ఖరీదైన కారు కొనుగోలు చేస్తున్న పవన్ కళ్యాణ్.. జీవితంలోనే మొదటిసారి..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు ప్రజల సమస్యలపై స్పందించే విదంగా అడుగులు వేస్తున్నారు. గతంలో ఎప్పుడు లేని విధంగా సినిమాలతో కూడా బిజీబిజీగా గడుపుతున్నారు. వకీల్ సాబ్ అనంతరం వరుసగా నాలుగు సినిమాలకు కమిట్మెంట్ ఇచ్చాడు. ఇక పవర్ స్టార్ మొదటిసారి ఒక ఖరీదైన కారును కొనుగోలు చేసినట్లు సమాచారం.

పవన్ కళ్యాణ్ కరెక్ట్ గా ఫోకస్ పెడితే

పవన్ కళ్యాణ్ కరెక్ట్ గా ఫోకస్ పెడితే

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కరెక్ట్ గా ఫోకస్ పెడితే నేటి స్టార్ హీరోలకి ఏ మాత్రం తక్కువ కాకుండా వందల కోట్లు వెనకేసుకోవచ్చు. సినిమాలతో పాటు ఎన్నో రకాల బ్రాండ్స్ కు యాడ్స్ చేసే అవకాశం కూడా ఉంటుంది. భూములు కొనుగోలు చేసినా రేపటి నాటికి అవే వేల కోట్లు తెచ్చిపెడతాయి. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం పెద్దగా అటు వైపుకు వెల్లకపోవడం గమనార్హం.

ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు

ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు

పవర్ స్టార్ ఎలాంటి సినిమా చేసినా కూడా నిర్మాతలు ఆయన మార్కెట్ కు తగ్గట్లుగానే 50కోట్లకు పైగా రెమ్యునరేషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. పవన్ కూడా ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు మాత్రమే మళ్ళీ సినిమాలు చేసుకుంటున్నట్లు చాలా క్లారిటీగా అర్ధమయ్యింది.

ఆ లిస్టులో పవన్

ఆ లిస్టులో పవన్

అయితే మొదటిసారి పవర్ స్టార్ ఒక ఖరీదైన కారును కొనుగోలు చేసినట్లు టాక్ వస్తోంది. ప్రభాస్, అమితాబ్ బచ్చన్, షారూఖ్ ఖాన్, అల్లు అర్జున్, రణబీర్ కపూర్‌ వంటి వారు దేశంలోనే అత్యంత విలువైన లగ్జరీ రేంజ్ రోవర్ ఎస్‌యూవీలను మెయింటైన్ చేస్తున్నారు. ఇక ఆ లిస్టులో ఇప్పుడు పవన్ కూడా చేరిపోయాడు.

రూ.4 కోట్ల విలువైన రేంజ్ రోవర్

రూ.4 కోట్ల విలువైన రేంజ్ రోవర్

దాదాపు రూ.4 కోట్ల విలువైన రేంజ్ రోవర్ యొక్క ఆటోబయోగ్రఫీ మోడల్ కారును పవన్ కళ్యాణ్ పేరు మీద బుక్ చేసినట్లుగా తెలుస్తోంది. గతంలో పవన్ కళ్యాణ్ కార్లపై ఇతర ఆస్తులపై పెద్దగా ఫోకస్ పెట్టింది లేదు. అలాంటిది ఇప్పుడు 4కోట్ల విలువైన కారును కొనుగోలు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఆ కారును పవన్ కేవలం తన పర్సనల్ ఫ్యామిలీ కోసం కొనుగోలు చేసినట్లు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X