పవన్ ‘కాటమరాయుడు’ రిలీజ్ డేట్ ఇదిగో
హైదరాబాద్: పవర్ స్టార్ పవన్‌కళ్యాణ్ నటిస్తోన్న తాజా చిత్రం 'కాటమరాయుడు' షూటింగ్ రీసెంట్ గా మొదలై శరవేగంతో జరుగుతున్న విషయం తెలిసిందే. కిశోర్ పార్థసాని (డాలీ)డైరెక్షన్‌లో వస్తున్న ఈ మూవీ రిలీజ్ డేట్ ని ఖరారు చేసారు .
ఇక డిసెంబర్ కల్లా షూటింగ్ మొత్తం పూర్తి చేసి, వేసవి సీజన్ మొదట్లో సినిమాను విడుదల చేయాలని మొదట్నుంచీ ప్లాన్ చేసిన టీమ్, ఆ ప్రకారంగానే తాజాగా ఒక విడుదల తేదీని కూడా ఖరారు చేసింది.
ఉగాది పండుగను పురస్కరించుకొని మార్చి 29, 2017న కాటమరాయుడు సినిమాను విడుదల చేయనున్నట్లు టీమ్ తెలిపింది. ఇక కాటమరాయుడు మార్చికి ఫిక్స్ అయిపోవడంతో మిగతా సినిమాలన్నీ ఎప్పుడెప్పుడు విడుదలవుతాయన్నది చూడాలి.

ఇక ఈ చిత్రం తమిళంలో అజిత్ హీరోగా వచ్చిన 'వీరమ్' సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారనేది టాక్. అయితే ఈ రీమేక్ విషయాన్ని అఫీషియల్ గా కన్ఫామ్ అయితే చేయలేదు కానీ పవన్ లుక్ మాత్రం తెల్ల షర్ట్, పంచతో అచ్చం అజిత్ వీరంలో ఉన్నట్లే ఉంది.
అంతేకాదు... ఈ సినిమాలో హీరోయిన్.. ఒక మరదలు.. నలుగురు తమ్ముళ్ళు.. ఇలా ఆ సినిమాలో ఉన్న క్యారక్టర్లన్నీ తెలుగులో కూడా ఉన్నాయి. ఇక ఈ సినిమాలో మరో ఇద్దరు చిన్న హీరోయిన్లు కూడా నటిస్తున్నారు. అలాగే పెళ్ళిచూపులు ఫేం విజయ్.. మరో హీరో కమల్ కామరాజు.. పవన్ తమ్ముళ్లుగా నటిస్తున్నారు.
కాటమరాయుడులో శృతిహాసన్ రెండోసారి పవన్‌కు జోడీగా నటిస్తుంది. కన్నడ నటి మానసహిమవర్ష మరో కీలక పాత్రలో కనిపించనుంది.అనూప్ రూబెన్స్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: ప్రసాద్ మూరెళ్ళ.


Click it and Unblock the Notifications











