Mangalavaaram 12Days Collections: పాయల్ మూవీకి షాకింగ్ వసూళ్లు.. 12 రోజుల్లో భారీగా.. హిట్ కావాలంటే!
ఫస్ట్ మూవీతోనే సెన్సేషన్ అయ్యే దర్శకులు చాలా తక్కువ మందే ఉంటారు. టాలీవుడ్‌లో అలా అయిన వారిలో RX100 దర్శకుడు అజయ్ భూపతి ఒకరు. గ్రాండ్ ఎంట్రీని సొంతం చేసుకున్న అతడు.. రెండో చిత్రంతో నిరాశనే ఎదుర్కొన్నాడు.
ఈ పరిస్థితుల్లో ఇటీవలే అతడు 'మంగళవారం' అనే సినిమాను తెరకెక్కించాడు. పాయల్ రాజ్‌పుత్ ప్రధాన పాత్రను చేసిన ఈ చిత్రానికి మంచి టాక్‌తో పాటు రెస్పాన్స్ కూడా వచ్చింది. అయితే, ఇప్పుడు క్రమంగా డౌన్ అవుతోంది. మరి 'మంగళవారం' మూవీ 12 రోజుల్లో ఎంత వసూలు చేసిందో మీరే చూసేయండి!

థ్రిల్లర్ కాన్సెప్టుతో వచ్చింది: సెన్సేషనల్ హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ లీడ్ రోల్‌లో అజయ్ భూపతి తెరకెక్కించిన సస్పెన్స్ థ్రిల్లర్ మూవీనే 'మంగళవారం'. ఈ మూవీని స్వాతి గుణుపాటి, సురేష్ వర్మ సంయుక్తంగా నిర్మించారు. ఇందులో అజయ్ ఘోష్, నందిత శ్వేత, కృష్ణ చైతన్య, దివ్య పిళ్లై తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. ఈ సినిమాకు అంజనీష్ లోక్‌నాథ్ మ్యూజిక్‌ను కంపోజ్ చేశాడు.

అన్ని కోట్లు బిజినెస్ చేసింది: థ్రిల్లర్ సబ్జెక్టుతో రూపొందిన 'మంగళవారం' సినిమాపై ఆరంభంలోనే మంచి హైప్ క్రియేట్ అయింది. దీంతో ఈ చిత్రం నైజాంలో రూ. 3.20 కోట్లు, ఆంధ్రప్రదేశ్, సీడెడ్ ఏరియాలను కలుపుకుని రూ. 7 కోట్లు, రెస్టాఫ్ ఇండియా, కర్నాటక, ఓవర్సీస్ ఏరియాల్లో కలిపి రూ. 2 కోట్లు బిజినెస్ చేసింది. ఇలా ప్రపంచ వ్యాప్తంగా దీనికి రూ. 12.20 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది.

12వ రోజు ఎంత వచ్చిందంటే: ఇండియాలోనే ఎవరూ టచ్ చేయని కాన్సెప్టుతో రూపొందిన 'మంగళవారం' మూవీకి మొదటి రోజే మంచి టాక్ రావడంతో ఓపెనింగ్స్ భారీగా వచ్చాయి. కానీ, వీక్ డేస్‌లో ఈ సినిమా క్రమంగా డౌన్ అవుతూనే ఉంది. ఇలా మంగళవారం మాత్రం ఈ చిత్రానికి మరింత తక్కువ స్పందన దక్కింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో 12వ రోజు రూ. 22 లక్షలు షేర్ మాత్రమే రాబట్టింది.

12 రోజులకూ కలిపి ఎంతంటే: 'మంగళవారం' మూవీకి 12 రోజుల్లో తెలుగులో మంచి స్పందన వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 3.93 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.41 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 1.11 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 67 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 46 లక్షలు, గుంటూరులో రూ. 64 లక్షలు, కృష్ణాలో రూ. 46 లక్షలు, నెల్లూరులో రూ. 30 లక్షలతో కలిపి.. రూ. 8.98 కోట్లు షేర్, రూ. 16.55 కోట్లు గ్రాస్ వచ్చింది.
ప్రపంచ వ్యాప్తంగా ఎంతంటే: సస్పెన్స్ కథతో రూపొందిన 'మంగళవారం' మూవీకి దేశంలోని వేరే ప్రాంతాలతో పాటు ఓవర్సీస్‌లోనూ మంచి స్పందనే వచ్చిందని చెప్పాలి. ఫలితంగా ఈ విభిన్నమైన సినిమాకు కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా ప్లస్ ఓవర్సీస్‌లో కలిసి 12 రోజుల్లో రూ. 1.36 కోట్లు షేర్ వచ్చింది. వీటితో కలుపుకుంటే ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం రూ. 10.34 కోట్లు షేర్, 19.50 కోట్లు రాబట్టింది.

టార్గెట్ ఇలా.. ఎంత రావాలి?: అజయ్ భూపతి రూపొందించిన 'మంగళవారం' చిత్రం ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలనూ కలుపుకుని రూ. 12.20 కోట్లు వరకూ థియేట్రికల్ బిజినెస్ చేసుకున్నట్లు తెలిసింది. అంటే ఈ చిత్రం రూ. 13.00 కోట్లు షేర్ బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో వచ్చింది. 12 రోజుల్లో ఈ సినిమాకు రూ. 10.34 రాబట్టింది. ఇక, ఇది హిట్ కావాలంటే మరో రూ. 2.66 కోట్లు షేర్ రాబట్టాలి.


Click it and Unblock the Notifications











