Mangalavaaram 16 Days Collections: పాయల్ మూవీకి దిమ్మతిరిగే వసూళ్లు.. మంగళవారం హిట్ కావాలంటే!

తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించి ఈ మధ్య కాలంలో సస్పెన్స్ థ్రిల్లర్ మూవీలు భారీ స్థాయిలో వస్తున్నాయి. వాటికి మంచి రెస్పాన్స్ వస్తుండడంతో మరిన్ని చిత్రాలు రూపొందుతోన్నాయి. ఇటీవలే అలా వచ్చిన సినిమానే 'మంగళవారం'. RX100 దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కించిన ఈ చిత్రం ఆరంభం నుంచే మంచి స్పందనతో వసూళ్లను రాబట్టింది. అయితే, రెండో వారం నుంచి డౌన్ అయింది. ఈ పరిస్థితుల్లో వీకెండ్‌లో మళ్లీ పుంజుకుని కాస్త రాణించింది. మరి 'మంగళవారం' మూవీ 16 రోజుల్లో ఎంత వసూలు చేసిందో మీరే చూసేయండి!

థ్రిల్లర్ స్టోరీతో మంగళవారం:సెన్సేషనల్ హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ ప్రధాన పాత్రలో అజయ్‌ భూపతి తెరకెక్కించిన సస్పెన్స్ థ్రిల్లర్ మూవీనే 'మంగళవారం'. ఈ మూవీని స్వాతి గుణుపాటి, సురేష్ వర్మ సంయుక్తంగా నిర్మించారు. ఇందులో అజయ్ ఘోష్, నందిత శ్వేత, కృష్ణ చైతన్య, దివ్య పిళ్లై తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. ఈ సినిమాకు అంజనీష్ లోక్‌నాథ్ సంగీతాన్ని సమకూర్చారు.

Payal Rajput Starrer Mangalavaaram Movie 16 Days Worldwide Box Office Collections

అన్ని కోట్లు బిజినెస్ చేసింది:డిఫరెంట్ సబ్జెక్టుతో రూపొందిన 'మంగళవారం' సినిమాపై ఆరంభంలోనే మంచి హైప్ క్రియేట్ అయింది. దీంతో ఈ చిత్రం నైజాంలో రూ. 3.20 కోట్లు, ఆంధ్రప్రదేశ్, సీడెడ్ ఏరియాలను కలుపుకుని రూ. 7 కోట్లు, రెస్టాఫ్ ఇండియా, కర్నాటక, ఓవర్సీస్ ఏరియాల్లో కలిపి రూ. 2 కోట్లు బిజినెస్ చేసింది. ఇలా ప్రపంచ వ్యాప్తంగా ఇది రూ. 16.20 కోట్లు థియేట్రికల్ బిజినెస్ చేసింది.

16వ రోజు ఎంత వచ్చిందంటే:ఇండియాలోనే తొలిసారి విభిన్నమైన కథతో రూపొదిన 'మంగళవారం' మూవీకి మొదటి రోజే మంచి టాక్ రావడంతో ఓపెనింగ్స్ భారీగా వచ్చాయి. కానీ, వీక్ డేస్‌లో ఈ సినిమా క్రమంగా డౌన్ అవుతూనే ఉంది. అయితే, మూడో వీకెండ్‌లో ఇది పుంజుకుని కాస్త ఎక్కువగా రాణించింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో 16వ రోజు ఈ సినిమాకు రూ. 15 లక్షలు షేర్‌ వసూలు అయింది.

16 రోజులకూ కలిపి ఎంతంటే:'మంగళవారం' మూవీకి 16 రోజుల్లో తెలుగులో మంచి స్పందన వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 4.12 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.50 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 1.17 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 71 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 49 లక్షలు, గుంటూరులో రూ. 68 లక్షలు, కృష్ణాలో రూ. 48 లక్షలు, నెల్లూరులో రూ. 31 లక్షలతో కలిపి.. రూ. 9.47 కోట్లు షేర్, రూ. 17.45 కోట్లు గ్రాస్ వచ్చింది.

Payal Rajput Starrer Mangalavaaram Movie 16 Days Worldwide Box Office Collections

ప్రపంచ వ్యాప్తంగా ఎంతంటే:భిన్నమైన కథతో రూపొందిన 'మంగళవారం' మూవీకి దేశంలోని వేరే ప్రాంతాలతో పాటు ఓవర్సీస్‌లోనూ మంచి స్పందనే వచ్చిందని చెప్పాలి. ఫలితంగా ఈ విభిన్నమైన సినిమాకు కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా ప్లస్ ఓవర్సీస్‌లో కలిసి 16 రోజుల్లో రూ. 1.44 కోట్లు షేర్ వచ్చింది. వీటితో కలుపుకుంటే ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం రూ. 10.91 కోట్లు షేర్, 20.55 కోట్లు రాబట్టింది.

టార్గెట్ ఇలా.. ఎంత రావాలి?:అజయ్ భూపతి రూపొందించిన 'మంగళవారం' చిత్రం ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలనూ కలుపుకుని రూ. 12.20 కోట్లు వరకూ థియేట్రికల్ బిజినెస్ చేసుకున్నట్లు తెలిసింది. అంటే ఈ చిత్రం రూ. 13.00 కోట్లు షేర్ బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో వచ్చింది. 16 రోజుల్లో ఈ సినిమాకు రూ. 10.91 రాబట్టింది. ఇక, ఇది హిట్ కావాలంటే మరో రూ. 2.09 కోట్లు షేర్ రాబట్టాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X