UBS Overseas Box Office: ఓవర్సీస్ లో ఉస్తాద్ మేనియా.. పవన్ మూవీకి ఎన్ని కోట్లంటే?

Ustaad Bhagat Singh Box Office: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh). ఈ మూవీ రిలీజ్‌కు ముందే భారీ హైప్ సొంతం చేసుకుంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమాలో శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు.అశుతోష్ రాణా, నవాబ్ షా, గౌతమి, చమ్మక్ చంద్ర, నవాబ్ షా,నర్రా శ్రీను, నాగ మహేష్, చమ్మక్ చంద్ర, రెడిన్ కింగ్స్ లే, టెంపర్ వంశీ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

Also Read
ఐ లవ్ యూ చెప్పగానే బ్లాక్ చేశాడు.. ఆ హీరో అంటే పిచ్చి అంటున్న బిగ్ బాస్ బ్యూటీ
ఐ లవ్ యూ చెప్పగానే బ్లాక్ చేశాడు.. ఆ హీరో అంటే పిచ్చి అంటున్న బిగ్ బాస్ బ్యూటీ

ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను ఎస్. థమన్ అందించారు. ఉగాది కానుకగా మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానున్న ఈ సినిమాపై అంచనాలు పీక్స్‌లో ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్, సాంగ్స్ మూవీపై ఉన్న అంచనాలను మరింత పెంచాయి.ఈ క్రమంలో ఈ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా అడ్వాన్స్ బుకింగ్ రెస్పాన్స్ ఎలా ఉంది? ముఖ్యంగా ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్ ఎలా ఉంది? ఇప్పటి వరకు ఎన్ని కోట్లు వసూలు చేసిందనే వివరాల్లోకి వెళితే..

pawan-kalyans-ustaad-bhagat-singh-advance-bookings-worldwide-report-strong-buzz

ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ విషయంలో ఉస్తాద్ భగత్ సింగ్ సత్తా చాటుతుంది. ముఖ్యంగా నార్త్ అమెరికాలో ప్రీమియర్ షోల అడ్వాన్స్ సేల్స్ లో మొత్తం 432 లొకేషన్స్‌లో 1171 షోలు, 13,000కు పైగా టికెట్లు అమ్ముడవ్వడం గమనార్హం. ఈ తరుణంలో 300K డాలర్లు మార్క్ దాటినట్టు మూవీ మేకర్స్ ప్రకటించింది. 300K డాలర్లు అంటే.. 2.8 కోట్లు దాటినట్లు తెలుస్తోంది. ఈ మేరకు మూవీ మేకర్స్ సోషల్ పోస్టర్ విడుదల చేశారు. ఇక యూకే, ఆస్ట్రేలియా ఇతర దేశాల్లో 100K డాలర్లు వసూలు అందుకున్నట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ లెక్కన చూస్తే.. ఫ్రీ బుకింగ్స్ మరింత పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

Recommended For You
ఆ రూల్ బ్రేక్.. నాపై ఆ ఆశలు పెట్టుకోవద్దంటున్న శ్రీలీల..
ఆ రూల్ బ్రేక్.. నాపై ఆ ఆశలు పెట్టుకోవద్దంటున్న శ్రీలీల..

ఇక ఇండియాలో కూడా ఉస్తాద్ భగత్ సింగ్ అడ్వాన్స్ బుకింగ్ కు ఎనలేని స్పందన వస్తుంది. ఈ సినిమా టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. ఫస్ట్ డే అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పటికే రూ. 12.80 కోట్లకు చేరగా, మొత్తం 3,538 షోలలో 36.62% ఆక్యుపెన్సీ నమోదు అయినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్‌లో 780 షోలతో ₹3.20 కోట్లు వసూలు వచ్చినట్టు తెలుస్తున్నాయి.

ఈ లెక్కన చూస్తే.. ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ రూ. 16 కోట్ల మార్క్‌ను దాటాయి. నైజాం, ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల్లో బుకింగ్స్ బలంగా ఉండగా, కర్ణాటక, తమిళనాడు, ఇతర రాష్ట్రాల్లో కూడా స్థిరమైన వసూళ్లు కనిపిస్తున్నాయి. ఓవర్సీస్‌లో USAతో పాటు యూకే, ఆస్ట్రేలియా వంటి మార్కెట్లలో కూడా మంచి రెస్పాన్స్ వస్తుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

You May Also Like
Raashii Khanna:పెళ్లిపై నోరు విప్పిన రాశీ ఖ‌న్నా... త్వరలో తెలిసిపోతుందిలే అంటూ..
Raashii Khanna:పెళ్లిపై నోరు విప్పిన రాశీ ఖ‌న్నా... త్వరలో తెలిసిపోతుందిలే అంటూ..

ఇక ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మాస్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో పవన్ కళ్యాణ్ కనిపించనున్నాడు. యాక్షన్ సన్నివేశాలు, పవర్‌ఫుల్ డైలాగ్స్, హరీష్ శంకర్ మార్క్ ఎంటర్‌టైన్‌మెంట్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణలుగా నిలవనున్నాయి. గబ్బర్ సింగ్ తర్వాత ఈ కాంబినేషన్ రావడం కూడా హైప్‌ను పెంచింది. మొత్తంగా చూస్తే.. పవన్ కళ్యాణ్ క్రేజ్ మాత్రం ఎక్కడా తగ్గలేదని స్పష్టమవుతోంది. టాక్ పాజిటివ్‌గా వస్తే, మొదటి రోజు నుంచే బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X