Ustaad Bhagat Singh: ఓవర్సీస్‌లో ‘ఉస్తాద్ భగత్ సింగ్' ఊచకోత..అడ్వాన్స్ బుకింగ్స్ ఎన్ని కోట్లంటే?
Ustaad Bhagat Singh Advance Bookings Collections: పవర్ స్టార్ పవన్ కల్యాణ్, స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబో మూవీ 'ఉస్తాద్ భగత్ సింగ్'. ఉగాది పండుగ సందర్భంగా మార్చి 19 న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. రిలీజ్‌కు ముందే రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఇక అడ్వాన్స్ బుకింగ్స్‌లో దుమ్మురేపుతోంది. ఓవర్సీస్‌లో ఇప్పటికే బుకింగ్స్ ప్రారంభం కాగా టికెట్స్ హాట్ కేకుల్లా సేల్ అవుతున్నాయి. ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. నార్త్ అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్స్ విషయంలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ప్రీ సేల్స్ కలెక్షన్స్ ఎంతంటే?
ఉస్తాద్ భగత్ సింగ్ మూవీలో పవన్ కళ్యాణ్ సరసన శ్రీలీల, రాశీ ఖన్నా లు నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై ఉన్న అంచనాలు మరింత పెరిగాయి. ఇందులో ముఖ్యంగా టీజర్, సాంగ్స్ ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పిస్తున్నాయి. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. వాస్తవానికి ఈ సినిమాను మొదట మార్చి 26న విడుదల చేయాలని భావించారు. అయితే కన్నడ హీరో యష్ (Yash) నటించిన టాక్సిక్ (Toxic) సినిమా రిలీజ్ వాయిదా పడింది. దీంతో 'ఉస్తాద్ భగత్ సింగ్' రిలీజ్‌ను మార్చి 19కు మార్చారు. దీంతో ఈ సినిమా బాలీవుడ్ స్టార్ రణ్ వీర్ సింగ్ 'ధురంధర్ 2' తో బాక్సాఫీస్ పోటీకి సిద్ధమవుతోంది.

నార్త్ అమెరికాలో ప్రీమియర్ బుకింగ్స్
సినిమా విడుదలకు ఇంకా 5 రోజులు మాత్రమే ఉండగానే నార్త్ అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా సాగుతోంది. తాజా సమాచారం ప్రకారం ఇప్పటికే 7,500కి పైగా ప్రీమియర్ టికెట్లు అమ్ముడయ్యాయి. మొదట బుకింగ్స్ కొంచెం నెమ్మదిగా ప్రారంభమైనప్పటికీ, గత కొన్ని రోజుల్లో భారీగా పెరిగాయి. ప్రస్తుతం మొత్తం నార్త్ అమెరికా ప్రీమియర్ అడ్వాన్స్ సేల్స్ సుమారు 160,000 డాలర్ల నుంచి 170,000 డాలర్ల (సుమారు రూ.1.46 కోట్లు)వరకు చేరినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మొత్తం 1,024 ప్రీమియర్ షోలు ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. ఇక కెనడాలో కూడా ఈ సినిమాకు మంచి స్పందన లభిస్తోంది. అక్కడ 35 ప్రీమియర్ షోల కోసం ఇప్పటివరకు 584 టికెట్లు అమ్ముడై 11,592 డాలర్ల గ్రాస్ అందుకున్నట్టు తెలుస్తోంది.
స్టేట్ వైజ్ మంచి రెస్పాన్స్
అమెరికాలో ముఖ్యంగా టెక్సాస్ రాష్ట్రంలో ఈ సినిమాకు మంచి స్పందన కనిపిస్తోంది. మొత్తం USA గ్రాస్‌లో దాదాపు 23 శాతం వరకు టెక్సాస్ నుంచే వస్తున్నట్లు సమాచారం. అక్కడ సుమారు 35,000 డాలర్లు నుంచి 38,000 డాల్లర వరకు గ్రాస్ వచ్చినట్లు ట్రాకర్లు చెబుతున్నారు. వాషింగ్టన్, జార్జియా, కాలిఫోర్నియా వంటి రాష్ట్రాల్లో కూడా మంచి అడ్వాన్స్ బుకింగ్స్ నమోదవుతున్నాయి. తెలుగు డయాస్పోరా ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఈ సినిమా ప్రీమియర్ షోలపై మంచి ఆసక్తి కనిపిస్తోంది. విడుదలకు ఇంకా కొన్ని రోజులు ఉండటంతో ఈ సంఖ్యలు మరింత పెరిగే అవకాశముందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి
ముఖ్యంగా ట్రైలర్ విడుదల తర్వాత బుకింగ్స్ వేగంగా పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో నేటి నుంచి అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి. అవి ప్రారంభమైన తర్వాత 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ మోత మోగించే అవకాశం ఉందని అభిమానులు ఆశిస్తున్నారు. మొత్తంగా చూస్తే, ఓవర్సీస్ మార్కెట్‌లో ఇప్పటివరకు వచ్చిన స్పందన సినిమాపై ఉన్న అంచనాలను మరింత పెంచుతోంది. ఉగాది సందర్భంగా విడుదల కానున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











