‘రాంబాబు’ యుఎస్ఏ కలెక్షన్స్...ఆవిషయంలో ఫెయిల్

By Bojja Kumar

లాస్ ఏంజిల్స్ : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా సినిమా 'కెమెరామెన్ గంగతో రాంబాబు' యూఎస్ఏ బాక్సాఫీసు వద్ద సైతం దుమ్మురేపే కలెక్షన్స్ సాధిస్తోంది. యుఎస్ఏలో విడుదలైన ఇండియన్ సినిమాల్లో టాప్ రేంజిలో దూసుకెలుతున్న ఈచిత్రం తాజాగా విడుదలైన కరణ్ జోహార్ 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్' మూవీ కలెక్షన్లను బీట్ చేసింది. అయితే పవర్ స్టార్ గత సినిమా 'గబ్బర్ సింగ్' కలెక్షన్ రికార్డను మాత్రం 'రాంబాబు' మూవీ బీట్ చేయలేక పోయింది.

సల్మాన్ ఖాన్ 'దబాంగ్' మూవీకి రీమేక్ గా రూపొందిన 'గబ్బర్ సిండ్' చిత్రం అమెరికాలో 50 స్క్రీన్లలో మాత్రమే విడుదలైనా...వసూళ్లు మాత్రం భారీగా రాబట్టింది. హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈచిత్రం అక్కడ ఓపెనింగ్ వీకెండ్ లో రూ. 4.13 కోట్లు($7,65,373) వసూలు చేసింది. యావరేజ్ గా ఒక్కో స్క్రీన్ కు $17,799 వసూలు చేసింది. ఇది ఒరిజినల్ మూవీ 'దబాంగ్' కంటే బెటర్ కలెక్షన్స్.

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన 'కెమెరామెన్ గంగతో రాంబాబు' చిత్రం యూఎస్ఏలో 80 స్క్రీన్లలో విడుదలైంది. ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద మంచి బిజినెస్ చేస్తున్నప్పటికీ 'గబ్బర్ సింగ్'ను మాత్రం బీట్ చేయలేక పోయింది. ఓపెనింగ్ వీకెండ్ ఈచిత్రం రూ. 2.88 కోట్లు($5,38,188) వసూలు చేసింది. బాలీవుడ్ మూవీ 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్' కేవలం రూ. 1.75($3,26,508) మాత్రమే వసూలు చేసింది.

గబ్బర్ సింగ్ భారీ విజయం నేపథ్యంలో 'కెమెరామెన్ గంగతో రాంబాబు' చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నప్పటికీ....గబ్బర్ సింగ్ రికార్డును ఈచిత్రం అధిగమించక పోవడం గమనార్హం. పవన్, తమన్నా జంటగా నటించిన ఈచిత్రానికి పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించారు. యూనివర్సల్ మీడియా బేనర్ పై డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించగా, మణిశర్మ సంగీతం సమకూర్చారు. విడుదలైన మరుసటి రోజే ఈచిత్రంపై తెలంగాణ వివాదం నెలకొన్నప్పటికీ...వివాదాస్పద సీన్లు తొలగించడంతో సినిమా విజయవంతంగా ప్రదర్శితం అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X