'పులి' భారీ స్ధాయిలో గర్జన

ఇక అందిన విశ్వసనీయ సమాచారం ప్రకారం నిర్మాత సింగనమల రమేష్ దగ్గరకి 'పులి' ఆడియో రైట్స్ నిమిత్తం రెండు కోట్ల ఫ్యాన్సీ ఆఫర్ తో సోనీ మ్యూజిక్ వారు వచ్చినట్లు ఆయన దానిని రిజెక్టు చేసినట్లు తెలుస్తోంది. కోటి రూపాయలకు జల్సా ఆడియోని ఇంతకు ముందు ఆదిత్యా వారికి ఇచ్చి ఉండటంతో ఈ సినిమా ఆడియోని మినిమం మూడు కోట్లు కి అమ్మాలని నిర్మాత నిర్చయించుకున్నట్లు తెలుస్తోంది. అందులోనూ ఎ.ఆర్.రహమాన్ సంగీతం అందించటం ఈ సినిమా ఆడియో కు మరో పెద్ద ప్లస్సు.అయితే ఇదే రేటుకు ఆడియో రైట్స్ ని అమ్మ గలిగితే తెలుగు పరిశ్రమలో ఇదో పెద్ద రికార్డు.


Click it and Unblock the Notifications











