Mangalavaaram Day 1 Collections: పాయల్ మూవీకి భారీ వసూళ్లు.. తొలి రోజే అన్ని కోట్లు.. ఆ హీరోల కంటే!
మిగిలిన జోనర్ల కంటే హర్రర్ థ్రిల్లర్ కాన్సెప్టులతో వచ్చే చిత్రాలకు ప్రత్యేకమైన ఆదరణ లభిస్తుంటుంది. అందుకే ఈ మధ్య కాలంలో ఇలాంటి సినిమాలు తెలుగులో ఎక్కువగా వస్తున్నాయి. వాటిలో ఎక్కువ శాతం విజయాలను అందుకుంటున్నాయి. ఇప్పుడు అలా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమానే 'మంగళవారం'. పాయల్ రాజ్‌పుత్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి మంచి టాక్ వచ్చింది. దీంతో ఈ మూవీకి రెస్పాన్స్ కూడా బాగానే వచ్చింది. ఈ నేపథ్యంలో 'మంగళవారం' మూవీ మొదటి రోజు ఎంత వసూలు చేసిందో మీరే చూసేయండి!
మంగళవారం అంటూ కొత్తగా:RX100తో డైరెక్టర్‌గా ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న అజయ్ భూపతి తీసిన తాజా చిత్రమే 'మంగళవారం'. పాయల్ రాజ్‌పుత్ ప్రధాన పాత్ర చేసిన ఈ మూవీని స్వాతి గుణుపాటి, సురేష్ వర్మ సంయుక్తంగా నిర్మించారు. ఈ మూవీకి అంజనీష్ లోక్‌నాథ్ సంగీతాన్ని ఇచ్చాడు. ఇందులో అజయ్ ఘోష్, నందిత శ్వేత, కృష్ణ చైతన్య, దివ్య పిళ్లై తదితరులు కీలక పాత్రలు చేశారు.

అన్ని కోట్లు బిజినెస్ చేసింది:పల్లెటూరి నేపథ్యంతో భయపెట్టే కథతో రూపొందిన 'మంగళవారం' సినిమాపై మంచి హైప్ క్రియేట్ అయింది. దీంతో ఈ చిత్రం నైజాంలో రూ. 3.20 కోట్లు, ఆంధ్రప్రదేశ్, సీడెడ్ ఏరియాలను కలుపుకుని రూ. 7 కోట్లు, రెస్టాఫ్ ఇండియా, కర్నాటక, ఓవర్సీస్ ఏరియాల్లో కలిపి రూ. 2 కోట్లు బిజినెస్ చేసింది. ఇలా ప్రపంచ వ్యాప్తంగా దీనికి రూ. 12.20 కోట్లు వ్యాపారం జరిగింది.
అలాంటి టాక్.. భారీ రెస్పాన్స్:థ్రిల్లర్ కాన్సెప్టుతో రూపొందిన 'మంగళవారం' మూవీకి ప్రీమియర్ షోల నుంచే పాజిటివ్ టాక్ వచ్చింది. ఆ తర్వాత కూడా అదే సీన్ అంతటా కనిపించింది. ఫలితంగా ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి స్పందన ఆశించిన దానికంటే ఎక్కువే దక్కింది. దీంతో తొలి రోజే టాలీవుడ్ యంగ్ హీరోల సినిమాల కంటే ఎక్కువగానే వసూళ్లను ఈ సినిమా సాధించిందనే చెప్పుకోవాలి.
తొలి రోజే అన్ని కోట్ల వసూళ్లు:క్రేజీ కాన్సెప్టుతో రూపొందిన 'మంగళవారం' సినిమాకు మంచి టాక్ రావడంతో రెస్పాన్స్ కూడా భారీగానే లభించింది. ఫలితంగా ఈ చిత్రం మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ. 1.70 కోట్లు షేర్, రూ. 3.50 కోట్లు వరకూ గ్రాస్ వసూలు చేసింది. వరల్డ్ వైడ్‌గా రూ. 5 కోట్లు వరకూ గ్రాస్‌తో పాటు రూ. 2.50 కోట్లు వరకూ షేర్‌ను వసూలు చేసి సత్తా చాటుకుంది. దీనిపై మరింత సమాచారం కాసేపట్లే అప్‌డేట్ చేస్తాము.


Click it and Unblock the Notifications











