Don't Miss!
- News మండుటెండల్లో నారాయణ విద్యాసంస్థల సిబ్బందికి ఎన్నికల కష్టం!!
- Sports T20 వరల్డ్ కప్‌కు భారత తుదిజట్టు ఇదే - సెహ్వాగ్
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Automobiles వరదలో చిక్కుకున్న రోల్స్ రాయిస్.. బానెట్‌పై కూర్చుకున్న వ్యక్తి వీడియో
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
- Lifestyle వేసవిలో కడుపులో చల్లగా ఉంచే కీరకాయ పెరుగుపచ్చడి-అన్నం, రోటీ లేదా చపాతీ దేనికైనా...
Vakeel Saab Day 4 collections: బాక్సాఫీస్‌ను కుదిపేస్తున్న వకీల్ సాబ్.. 100 కోట్ల మైలురాయిని దాటి..
ప్రపంచవ్యాప్తంగా భయాందోళనలను కలిగిస్తున్న కోవిడ్ 19 పరిస్థితులను ఎదురిస్తూ వకీల్ సాబ్ చిత్రం బాక్సాఫీస్ వద్ద హంగామా సృష్టిస్తున్నది. ఈ చిత్రం తొలి వారాంతంలోనే రూ.100 కోట్ల క్లబ్‌కు చేరువైంది. ఈ నేపథ్యంలో అన్ని రకాల ప్రతికూలతలను అధిగమిస్తూ వకీల్ సాబ్ చిత్రం కలెక్షన్ల పరంగా దూసుకెళ్తున్నది. ఈ క్రమంలో వకీల్ సాబ్ చిత్రం 4 రోజు కలెక్షన్లపై ట్రేడ్ వర్గాల అంచనా ఏమిటంటే..
4వ రోజున కూడా భారీగా కలెక్షన్లు
తెలుగు రాష్ట్రాల్లో వకీల్ సాబ్ చిత్రం 4వ రోజున కూడా దూసుకెళ్తున్నది. అన్ని సినిమాలకు అగ్ని పరీక్షగా నిలిచే సోమవారం రోజున కూడా దాదాపు అన్ని చోట్ల భారీ కలెక్షన్లు నమోదైనట్టు సమాచారం. వైజాగ్ సిటీలో ప్రదర్శిస్తున్న అన్ని థియేటర్లలో హౌస్ ఫుల్ కలెక్షన్లు నమోదయ్యాయని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అనంతపూర్, కర్నూలు, ఖమ్మం, వరంగల్, కరీంనగర్ లాంటి పట్టణాల్లో కూడా ఫుల్ కలెక్షన్లు ఉన్నట్టు తెలుస్తున్నది.
కర్ణాటకలో నైట్ కర్ఫ్యూ విధించినా..
ఇక కర్ణాటకలో ఈ చిత్రం ఇప్పటికే రూ.6.5 కోట్ల గ్రాస్‌ను, 3 కోట్ల నికర వసూళ్లను నమోదు చేసింది. బెంగళూరు, ఇతర పట్టణాల్లో నైట్ కర్ఫ్యూ నడుస్తున్న సమయంలో కూడా 4వ రోజు 60 శాతానికిపైగా అక్యుపెన్సీ నమోదు అయినట్టు సమాచారం. రానున్న రెండు రోజులు కూడా సెలవు దినాలు కావడంతో మరింత అక్యుపెన్సీ పెరిగే అవకాశం ఉందనే విషయాన్ని వెల్లడిస్తున్నారు.
సింగపూర్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలో
ఓవర్సీస్ విషయానికి వస్తే.. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌తోపాటు సింగపూర్‌లో కూడా వకీల్ సాబ్‌కు మంచి స్పందన వ్యక్తమవుతున్నదనే సమాచారం అందుతున్నది. గత మూడు రోజుల్లో ఈ చిత్రం 80 శాతం అక్యుపెన్సీతో భారీ వసూళ్లను నమోదు చేసినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
అమెరికాలో కలెక్షన్లు
ఇక అమెరికాలో వకీల్ సాబ్‌కు మంచి రెస్పాన్స్ దక్కుతున్నది. వారాంతం వరకే ఈ చిత్రం 600k డాల్లర్లను రాబట్టింది. కోవిడ్ పరిస్థితుల కారణంగా 50 శాతం అక్యుపెన్సీతో కూడా ఈ చిత్రం రికార్డు వసూళ్లను నమోదు చేసింది. తొలి వారం ముగిసే లోపుగా ఈ చిత్రం 1 మిలియన్ డాలర్ క్లబ్లో చేరడం ఖాయం అని ట్రేడ్ పండితులు పేర్కొంటున్నారు.
వకీల్ సాబ్ 4 వ రోజు కలెక్షన్ల అంచనా
ఇలాంటి పరిస్థితుల్లో వకీల్ సాబ్ నాలుగో రోజు కలెక్షనల అంచనాలు భారీగా ఉన్నాయి. సోమవారం వర్కింగ్ డే రోజున కూడా ఈ సినిమాకు మంచి స్పందన కనిపించిందని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో 4 వ రోజున వకీల్ సాబ్ సుమారు రూ.15 నుంచి 20 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.