హాస్పటల్లో సీరియస్ గా 'ఊసరవెల్లి' నటి
ఎన్టీఆర్ ఊసరవెల్లి చిత్రంలో నటించిన పాయిల్ ఘోష్ గుర్తుండే ఉంటుంది. ఆమె జనవరి 13 న హాస్పటిల్లో సీరియస్ పరస్దితుల్లో జాయినైంది. ఖాళీ కడుపుతో పెయిన్ కిల్లర్ తీసుకోవటంతో ఆమె పరిస్ధితి సీరియస్ గా మారింది. పంటినొప్పి రావటంతో ఆమె ఈ పెయిన్ కిల్లర్ తీసుకుంది. ఆ తర్వాత ఆమె జిమ్ కి వెళ్ళింది. అయితే జిమ్ చేస్తున్నప్పుడు ఆమెకు కళ్లు తిరుగుతున్నట్లు అనిపించటంతో వెంటనే హాస్పటిల్ కి వెళ్లింది. అక్కడకి వెళ్ళే సరికి ఆమె పరిస్ధితి బాగోలేదు. వెంటనే డాక్టర్స్ ఎడ్మిట్ చేసుకుని యాంటీ డోస్ ఇచ్చాక తెలివి వచ్చింది. ఇదంతా కలకొత్తాలో ఆమె సొంత ఇంటివద్ద జరిగింది.
ప్రస్తుతం ఆమె రికరవీ అవుతోంది. తెలుగులో ఆమె మంచు మనోజ్ సరసన హీరోయిన్ చేసింది. యేలేటి చంద్రశేఖర్ దర్శకత్వంలో రూపొందిన ప్రయాణం చిత్రం ద్వారా ఆమెను పరిచయం చేసారు. ఆ సినిమా ఫెయిల్యూర్ అయ్యింది. ఆ తర్వాత జంక్షన్ అనే చిత్రం కూడా చేసింది. అది వర్కవుట్ కాలేదు. ఆ తర్వాత ఊసరవెల్లి చిత్రంలో హీరోయిన్ ప్రెండ్ గా చేసింది. కాజల్ తో ఆమె చేసిన నటనకు ప్రశంసలు అయితే వచ్చాయి కానీ అవకాశాలు అయితే రాలేదు. ప్రస్తుతం ఆమె హాస్పటిల్ లో వైద్యుల పర్యవేక్షణలో ఉంది. త్వరలోనే డిశ్చార్జ్ చేస్తారని ఆమె కుటుంబ సభ్యులు చెప్పారు.


Click it and Unblock the Notifications











