Mangalavaaram 4 Days Collections: రూ.13 కోట్ల సినిమా.. 4 రోజుల్లో వచ్చిందంతే.. ఇంకా ఎంత రావాలంటే?

RX 100 సినిమాతో సంచలనం సృష్టించిన అజయ్ భూపతి.. తాజాగా మంగళవారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మంగళవారం సినిమా శుక్రవారం రిలీజ్ అయి దూసుకుపోతుంది. ఇక ఈ సినిమాకు పెద్ద ఎత్తున రెస్పాన్స్ వస్తుంది. ఇక మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ఈ సినిమా 4 రోజుల్లో ఎంత వసూలు చేసిందో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

RX100 మూవీతో డైరెక్టర్‌ అజయ్‌ భూపతి సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా హర్రర్ స్టోరీతో 'మంగళవారం' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పాయల్ రాజ్‌ పుత్ ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీని స్వాతి గుణుపాటి, సురేష్ వర్మ సంయుక్తంగా నిర్మించారు. ఇందులో అజయ్ ఘోష్, నందిత శ్వేత, కృష్ణ చైతన్య, దివ్య పిళ్లై తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీకి కాంతార ఫేమ్ అంజనీష్ లోక్‌నాథ్ సంగీతాన్ని అందించారు.

Payal Rajput Ajay Bhupathi Mangalavaaram Movie 4 Days Worldwide Box Office Collections

పాయల్ రాజ్ పుత్ ఆర్ఎక్స్ 100 తర్వాత అలాంటి ప్రధాన పాత్రలో నటించడంపై 'మంగళవారం' సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీంతో ఈ చిత్రం నైజాంలో రూ. 3.20 కోట్లు, ఆంధ్రప్రదేశ్, సీడెడ్ ఏరియాలను కలుపుకుని రూ. 7 కోట్లు, రెస్టాఫ్ ఇండియా కర్నాటక, ఓవర్సీస్ ఏరియాల్లో కలిపి రూ. 2 కోట్లు బిజినెస్ నమోదు చేసుకుంది. ఇలా ప్రపంచ వ్యాప్తంగా మంగళవారం సినిమా రూ. 12.20 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరుపుకుంది.

Bigg Boss Telugu 7: 12వ వారం ఆ టాప్ కంటెస్టెంట్ చేతిలో ఎవిక్షన్ పాస్... కానీ ఓ ట్విస్ట్!

మంగళవారం సినిమా 4 రోజుల్లో సినిమా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే... నైజాంలో రూ. 2.51 కోట్లు, సీడెడ్‌లో రూ. 92 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 72 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 42 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 29 లక్షలు, గుంటూరులో రూ. 40 లక్షలు, కృష్ణాలో రూ. 25 లక్షలు, నెల్లూరులో రూ. 18 లక్షలతో కలిపి.. రూ. 5.69 కోట్లు షేర్, రూ. 9.85 కోట్లు గ్రాస్ వచ్చింది.

Payal Rajput Ajay Bhupathi Mangalavaaram Movie 4 Days Worldwide Box Office Collections

మంగళవారం సినిమా థ్రిల్లర్ కాన్సెప్టుతో రూపొందటంతో ఈ మూవీకి దేశంలోని వేరే ప్రాంతాలతో పాటు ఓవర్సీస్‌లోనూ మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ క్రమంలోనే మంగళవారం సినిమాకు కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా ప్లస్ ఓవర్సీస్‌లో కలిసి మూడో రోజు రూ. 72 లక్షలు షేర్ వచ్చింది. వీటితో కలుపుకుంటే ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం రూ. 6.41 కోట్లు షేర్, 11.40 కోట్లు గ్రాస్ రాబట్టింది.
Payal Rajput Ajay Bhupathi Mangalavaaram Movie 4 Days Worldwide Box Office Collections

విభిన్నమైన కథాంశంతో రూపొందిన 'మంగళవారం' చిత్రం ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలనూ కలుపుకుని రూ. 12.20 కోట్లు వరకూ థియేట్రికల్ బిజినెస్ చేసుకున్నట్లు తెలిసింది. అంటే ఈ చిత్రం రూ.13 కోట్లు షేర్ బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో వచ్చింది. 4 రోజుల్లో ఈ సినిమాకు రూ. 6.41 రాబట్టింది. ఇక, ఇది హిట్ కావాలంటే మరో రూ. 6.59 కోట్లు షేర్ రాబట్టాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X