Mangalavaaram 2 Days Collections: శనివారం షాకింగ్‌గా.. 2 రోజుల్లో అన్ని కోట్లు.. మూవీ హిట్ కావాలంటే!

ఈ మధ్య కాలంలో తెలుగు చిత్ర పరిశ్రమలో హర్రర్ థ్రిల్లర్ కాన్సెప్టుతో ఎన్నో సినిమాలు వస్తున్నాయి. వాటిలో చాలా వరకూ విజయాలు దక్కడంతో ఇంకాస్త ఎక్కువగా ఈ తరహా మూవీలు చేస్తున్నారు. అలా ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రమే 'మంగళవారం'.

RX100 వంటి క్రేజీ మూవీతో అందరి దృష్టిని ఆకర్షించిన దర్శకుడు అజయ్ భూపతి తీసిన దీనికి ఆరంభంలోనే మంచి టాక్ వచ్చింది. దీంతో ఆడియెన్స్ రెస్పాన్స్ కూడా బాగానే వస్తోంది. ఈ నేపథ్యంలో 'మంగళవారం' మూవీ 2 రోజుల్లో ఎంత వసూలు చేసిందో మీరే చూసేయండి!

Payal Rajput Starrer Mangalavaaram Movie 2 Days Worldwide Box Office Collections

భయపెట్టే కథతో వచ్చేశారుగా: RX100తో డైరెక్టర్‌ అజయ్‌ భూపతి భయపెట్టే కథతో తెరకెక్కించిన హర్రర్ సినిమానే 'మంగళవారం'. పాయల్ రాజ్‌పుత్ ప్రధాన పాత్ర చేసిన ఈ మూవీని స్వాతి గుణుపాటి, సురేష్ వర్మ సంయుక్తంగా నిర్మించారు. ఇందులో అజయ్ ఘోష్, నందిత శ్వేత, కృష్ణ చైతన్య, దివ్య పిళ్లై తదితరులు కీలక పాత్రలు చేశారు. ఈ మూవీకి అంజనీష్ లోక్‌నాథ్ సంగీతాన్ని ఇచ్చాడు.

Payal Rajput Starrer Mangalavaaram Movie 2 Days Worldwide Box Office Collections

అన్ని కోట్లు బిజినెస్ చేసింది: రియలిస్టిక్ రూరల్ బ్యాగ్‌డ్రాప్‌లో రూపొందిన 'మంగళవారం' సినిమాపై మంచి హైప్ క్రియేట్ అయింది. దీంతో ఈ చిత్రం నైజాంలో రూ. 3.20 కోట్లు, ఆంధ్రప్రదేశ్, సీడెడ్ ఏరియాలను కలుపుకుని రూ. 7 కోట్లు, రెస్టాఫ్ ఇండియా, కర్నాటక, ఓవర్సీస్ ఏరియాల్లో కలిపి రూ. 2 కోట్లు బిజినెస్ చేసింది. ఇలా ప్రపంచ వ్యాప్తంగా దీనికి రూ. 12.20 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది.

Payal Rajput Starrer Mangalavaaram Movie 2 Days Worldwide Box Office Collections

2వ రోజు ఎంత వచ్చిందంటే: 'మంగళవారం' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు అనుకున్న దానికంటే ఎక్కువ రెస్పాన్స్ లభించింది. అయితే రెండో రోజు మాత్రం సగానికి సగం డౌన్ అయింది. దీంతో ఈ చిత్రం శనివారం రూ. 85 లక్షలు వరకూ షేర్‌ను వసూలు చేసింది. అలాగే, వరల్డ్ వైడ్‌గా ఇది రూ. 1 కోటి వరకూ షేర్ రాబట్టింది. ఇలా రెండు రోజుల్లో ఇది రూ. 3.40 కోట్లు వరకూ కలెక్ట్ చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X