Vakeel Saab Final Collections: పవన్ కల్యాణ్ కెరీర్‌లో తొలిసారి.. బాక్సాఫీస్ వద్ద నష్టమెంతంటే!

కరోనావైరస్ సెకండ్ వేవ్ ప్రారంభానికి కొద్ది రోజుల ముందు అంటే ఏప్రిల్ 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన వకీల్ సాబ్ భారీ కలెక్షన్లను సాధించింది. కోవిడ్ పరిస్థితులను ఎదురించి తెలుగు రాష్ట్రాలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తన స్టామినాను బాక్సాఫీస్ వద్ద రుచి చూపించారు. ఈ క్రమంలో పవన్ కల్యాణ్ మూవీ ఫైనల్ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే...

లావణ్య త్రిపాఠి లవ్లీ ఫోటో గ్యాలరీ.. ట్రెండింగ్‌గా లేటేస్ట్ ఫోటోషూట్

ప్రతికూల పరిస్థితుల్లో భారీ కలెక్షన్లు

ప్రతికూల పరిస్థితుల్లో భారీ కలెక్షన్లు

కరోనావైరస్ కారణంగా థియేటర్లలో 18 రోజులు మాత్రమే ప్రదర్శించారు. ఓ వైపు ప్రతికూల పరిస్థితులు ఎదురైన గానీ అభిమానులు థియేటర్లకు పోటెత్తారు. దాంతో పవన్ కల్యాణ్ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా వకీల్ సాబ్ చిత్రం పలు రికార్డులను క్రియేట్ చేసింది.

యువ హీరోయిన్ పల్లవి దొర బ్యూటీఫుల్ ఫోటోలు..

18 రోజులకే ముగిసిన థియేట్రికల్ రన్

18 రోజులకే ముగిసిన థియేట్రికల్ రన్

వకీల్ సాబ్ థియేట్రికల్ రన్ తొలివారం భారీగానే సాగింది. అయితే తొలివారం తర్వాత సెకండ్ వేవ్ కరోనావైరస్ భారీగా దెబ్బ కొట్టింది. ఏపీలో కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోవడం, అలాగే తెలంగాణలో కూడా పాజిటివ్ కేసుల సంఖ్య ఊపందుకోవడంతో ప్రజలు భయాందోళలకు లోనయ్యారు. దాంతో థియేటర్లు బోసి పోవడంతో 18 రోజులకే సినిమా ప్రదర్శనలు ఆపివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దాంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్‌కు కాస్త దూరంలో ఆగిపోయింది.

శ్రద్దా అందాల ఆరబోత.. క్లీవేజ్ షోను చూస్తే కేక పెట్టాల్సిందే!

తెలుగు రాష్ట్రాల్లో 18 రోజుల కలెక్షన్లు

తెలుగు రాష్ట్రాల్లో 18 రోజుల కలెక్షన్లు

వకీల్ సాబ్ మూవీ తెలుగు రాష్ట్రాల్లో తొలి వారం రోజుల్లో భారీగానే వసూళ్లు నమోదు చేసింది. తొలి రోజున 32.24 కోట్లు, రెండో రోజున రూ.10.74 కోట్లు, మూడో రోజున రూ.10.39 కోట్లు, నాలుగో రోజున రూ.4.19 కోట్లు, ఐదో రోజున రుూ.8.90 కోట్లు, ఆరో రోజున రూ4.83 కోట్లు, ఏడో రోజున రూ.1.59 కోట్లు సాధించింది. ఆ తర్వాత కలెక్షన్లు క్షీణించాయి. దాంతో 18 రోజుల్లో తెలుగు రాష్ట్రా్లో రూ.78.77 కోట్లు షేర్, రూ.121 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

పొట్టి దుస్తుల్లో ఐశ్వర్వ మీనన్ రచ్చ.. హాట్ హాట్ ఫోటోషూట్

ప్రాంతాల వారీగా వసూళ్లు

ప్రాంతాల వారీగా వసూళ్లు

ఇక వకీల్ సాబ్ చిత్రం 18 రోజుల్లో ప్రాంతాల వారీగా వసూలు చేసిన వివరాల్లోకి వెళితే... నైజాంలో రూ.25.06 కోట్లు, సీడెడ్‌లో రూ.12.92 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ.11.73 కోట్లు, తూర్పు గోదావరి జిల్లాలో రూ.6.50 కోట్లు, పశ్చిమ గోదావరి జిల్లాలో రూ.7.02 కోట్లు, గుంటూరు జిల్లాలో రూ.7.13 కోట్లు, కృష్ణా జిల్లాలో రూ.5.02 కోట్లు, నెల్లూరు జిల్లాలో రూ.3.39 కోట్లు వసూలు చేసింది.

బొడ్డు చూస్తే క్లీన్ బౌల్డ్.. చీరకట్టులో పూజితా పొన్నాడ మరింత హాట్‌గా (ఫోటోలు)

ఓవర్సీస్‌, ఇతర రాష్ట్రాల్లో

ఓవర్సీస్‌, ఇతర రాష్ట్రాల్లో

ఇక కర్ణాటక, మిగితా రాష్ట్రాల్లో విషయానికి వస్తే.. రూ.3.67 కోట్లు వసూళ్లను సాధించింది. ఓవర్సీస్ విషయానికి వస్తే.. వకీల్ సాబ్ చిత్రం రూ.3.92 కోట్లు కలెక్ట్ చేసింది. అయితే ఓవర్సీస్‌లో వసూళ్ల భారీగా దెబ్బ తీశాయి. పవన్ కల్యాణ్ మిగితా సినిమాలతో పోలిస్తే ఈ సినిమాకు అమెరికాలో ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యాయి.

ప్రపంచవ్యాప్తంగా వసూళ్లు

ప్రపంచవ్యాప్తంగా వసూళ్లు

ప్రపంచవ్యాప్తంగా వకీల్ సాబ్ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. పవన్ కల్యాణ్ మూవీ మొత్తంగా రూ.86.36 కోట్ల షేర్‌ను, రూ.138.20 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. ఇక ఈ సినిమా వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ విషయానికి వస్తే రూ.89 మేర జరిగింది. అయితే 95 కోట్ల రూపాయల బ్రేక్ ఈవెన్ సాధించాల్సి ఉంటే.. సుమారు 9 కోట్లకుపైగా నష్టాలతో బాక్సాఫీస్ రన్ ముగిసింది.

Recommended Video

Gabbar Singh దెబ్బకు ఆ హీరో షాక్, PSPK 28 తో మళ్ళీ అదే మ్యానియా || Filmibeat Telugu
ఏపీలో ప్రభుత్వ ఆంక్షలతో

ఏపీలో ప్రభుత్వ ఆంక్షలతో

వకీల్ సాబ్ రిలీజ్‌ తర్వాత ఏపీలో జరిగిన టికెట్ల రేట్లు పెంపు వ్యవహారం గందరగోళాన్ని సృష్టించింది. వకీల్ సాబ్ టికెట్ల రేట్లు పెంపుపై ఏపీ సర్కార్ ఆంక్షలు విధించడంతో కలెక్షన్లపై భారీగా ప్రభావం పడింది. దాంతో ఈ చిత్రం బ్రేక్ ఈవెన్‌ను అందుకోలేకపోయింది. స్వల్ప నష్టాలతో థియేట్రికల్ రన్‌ అర్ధాంతరంగా ముగిసింది

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X