Mangalavaaram Closing Collections: 13 కోట్ల మూవీ.. టాక్ ఒకలా వసూళ్లు మరోలా.. అన్ని కోట్ల నష్టాలా!
టాలీవుడ్‌లో ఈ మధ్య కాలంలో కొన్ని క్రేజీ సినిమాలు వచ్చాయి. అందులో డిఫరెంట్ కాన్సెప్టుతో తెరకెక్కిన చిత్రాలు ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నాయి. అలాంటి వాటిలో సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్‌లో వచ్చిన 'మంగళవారం' ఒకటి. పాయల్ రాజ్‌పుత్ ప్రధాన పాత్రలో రూపొందిన ఈ సినిమాకు ఆరంభంలోనే మంచి టాక్ వచ్చింది. కానీ, ఆడియెన్స్ రెస్పాన్స్ మాత్రం అనుకున్న రీతిలో రాలేదు. ఫలితంగా ఈ చిత్రం నష్టాలతోనే రన్‌ను ముగించాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో 'మంగళవారం' మూవీ ముగింపు సమయానికి ఎంత వసూలు చేసిందో మీరే చూసేయండి!
క్రేజీ స్టోరీతోనే మంగళవారం:బోల్డు హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ లీడ్ రోల్‌లో అజయ్ భూపతి తెరకెక్కించిన సస్పెన్స్ థ్రిల్లర్ మూవీనే 'మంగళవారం'. ఈ మూవీని స్వాతి గుణుపాటి, సురేష్ వర్మ సంయుక్తంగా నిర్మించారు. ఇందులో అజయ్ ఘోష్, నందిత శ్వేత, కృష్ణ చైతన్య, దివ్య పిళ్లై తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. ఈ సినిమాకు అంజనీష్ లోక్‌నాథ్ సంగీతాన్ని అందించాడు.

అన్ని కోట్లు బిజినెస్ చేసింది:విభిన్నమైన సబ్జెక్టుతో రూపొందిన 'మంగళవారం' సినిమాపై ఆరంభంలోనే మంచి హైప్ క్రియేట్ అయింది. దీంతో ఈ చిత్రం నైజాంలో రూ. 3.20 కోట్లు, ఆంధ్రప్రదేశ్, సీడెడ్ ఏరియాలను కలుపుకుని రూ. 7 కోట్లు, రెస్టాఫ్ ఇండియా, కర్నాటక, ఓవర్సీస్ ఏరియాల్లో కలిపి రూ. 2 కోట్లు బిజినెస్ చేసింది. ఇలా ప్రపంచ వ్యాప్తంగా ఇది రూ. 12.20 కోట్లు థియేట్రికల్ బిజినెస్ చేసింది.
అలాంటి టాక్.. వసూళ్లు ఇలా:ఇండియాలోనే ఏ భాషలోనూ టచ్ చేయని కాన్సెప్టుతో రూపొందిన 'మంగళవారం' మూవీకి మొదటి రోజే మంచి టాక్ రావడంతో ఓపెనింగ్స్ భారీగా వచ్చాయి. కానీ, వీక్ డేస్‌లో ఈ సినిమా క్రమంగా డౌన్ అవుతూ వచ్చింది. ఆ తర్వాత కూడా ఈ చిత్రం మంచి ప్రదర్శన చేయలేదు. దీంతో కేవలం 2 వారాల్లోనే ఈ సినిమా థియేట్రికల్ రన్‌ను దాదాపుగా పూర్తి చేసుకోవాల్సి వచ్చింది.
తెలుగులో వసూళ్లు ఎంతంటే:'మంగళవారం' మూవీకి ఫుల్ రన్‌లో తెలుగులో మంచి స్పందన వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 4.15 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.50 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 1.17 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 71 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 49 లక్షలు, గుంటూరులో రూ. 68 లక్షలు, కృష్ణాలో రూ. 48 లక్షలు, నెల్లూరులో రూ. 31 లక్షలతో కలిపి.. రూ. 9.50 కోట్లు షేర్, రూ. 17.50 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతంటే:క్రేజీ స్టోరీతో రూపొందిన 'మంగళవారం' మూవీకి దేశంలోని వేరే ప్రాంతాలతో పాటు ఓవర్సీస్‌లోనూ మంచి స్పందనే వచ్చిందని చెప్పాలి. ఫలితంగా ఈ విభిన్నమైన సినిమాకు కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా ప్లస్ ఓవర్సీస్‌లో కలిసి ఫుల్ రన్‌లో రూ. 1.45 కోట్లు షేర్ వచ్చింది. వీటితో కలుపుకుంటే ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం రూ. 10.95 కోట్లు షేర్, 20.60 కోట్లు రాబట్టింది.
టార్గెట్ ఇలా.. నష్టం ఎంత?:అజయ్ భూపతి రూపొందించిన 'మంగళవారం' చిత్రం ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలనూ కలుపుకుని రూ. 12.20 కోట్లు వరకూ థియేట్రికల్ బిజినెస్ చేసుకున్నట్లు తెలిసింది. అంటే ఈ చిత్రం రూ. 13.00 కోట్లు షేర్ బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో వచ్చింది. ఫుల్ రన్‌లో ఈ సినిమాకు రూ. 10.95 రాబట్టింది. దీంతో ఈ చిత్రం రూ. 2.05 కోట్లు నష్టాలతో నిరాశ పరిచింది.


Click it and Unblock the Notifications











