Mangalavaaram 6 Days Collections: 6వ రోజు మరింత డౌన్.. టోటల్ అన్ని కోట్లు.. హిట్ కొట్టాలంటే మాత్రం!
ఏ భాషలోనైనా సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్‌లో వచ్చే సినిమాలకు కాస్త ఎక్కువ ఆదరణ లభిస్తుంటుందని చెప్పొచ్చు. అందుకే తెలుగులో కూడా ఈ తరహా చిత్రాలు ఎక్కువగానే వస్తుంటాయి. అందులో చాలా వరకూ ప్రేక్షకుల మెప్పును పొందుతున్నాయి. ఇప్పుడు అలా వచ్చిన చిత్రమే 'మంగళవారం'. RX100 తర్వాత అజయ్ భూపతి - పాయల్ రాజ్‌పుత్ కాంబోలో వచ్చిన ఈ సినిమాకు మంచి టాక్ వచ్చింది. కానీ, రెస్పాన్స్ మాత్రం ఆశించిన విధంగా రావట్లేదు. ఈ నేపథ్యంలో 'మంగళవారం' మూవీ 6 రోజుల్లో ఎంత వసూలు చేసిందో మీరే చూసేయండి మరి!
థ్రిల్లర్ స్టోరీతో మంగళవారం:క్రేజీ హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ మెయిన్ లీడ్‌గా అజయ్ భూపతి రూపొందించిన సస్పెన్స్ థ్రిల్లర్ మూవీనే 'మంగళవారం'. ఈ మూవీని స్వాతి గుణుపాటి, సురేష్ వర్మ సంయుక్తంగా నిర్మించారు. ఇందులో అజయ్ ఘోష్, నందిత శ్వేత, కృష్ణ చైతన్య, దివ్య పిళ్లై తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. ఈ సినిమాకు అంజనీష్ లోక్‌నాథ్ సంగీతాన్ని సమకూర్చాడు.

అన్ని కోట్లు బిజినెస్ చేసింది:ఇండియాలోనే ఎవరూ టచ్ చేయని పాయింట్‌తో రూపొందిన 'మంగళవారం' సినిమాపై మంచి హైప్ క్రియేట్ అయింది. దీంతో ఈ చిత్రం నైజాంలో రూ. 3.20 కోట్లు, ఆంధ్రప్రదేశ్, సీడెడ్ ఏరియాలను కలుపుకుని రూ. 7 కోట్లు, రెస్టాఫ్ ఇండియా, కర్నాటక, ఓవర్సీస్ ఏరియాల్లో కలిపి రూ. 2 కోట్లు బిజినెస్ చేసింది. ఇలా ప్రపంచ వ్యాప్తంగా దీనికి రూ. 12.20 కోట్లు బిజినెస్ జరిగింది.
6వ రోజు ఎంత వచ్చిందంటే:'మంగళవారం' మూవీకి ఆరంభంలోనే మంచి టాక్ రావడంతో ఓపెనింగ్స్ బాగా వచ్చాయి. తర్వాత వీకెండ్‌లో కలెక్షన్లు భారీగా వచ్చాయి. కానీ, వీక్ డేస్‌లో ఈ సినిమా క్రమంగా డౌన్ అవుతూ వస్తోంది. ముఖ్యంగా నాలుగో రోజు నుంచి క్రమంగా వసూళ్లు పడిపోతూనే ఉన్నాయి. దీంతో పాయల్ నటించిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 6వ రోజు రూ. 46 లక్షలు షేర్ మాత్రమే రాబట్టింది.
ఆరు రోజులకూ కలిపి ఇలా:'మంగళవారం' మూవీకి 6 రోజుల్లో తెలుగులో మంచి స్పందన వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 3.00 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.06 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 82 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 52 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 36 లక్షలు, గుంటూరులో రూ. 48 లక్షలు, కృష్ణాలో రూ. 31 లక్షలు, నెల్లూరులో రూ. 22 లక్షలతో కలిపి.. రూ. 6.77 కోట్లు షేర్, రూ. 11.95 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతంటే:విభిన్నమై కాన్సెప్టుతో వచ్చిన 'మంగళవారం' మూవీకి దేశంలోని వేరే ప్రాంతాలతో పాటు ఓవర్సీస్‌లోనూ మంచి స్పందనే వచ్చిందని చెప్పాలి. ఫలితంగా ఈ విభిన్నమైన సినిమాకు కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా ప్లస్ ఓవర్సీస్‌లో కలిసి ఆరు రోజుల్లో రూ. 92 లక్షలు షేర్ వచ్చింది. వీటితో కలుపుకుంటే ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం రూ. 7.69 కోట్లు షేర్, 14.05 కోట్లు రాబట్టింది.
టార్గెట్ ఇలా.. ఎంత రావాలి?:అజయ్ భూపతి తెరకెక్కించిన 'మంగళవారం' చిత్రం ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలనూ కలుపుకుని రూ. 12.20 కోట్లు వరకూ థియేట్రికల్ బిజినెస్ చేసుకున్నట్లు తెలిసింది. అంటే ఈ చిత్రం రూ. 13.00 కోట్లు షేర్ బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో వచ్చింది. ఆరు రోజుల్లో ఈ సినిమాకు రూ. 7.69 రాబట్టింది. ఇక, ఇది హిట్ కావాలంటే మరో రూ. 5.31 కోట్లు షేర్ రాబట్టాలి.


Click it and Unblock the Notifications











