Pawan Kalyan Top 5 Movies: భీమ్లా నాయక్ కలెక్షన్లను హరిహర వీరమల్లు దాటుతుందా? పవన్‌కు 100 కోట్లు సాధిస్తుందా?
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటించిన హరిహర వీరమల్లు సినిమాను ప్రతిష్టాత్మకంగా రూపొందించారు. సినీ కథానాయకుడి హోదాలో కాకుండా ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో ఈ సినిమా రిలీజ్ అవుతుండటంతో ప్రత్యేక ఆసక్తి పెరిగింది. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ కలెక్షన్లపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో పవన్ కల్యాణ్ కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల వివరాల్లోకి వెళితే..
పాపులర్ ప్రొడక్షన్ హౌస్ నార్త్ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్‌పై ప్రముఖ నిర్మాత శరత్ మరార్ నిర్మించిన కాటమరాయుడు సినిమాను సుమారుగా 70 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఈ సినిమాలో పవన్ కల్యాణ్ సరసన శృతిహాసన్ నటించారు. 2017 సంవత్సరంలో రూపొందిన ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా 59.20 కోట్ల రూపాయలు షేర్, 97.5 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది.

ప్రముఖ నిర్మాణ సంస్థ హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందిన అజ్గాతవాసి సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను ఎస్ రాధాకృష్ణ నిర్మించారు. ఈ సినిమాను 70 కోట్ల బడ్జెట్‌తో రూపొందించగా.. 55 కోట్ల షేర్ వసూలు చేసింది. ఈ సినిమా డిజాస్టర్‌గా నిలిచినప్పటికీ.. ఈ రేంజ్‌లో వసూలు చేయడం పవన్ కల్యాణ్ స్టామినాను బాక్సాఫీస్ వద్ద తెలియజెప్పింది.
ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మించిన వకీల్ సాబ్ చిత్రం హిందీలో రూపొందిన పింక్ సినిమాకు రీమేక్. ఈ సినిమాను సుమారుగా 120 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఈ చిత్రంలో శృతిహాసన్ హీరోయిన్‌గా నటించారు. ఈ సినిమా ఏప్రిల్ 9వ తేదీ, 2021 సంవత్సరంలో రిలీజై భారీ వసూళ్లు సాధించింది. ఈ చిత్రం 137 కోట్ల రూపాయల గ్రాస్, 84 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లు రాబట్టింది.
ఇక మలయాళంలో భారీ విజయం సాధించిన అయ్యప్పనమ్ కోషియమ్ సినిమాకు రీమేక్‌గా భీమ్లా నాయక్ సినిమాను రూపొందించారు. ఈ చిత్రాన్ని సితారా ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నాగవంశీ రూపొందించారు. ఈ సినిమాను పవన్ కల్యాణ్ రెమ్యునరేషన్ మినహాయించి 75 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఫిబ్రవరి 25వ తేదీ 2022 సంవత్సరంలో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకొన్నది. ఈ చిత్రం 92 కోట్ల రూపాయల షేర్, 192 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు వసూలు చేసింది. ఏపీలో వైసీపీ ప్రభుత్వ హయాంలో అతి తక్కువ టికెట్ రేట్లతో ఈ సినిమాను ప్రదర్శించినప్పటికీ.. భారీ కలెక్షన్లు సాధించడం రికార్డుగా పేర్కొంటారు.
ఇక తమిళంలో సినీ విమర్శకుల ప్రశంసలు అందుకొన్న చిత్రం వినోదయ సీతమ్ సినిమాకు బ్రో రీమేక్. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరి బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించారు. ఈ చిత్రాన్ని పవన్ కల్యాణ్ రెమ్యునరేషన్ మినహాయించి 80 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఈ సినిమా 64 కోట్ల రూపాయలు షేర్. 115 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు సాధించింది. వైసీపీ సర్కార్ హాయంలో ఈ సినిమా టికెట్ రేట్లను భారీగా తగ్గించడంతో వాటి ప్రభావం బాక్సాఫీస్ కలెక్షనపై పడిందని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తుంటాయి.
ఇలాంటి పరిస్థితుల్లో అనేక అడ్డంకులు ఎదుర్కొని హరిహర వీరమల్లు సినిమా భారీ అంచనాలతో ముందుకొచ్చింది. ఈ సినిమా టికెట్ రేట్లు గణనీయంగా పెంచారు. పుష్ప, కల్కి సినిమాల స్థాయిలో ఈ సినిమా రేట్లను నిర్ధారించారు. దాంతో ఈ సినిమా పవన్ కల్యాణ్ కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డు కొల్లగొడుతుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నారు. పవర్ స్టార్ కెరీర్‌లో అత్యధికంగా 100 కోట్లకుపైగా షేర్ సాధిస్తుందనే అంచనా వేస్తున్నారు. ఈ సినిమా ద్వారా పవన్ 100 కోట్ల మైలురాయిని చేరుకొంటారా? లేదా అనేది వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











