంచ వ్యాప్తంగా రూ. 97.50 కోట్లు బిజినెస్ చేసింది.

అలాంటి టాక్ వచ్చింది కానీ: మెగా హీరోలు కలిసి నటించిన 'బ్రో (BRO)' మూవీకి ఆరంభంలోనే మంచి టాక్ వచ్చింది. కానీ, తెలుగు రాష్ట్రాల్లో నెలకొన్న ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా స్పందన మాత్రం ఆశించిన రీతిలో దక్కలేదు. అయినప్పటకీ ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లోనూ ఈ సినిమాకు మంచి కలెక్షన్లు వస్తాయని అనుకున్నారు. అందుకు తగ్గట్లే డీసెంట్ ఓపెనింగ్స్ వచ్చాయి.

తొలి తెలుగు రాష్ట్రాల్లో ఇలా: 'బ్రో (BRO)'కి ఆంధ్రా, తెలంగాణలో ఫస్ట్ డే డీసెంట్ రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 8.45 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.70 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 2.60 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 2.45 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 2.98 కోట్లు, గుంటూరులో రూ. 2.51 కోట్లు, కృష్ణాలో రూ. 1.21 కోట్లు, నెల్లూరులో రూ. 71 లక్షలతో కలిపి.. రూ. 23.61 కోట్లు షేర్, రూ. 35.50 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతంటే: ఆంధ్రా, తెలంగాణలో భారీ స్థాయిలో రూ. 23.61 కోట్లు రాబట్టిన 'బ్రో (BRO)' మూవీ ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.10 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 4.30 కోట్లు వసూలు చేసింది. వీటితో కలిపితే తొలి రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా దీనికి రూ. 30.01 కోట్లు షేర్, రూ. 48.50 కోట్లు గ్రాస్ వచ్చింది.

టార్గెట్ ఇలా.. ఎంత రావాలి?: క్రేజీ కాంబినేషన్‌లో రూపొందిన 'బ్రో (BRO)' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 97.50 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 98.50 కోట్లుగా నమోదైంది. ఇక, తొలి రోజు దీనికి రూ. 30.01 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 68.49 కోట్లు రాబడితేనే ఈ మూవీ క్లీన్ హిట్ స్టేటస్‌ను చేరుకుంటుంది.

ఆ సినిమాల కంటే తక్కువగా: పవన్ కల్యాణ్ నటించిన చిత్రాలకు తెలుగులో భారీ ఓపెనింగ్స్ వస్తుంటాయి. కానీ, 'బ్రో (BRO)' మూవీకి మాత్రం ఆశించిన రీతిలో వసూళ్లు రాలేదు. ఫలితంగా అతడి గత చిత్రాలు 'భీమ్లా నాయక్' (26.42 కోట్లు), 'వకీల్ సాబ్' (32.24 కోట్లు), 'అజ్ఞాతవాసి' (26.40 కోట్లు) కంటే తక్కువే షేర్ వచ్చింది. దీనికి ప్రతికూల వాతావరణమే కారణం అని చెప్పొచ్చు.


Click it and Unblock the Notifications











