twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Vakeel Saab pre release business: పవన్ రికార్డుల పరంపర.. బ్లాక్‌బస్టర్‌కు ఎంత వసూలు చేయాలంటే

    |

    పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన వకీల్ సాబ్ మూవీ రిలీజ్‌‌కు రంగం సిద్దమైంది. తెలుగు రాష్ట్రాల్లోనే ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్ భారీగా నమోదు అవుతున్నది. ఈ క్రమంలో ఈ సినిమాపై బారీగా అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా రిలీజ్‌కు ముందు వకీల్ సాబ్ ప్రీ రిలీజ్‌ బిజినెస్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ఈ సినిమా ఏ మేరకు బిజినెస్ చేసిందంటే...

    వకీల్ సాబ్ ప్రీరిలీజ్ ఈవెంట్: పవన్ కళ్యాణ్ నా దేవుడంటూ బండ్ల గణేష్ రచ్చ (ఫొటోలు)

    రికార్డులు తిరగరాయడం ఖాయం అంటూ

    రికార్డులు తిరగరాయడం ఖాయం అంటూ

    పవన్ కల్యాణ్ కమ్ బ్యాక్ మూవీ అనగానే వకీల్ సాబ్‌ రికార్డులకు అందని విధంగా అంచనాలు పెరిగిపోయాయి. ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత ఈ సినిమాపై మరింత క్రేజ్ పెరిగింది. దాంతో రికార్డులు తిరగరాయడం వకీల్ సాబ్‌కు అంత కష్టం కాదనే మాట వినిపిస్తున్నది.

    వైల్డ్ డాగ్ సక్సెస్ మీట్ (ఫొటోలు)

    నైజాం, సీడెడ్, ఉత్తరాంధ్రలో

    నైజాం, సీడెడ్, ఉత్తరాంధ్రలో

    ఇక వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే నైజాం థియేట్రికల్ హక్కులు రూ.23 కోట్లకు, అలాగే సీడెడ్ హక్కులు రూ.12 కోట్లకు, ఉత్తరాంధ్ర థియేట్రికల్ హక్కులు రూ.10 కోట్లకు అమ్ముడుపోయాయి. ఓ రకంగా చూస్తే ఇటీవల కాలంలో ఈ రేంజ్ బిజినెస్ ఈ ప్రాంతాల్లో జరగడం అరుదు అని అంటున్నారు.

    వైల్డ్ డాగ్ సినిమా చూసి రోమాలు నిక్కబొడుచుకొన్నాయి.. నాగ్‌పై చిరంజీవి ప్రశంసలు (ఫొటోలు)

    ఆంధ్రాలో పలు జిల్లాల్లో..

    ఆంధ్రాలో పలు జిల్లాల్లో..

    ఇక ఆంధ్రాలోని ప్రధానమైన జిల్లాలైన పశ్చిమ గోదావరి జిల్లా హక్కులు రూ.7 కోట్లకు, కృష్ణా జిల్లా హక్కులు రూ.6 కోట్లకు, నెల్లూరు జిల్లా హక్కులు రూ.3.35 కోట్ల మేరకు అమ్ముడుపోయినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

    ఎర్ర చీర మూవీ సాంగ్ రిలీజ్ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

    కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో

    కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో

    అలాగే కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో హక్కులు కూడా భారీ రేటు పలికాయి. ఇతర రాష్ట్రాలకు సంబంధించిన థియేట్రికల్ హక్కులు రూ.4 కోట్లకు అమ్ముడుపోయినట్టు సమాచారం. ఇక ఓవర్సీస్ విషయానికి వస్తే రూ.5 కోట్ల మేర రేటు పలికినట్టు తెలిసింది. అంతేకాకుండా రూ.6 కోట్లకుపైగా హక్కులను నిర్మాతలు సొంతంగా రిలీజ్ చేసుకోవడం జరిగిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

    బ్లాక్ బస్టర్ కావాలంటే

    బ్లాక్ బస్టర్ కావాలంటే

    దీంతో వకీల్ సాబ్ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ మొత్తంగా రూ.90 కోట్ల మేర జరిగినట్టు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది. దీంతో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే కనీసం రూ.95 కోట్లకుపైగా వసూళ్లను సాధించాల్సి ఉంటుంది. ఒకవేళ 95 కోట్లు సాధిస్తే హిట్‌గాను.. 100 నుంచి 125 కోట్ల మధ్య వసూలు చేస్తే సూపర్ హిట్ అని.. 125 కోట్లకుపైగా కలెక్ట్ చేస్తే బ్లాక్‌బస్టర్‌గా పరిగణించే అవకాశం ఉంది.

    English summary
    Sri Venkateswara Creations, Bay View Projects's Vakeel Saab is set release on April 9th. Dil Raju and Shirish Reddy are the producers and Boney Kapoor is the presenter. Before this movie release, unit organised Pre release event in Hyderabad. Apart from this, Vakeel Saab made 90 crores pre release business.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X