Mangalavaaram 3 Days Collections: సండే షాకింగ్ వసూళ్లు.. కోట్లు వచ్చినా.. పాయల్‌కు హిట్ రావాలంటే!
గతంలో కంటే ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల అభిరుచిలో మార్పులు వస్తున్నాయి. అయినప్పటికీ హర్రర్ థ్రిల్లర్ కాన్సెప్టులతో వచ్చే సినిమాలను మాత్రం వాళ్లు ఇష్టపడుతూనే ఉన్నారు. దీంతో అలాంటి చిత్రాలు పెద్ద సంఖ్యలోనే వస్తున్నాయి. ఇలా ఇప్పుడు వచ్చిన క్రేజీ సినిమానే 'మంగళవారం'. టాలెంటెడ్ డైరెక్టర్ అజయ్ భూపతి తెరకెక్కించిన ఈ మూవీకి ఆరంభంలోనే మంచి టాక్ దక్కింది. దీంతో ఓపెనింగ్స్ బాగానే వచ్చాయి. కానీ, మూడో రోజు మాత్రం దెబ్బపడింది. ఈ నేపథ్యంలో 'మంగళవారం' మూవీ 3 రోజుల్లో ఎంత వసూలు చేసిందో మీరే చూసేయండి!
హర్రర్ స్టోరీతో మంగళవారం:RX100 మూవీ డైరెక్టర్ అజయ్ భూపతి హర్రర్ స్టోరీతో తీసిన సినిమానే 'మంగళవారం'. పాయల్ రాజ్‌పుత్ ప్రధాన పాత్ర చేసిన ఈ మూవీని స్వాతి గుణుపాటి, సురేష్ వర్మ సంయుక్తంగా నిర్మించారు. ఇందులో అజయ్ ఘోష్, నందిత శ్వేత, కృష్ణ చైతన్య, దివ్య పిళ్లై తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. ఈ మూవీకి అంజనీష్ లోక్‌నాథ్ సంగీతాన్ని సమకూర్చాడు.

అన్ని కోట్లు బిజినెస్ చేసింది:పాయల్ ప్రధాన పాత్రలో క్రేజీ కాన్సెప్టుతో రూపొందిన 'మంగళవారం' సినిమాపై మంచి హైప్ క్రియేట్ అయింది. దీంతో ఈ చిత్రం నైజాంలో రూ. 3.20 కోట్లు, ఆంధ్రప్రదేశ్, సీడెడ్ ఏరియాలను కలుపుకుని రూ. 7 కోట్లు, రెస్టాఫ్ ఇండియా, కర్నాటక, ఓవర్సీస్ ఏరియాల్లో కలిపి రూ. 2 కోట్లు బిజినెస్ చేసింది. ఇలా ప్రపంచ వ్యాప్తంగా దీనికి రూ. 12.20 కోట్లు థియేట్రికల్ బిజినెస్ అయింది.
3వ రోజు ఎంత వచ్చిందంటే:'మంగళవారం' మూవీకి మంచి టాక్ రావడంతో ఓపెనింగ్స్ బాగా వచ్చాయి. రెండో రోజు కూడా ఇది సత్తా చాటింది. అయితే, మూడో రోజైన ఆదివారం వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ఉండడంతో ఈ సినిమాపై ప్రభావం కనిపించింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా రూ. 1.02 కోట్లు షేర్‌ను వసూలు చేసింది. అలాగే, రెండు కోట్ల రూపాలయ వరకూ గ్రాస్‌ను కలెక్ట్ చేసుకుంది.
మూడు రోజులకూ కలిపి ఇలా:'మంగళవారం' మూవీకి 3 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో మంచి స్పందన వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 2.16 కోట్లు, సీడెడ్‌లో రూ. 81 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 68 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 38 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 26 లక్షలు, గుంటూరులో రూ. 36 లక్షలు, కృష్ణాలో రూ. 22 లక్షలు, నెల్లూరులో రూ. 16 లక్షలతో కలిపి.. రూ. 5.03 కోట్లు షేర్, రూ. 8.70 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతంటే:థ్రిల్లర్ కాన్సెప్టుతో రూపొందిన 'మంగళవారం' మూవీకి దేశంలోని వేరే ప్రాంతాలతో పాటు ఓవర్సీస్‌లోనూ మంచి స్పందనే వచ్చిందని చెప్పాలి. ఫలితంగా ఈ విభిన్నమైన సినిమాకు కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా ప్లస్ ఓవర్సీస్‌లో కలిసి మూడో రోజు రూ. 65 లక్షలు షేర్ వచ్చింది. వీటితో కలుపుకుంటే ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం రూ. 5.68 కోట్లు షేర్, 10.05 కోట్లు రాబట్టింది.
టార్గెట్ ఇలా.. ఎంత రావాలి?:విభిన్నమైన కథాంశంతో రూపొందిన 'మంగళవారం' చిత్రం ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలనూ కలుపుకుని రూ. 12.20 కోట్లు వరకూ థియేట్రికల్ బిజినెస్ చేసుకున్నట్లు తెలిసింది. అంటే ఈ చిత్రం రూ. 13.00 కోట్లు షేర్ బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో వచ్చింది. మూడు రోజుల్లో ఈ సినిమాకు రూ. 5.68 రాబట్టింది. ఇక, ఇది హిట్ కావాలంటే మరో రూ. 7.32 కోట్లు షేర్ రాబట్టాలి.


Click it and Unblock the Notifications











