Mangalavaaram 5 Days Collections: టాక్ ఒకలా వసూళ్లు మరోలా.. 5 రోజుల్లో అన్ని కోట్లు.. హిట్ కావాలంటే!

తెలుగు చిత్ర పరిశ్రమలోకి దర్శకులుగా ఎంతో మంది పరిచయం అవుతున్నారు. అందులో ఫస్ట్ సినిమాతోనే సెన్సేషన్ హిట్‌ను అందుకున్న వాళ్లు తక్కువ మందే ఉన్నారు. వారిలో RX100 డైరెక్టర్ అజయ్ భూపతి ఒకరు. రియలిస్టిక్ స్టోరీతో సినిమాలు చేస్తోన్న అతడు.. ఇటీవలే 'మంగళవారం' అనే హర్రర్ థ్రిల్లర్ మూవీతో ఆడియెన్స్‌ను పలకరించాడు.

ఈ మూవీకి ఆరంభంలోనే మంచి టాక్ వచ్చింది. దీంతో ఓపెనింగ్స్ బాగానే వచ్చాయి. కానీ, వీక్ డేస్‌లో ఇది డౌన్ అవుతోంది. ఈ నేపథ్యంలో 'మంగళవారం' మూవీ 5 రోజుల్లో ఎంత వసూలు చేసిందో మీరే చూడండి!

Payal Rajput Starrer Mangalavaaram Movie 5 Days Worldwide Box Office Collections

క్రేజీ కాన్సెప్టుతో మంగళవారం: పాయల్ రాజ్‌పుత్ ప్రధాన పాత్రలో RX100 మూవీ డైరెక్టర్‌ అజయ్‌ భూపతి తెరకెక్కించిన హర్రర్ మూవీనే 'మంగళవారం'. ఈ మూవీని స్వాతి గుణుపాటి, సురేష్ వర్మ సంయుక్తంగా నిర్మించారు. ఇందులో అజయ్ ఘోష్, నందిత శ్వేత, కృష్ణ చైతన్య, దివ్య పిళ్లై తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. ఈ మూవీకి అంజనీష్ లోక్‌నాథ్ సంగీతాన్ని అందించారు.

Payal Rajput Starrer Mangalavaaram Movie 5 Days Worldwide Box Office Collections

అన్ని కోట్లు బిజినెస్ చేసింది: ఇండియాలోనే తొలిసారి భిన్నమైన కంటెంట్‌తో రూపొందిన 'మంగళవారం' సినిమాపై మంచి హైప్ క్రియేట్ అయింది. దీంతో ఈ చిత్రం నైజాంలో రూ. 3.20 కోట్లు, ఆంధ్రప్రదేశ్, సీడెడ్ ఏరియాలను కలుపుకుని రూ. 7 కోట్లు, రెస్టాఫ్ ఇండియా, కర్నాటక, ఓవర్సీస్ ఏరియాల్లో కలిపి రూ. 2 కోట్లు బిజినెస్ చేసింది. ఇలా ప్రపంచ వ్యాప్తంగా దీనికి రూ. 12.20 కోట్లు బిజినెస్ అయింది.

Payal Rajput Starrer Mangalavaaram Movie 5 Days Worldwide Box Office Collections

5వ రోజు ఎంత వచ్చిందంటే: 'మంగళవారం' మూవీకి మంచి టాక్ రావడంతో ఓపెనింగ్స్ బాగానే వచ్చాయి. అందుకు తగ్గట్లుగానే వీకెండ్‌లో కలెక్షన్లు భారీగా వచ్చాయి. కానీ, ఆ తర్వాతనే ఈ సినిమా క్రమంగా డౌన్ అవుతూ వస్తోంది. ముఖ్యంగా నాలుగు, ఐదు రోజుల్లో రెస్పాన్స్ బాగా తగ్గింది. దీంతో పాయల్ రాజ్‌పుత్ నటించిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 5వ రోజు రూ. 62 లక్షలు షేర్‌ మాత్రమే వసూలు అయింది.

ఐదు రోజులకూ కలిపి ఇలా: 'మంగళవారం' మూవీకి 5 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో మంచి స్పందన వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 2.80 కోట్లు, సీడెడ్‌లో రూ. 98 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 78 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 48 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 34 లక్షలు, గుంటూరులో రూ. 45 లక్షలు, కృష్ణాలో రూ. 28 లక్షలు, నెల్లూరులో రూ. 20 లక్షలతో కలిపి.. రూ. 6.31 కోట్లు షేర్, రూ. 11.05 కోట్లు గ్రాస్ వచ్చింది.

Payal Rajput Starrer Mangalavaaram Movie 5 Days Worldwide Box Office Collections

ప్రపంచ వ్యాప్తంగా ఎంతంటే: హర్రర్ కాన్సెప్టుతో రూపొందిన 'మంగళవారం' మూవీకి దేశంలోని వేరే ప్రాంతాలతో పాటు ఓవర్సీస్‌లోనూ మంచి స్పందనే వచ్చిందని చెప్పాలి. ఫలితంగా ఈ విభిన్నమైన సినిమాకు కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా ప్లస్ ఓవర్సీస్‌లో కలిసి ఐదు రోజుల్లో రూ. 85 లక్షలు షేర్ వచ్చింది. వీటితో కలుపుకుంటే ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం రూ. 7.16 కోట్లు షేర్, 13.05 కోట్లు రాబట్టింది.

Payal Rajput Starrer Mangalavaaram Movie 5 Days Worldwide Box Office Collections

టార్గెట్ ఇలా.. ఎంత రావాలి?: విభిన్నమైన కాన్సెప్టుతో రూపొందిన 'మంగళవారం' చిత్రం ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలనూ కలుపుకుని రూ. 12.20 కోట్లు వరకూ థియేట్రికల్ బిజినెస్ చేసుకున్నట్లు తెలిసింది. అంటే ఈ చిత్రం రూ. 13.00 కోట్లు షేర్ బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో వచ్చింది. ఐదు రోజుల్లో ఈ సినిమాకు రూ. 7.16 రాబట్టింది. ఇక, ఇది హిట్ కావాలంటే మరో రూ. 5.84 కోట్లు షేర్ రాబట్టాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X