వకీల్ సాబ‌్‌కు తప్పని పరాజయం.. పవన్ కల్యాణ్ కెరీర్‌లో ఎన్నడూ లేని విధంగా
భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన వకీల్ సాబ్ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో భారీ కలెక్షన్లను సాధించింది. ఓవర్సీస్‌లో కూడా ఆరంభంలో భారీ వసూళ్లను రాబట్టింది. కానీ కరోనా పరిస్థితులు విజృంభించడంతో ప్రారంభంలో వచ్చిన కలెక్షన్లను ఈ చిత్రం నిలబెట్లుకోలేకపోయింది. అయితే యూఎస్‌లో ఈ చిత్రం దారుణమైన పరాజయం పొందడం అభిమానులకు, సినిమా యూనిట్‌కు షాక్ కలిగించింది.
వకీల్ సాబ్ చిత్రం అమెరికా బాక్సాఫీస్ వద్ద రూ.1.3 మిలియన్ డాలర్ల బ్రేక్ ఈవెన్ లక్ష్యంతో ప్రయాణాన్ని మొదలుపెట్టింది. తొలి రోజున ప్రీమియర్ల రూపంలో 300,557 డాలర్లను నమోదు చేసుకొన్నది.

ఒకటో రోజున 154,561 డాలర్లు
రెండో రోజున 144,028 డాలర్లు
మూడో రోజున 72,274 డాలర్లు
నాలుగో రోజున 14,241 డాలర్లు
ఐదో రోజున 16,980 డాలర్లు
ఆరో రోజున 8311 డాలర్లు
ఏడో రోజున 6951 డాలర్లు
ఎనిమిదో రోజున 10,669 డాలర్లు
తొమ్మిదో రోజున 14,501 డాలర్లు వసూలు చేసింది. దాంతో వకీల్ సాబ్ 743,073 డాలర్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. అంటే రూ.5.53 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది.
ప్రస్తుతం సాధించిన కలెక్షన్లను బట్టి చూస్తే.. వకీల్ సాబ్ బాక్సాఫీస్ రన్ ముగిసే సమయానికి నష్టాల్లో కూరుకొనే అవకాశం కనిపిస్తుందని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.


Click it and Unblock the Notifications











