పవన్ కళ్యాణ్ 'తీన్ మార్' తొలి రోజు కలెక్షన్స్ అంచనా
పవన్ కళ్యాణ్ కెరీర్‌లోనే అత్యధికంగా 1150 ధియేటర్లలో విడుదలవుతున్న తీన్ మార్ చిత్రం చిత్రం తొలిరోజు అనగా నేడు 4000 ప్రదర్శనలు పూర్తి చేసుకోనుండడం ద్వారా టాలీవుడ్‌లో సరికొత్త రికార్డు సృష్టించనుంది. ఈ 4000 ప్రదర్శనల ద్వారా రూ.8 కోట్ల పైచిలుకు షేర్ వసూలు చేయగలదని టాలీవుడ్ ట్రేడ్ పండిట్స్ అంచనా వేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఈ చిత్రంలో రెండు విభిన్న పాత్రల్లో నటించారు. అర్జున్ పాల్వాయ్, మైఖేల్ వేలాయుధం పాత్రల్లో ఆయన అధ్బుతంగా కనిపిస్తాడంటున్నారు. కృతి, పరేష్ రావల్, అలీ, సోనూసూద్, ముఖేష్ రిషి తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: జైనన్ విన్సెంట్. ఆర్ట్: నారాయణరెడ్డి, నిర్మాత: గణేశ్ బాబు, స్క్రీన్‌ప్లే దర్శకత్వం: జయంత్ సి పరాన్జీ.


Click it and Unblock the Notifications











