Mangalavaaram Business: పాయల్ మూవీకి రికార్డు బిజినెస్.. ఆ హీరోల కంటే.. ఎన్నికోట్లు వస్తే హిట్ అంటే!
తెలుగు చిత్ర పరిశ్రమలో హర్రర్ కాన్సెప్టుతో వచ్చే థ్రిల్లర్ మూవీలు బాగా సక్సెస్ అవుతున్నాయి. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో వచ్చిన చాలా సినిమాలు విజయాలను సొంతం చేసుకున్నాయి. దీంతో అలాంటి చిత్రాల సంఖ్య బాగా పెరుగుతోంది. ఇలా ఇప్పుడు రాబోతున్న మరో క్రేజీ మూవీనే 'మంగళవారం'. పాయల్ రాజ్‌పుత్ ప్రధాన పాత్రను పోషించిన ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. దీంతో ఇది గ్రాండ్‌గా రిలీజ్ కాబోతుంది. ఈ నేపథ్యంలో 'మంగళవారం' మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలను ఓ సారి చూసేద్దాం పదండి!
క్రేజీగా రాబోతున్న మంగళవారం:RX100 వంటి బిగ్గెస్ట్ హిట్ తర్వాత పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్‌గా.. అజయ్ భూపతి తెరకెక్కించిన మిస్టరీ థ్రిల్లర్ మూవీనే 'మంగళవారం'. ఈ చిత్రాన్ని స్వాతి గుణుపాటి, సురేష్ వర్మ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీకి అంజనీష్ లోక్‌నాథ్ సంగీతాన్ని ఇస్తున్నాడు. ఇందులో అజయ్ ఘోష్, నందిత శ్వేత, కృష్ణ చైతన్య, దివ్య పిళ్లై తదితరులు కీలక పాత్రలు చేశారు.

అలాంటి స్టోరీతో.. మిస్టరీ థ్రిల్లర్:ఒక గ్రామంలో ప్రతి మంగళవారం ఏదో ఒక భయానకమైన సంఘటన జరుగుతూ ఉంటుంది. దాని వెనక అసలు కథ ఏంటి? ఇంతకీ అక్కడ ఏం జరుగుతుంది? అనే అంశాలతో తెరకెక్కిన సినిమానే 'మంగళవారం'. అజయ్ భూపతి మార్క్ కథాంశంతో ఈ సినిమా మిస్టరీ థ్రిల్లర్ జోనర్‌లో రూపొందింది. దీంతో ఈ చిత్రంపై అందరిలోనూ ఆసక్తి క్రమంగా పెరుగుతూ వస్తోంది.
ప్రమోషన్ పూర్తి.. సందడిగానే:ఎలాగైనా ఈ సారి విజయాన్ని సొంతం చేసుకోవాలని అజయ్ భూపతి తీసిన 'మంగళవారం' మూవీ విడుదలకు సమయం దగ్గర పడడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను పూర్తి చేసింది. ఇప్పటికే చాలా ఈవెంట్లు కూడా చేసింది. అలాగే, ఇప్పటికే కొన్ని ఇంటర్వ్యూలు చేసుకున్నారు. ఇక, శుక్రవారమే దీన్ని ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నారు.

మంగళవారం బిజినెస్ ఇలా:థ్రిల్లర్ ఎలిమెంట్లతో సాగే స్టోరీతో రాబోయే 'మంగళవారం' మూవీపై ఆరంభంలోనే అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్లుగానే దీనికి డిమాండ్ బాగా వచ్చింది. దీంతో ఇది నైజాంలో రూ. 3.20 కోట్లు, ఆంధ్రప్రదేశ్, సీడెడ్ ఏరియాలను కలుపుకుని రూ. 7 కోట్లు బిజినెస్ చేసింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా రూ. 10.20 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసుకుంది.
వరల్డ్ వైడ్‌గా బిజినెస్ ఎంత:అజయ్ భూపతి దర్శకత్వంలో పాయల్ రాజ్‌పుత్ నటించిన 'మంగళవారం' మూవీపై అందరిలో ఆసక్తి ఉంది. అందుకే దీన్ని దక్షిణాది భాషల్లో సైతం గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నారు. ఫలితంగా రెస్టాఫ్ ఇండియా, కర్నాటక, ఓవర్సీస్ ఏరియాల్లో కలిపి రూ. 2 కోట్లు మేర బిజినెస్ చేసింది. ఇలా ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రికార్డు స్థాయిలో రూ. 12.20 కోట్లు బిజినెస్‌ను చేసుకుంది.

ఆ హీరోల కంటే.. టార్గెట్ ఇలా:పాయల్ రాజ్‌పుత్ నటించిన 'మంగళవారం' సినిమాకు ఊహించని విధంగా రూ. 12.20 కోట్లు బిజినెస్ జరిగింది. దీంతో ఈ సినిమాకు రూ. 13.00 కోట్లు బ్రేక్ ఈవెన్ టార్గెట్ నమోదైంది. అంటే.. ఇంత మొత్తం వసూలు చేస్తేనే 'మంగళవారం' సినిమా కమర్షియల్‌గా విజయం సాధిస్తుంది. ఇక, ఈ సినిమా బిజినెస్ టాలీవుడ్‌లోని యంగ్ హీరోల కంటే ఎక్కువే అని చెప్పాలి.


Click it and Unblock the Notifications











