Mangalavaaram 1st Week Collections: 13 కోట్ల సినిమా.. హిట్ టాక్‌తో షాకింగ్ వసూళ్లు.. ఎంత రావాలంటే!

సాధారణంగా ప్రతి ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ఎన్నో సినిమాలు వస్తుంటాయి. కానీ, అందులో కొన్ని మాత్రమే విపరీతమైన హైప్‌ను క్రియేట్ చేసుకుని గ్రాండ్‌గా రిలీజ్ అవుతుంటాయి. ఇప్పుడు అలా వచ్చిన సినిమానే 'మంగళవారం'. ఇండియాలోనే ఎవరూ టచ్ చేయని క్లిష్టమైన పాయింట్‌తో రూపొందిన ఈ చిత్రం గత వారంలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీనికి ఆరంభంలోనే మంచి టాక్ రావడంతో రెస్పాన్స్ చక్కగా వచ్చింది. కానీ, క్రమంగా స్పందన తగ్గిపోయింది. మరి 'మంగళవారం' మూవీ 7 రోజుల్లో ఎంత వసూలు చేసిందో మీరే చూసేయండి!

విభిన్నమైన కథతో వచ్చింది:సెన్సేషనల్ హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ ప్రధాన పాత్రలో అజయ్‌ భూపతి రూపొందించిన సస్పెన్స్ థ్రిల్లర్ మూవీనే 'మంగళవారం'. ఈ మూవీని స్వాతి గుణుపాటి, సురేష్ వర్మ సంయుక్తంగా నిర్మించారు. ఇందులో అజయ్ ఘోష్, నందిత శ్వేత, కృష్ణ చైతన్య, దివ్య పిళ్లై తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. ఈ సినిమాకు అంజనీష్ లోక్‌నాథ్ మ్యూజిక్ ఇచ్చాడు.

 Payal Rajput Starrer Mangalavaaram Movie 1st Week Worldwide Box Office Collections

అన్ని కోట్లు బిజినెస్ చేసింది:క్రైమ్ థ్రిల్లర్ జోనర్‌లో రూపొందిన 'మంగళవారం' సినిమాపై ఆరంభంలోనే మంచి హైప్ క్రియేట్ అయింది. దీంతో ఈ చిత్రం నైజాంలో రూ. 3.20 కోట్లు, ఆంధ్రప్రదేశ్, సీడెడ్ ఏరియాలను కలుపుకుని రూ. 7 కోట్లు, రెస్టాఫ్ ఇండియా, కర్నాటక, ఓవర్సీస్ ఏరియాల్లో కలిపి రూ. 2 కోట్లు బిజినెస్ చేసింది. ఇలా ప్రపంచ వ్యాప్తంగా దీనికి రూ. 12.20 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది.

7వ రోజు ఎంత వచ్చిందంటే:'మంగళవారం' మూవీకి మొదటి ఆట నుంచే మంచి టాక్ రావడంతో ఓపెనింగ్స్ బాగా వచ్చాయి. తర్వాత వీకెండ్‌లో కలెక్షన్లు భారీగా వచ్చాయి. కానీ, వీక్ డేస్‌లో ఈ సినిమా క్రమంగా డౌన్ అవుతూనే ఉంది. ముఖ్యంగా నాలుగో రోజు నుంచి క్రమంగా వసూళ్లు తగ్గిపోతున్నాయి. ఇలా పాయల్ నటించిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 7వ రోజు రూ. 40 లక్షలు షేర్‌ మాత్రమే రాబట్టింది.

ఏడు రోజులకూ కలిపి ఇలా:'మంగళవారం' మూవీకి 7 రోజుల్లో తెలుగులో మంచి స్పందన వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 3.19 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.10 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 87 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 55 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 38 లక్షలు, గుంటూరులో రూ. 51 లక్షలు, కృష్ణాలో రూ. 34 లక్షలు, నెల్లూరులో రూ. 23 లక్షలతో కలిపి.. రూ. 7.17 కోట్లు షేర్, రూ. 12.75 కోట్లు గ్రాస్ వచ్చింది.

 Payal Rajput Starrer Mangalavaaram Movie 1st Week Worldwide Box Office Collections

ప్రపంచ వ్యాప్తంగా ఎంతంటే:సెన్సేషనల్ స్టోరీతో వచ్చిన 'మంగళవారం' మూవీకి దేశంలోని వేరే ప్రాంతాలతో పాటు ఓవర్సీస్‌లోనూ మంచి స్పందనే వచ్చిందని చెప్పాలి. ఫలితంగా ఈ విభిన్నమైన సినిమాకు కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా ప్లస్ ఓవర్సీస్‌లో కలిసి వారం రోజుల్లో రూ. 1.02 కోట్లు షేర్ వచ్చింది. వీటితో కలుపుకుంటే ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం రూ. 8.19 కోట్లు షేర్, 15.05 కోట్లు రాబట్టింది.

టార్గెట్ ఇలా.. ఎంత రావాలి?:అజయ్ భూపతి తెరకెక్కించిన 'మంగళవారం' చిత్రం ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలనూ కలుపుకుని రూ. 12.20 కోట్లు వరకూ థియేట్రికల్ బిజినెస్ చేసుకున్నట్లు తెలిసింది. అంటే ఈ చిత్రం రూ. 13.00 కోట్లు షేర్ బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో వచ్చింది. వారం రోజుల్లో ఈ సినిమాకు రూ. 8.19 రాబట్టింది. ఇక, ఇది హిట్ కావాలంటే మరో రూ. 4.81 కోట్లు షేర్ రాబట్టాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X