Peddha Kapu 1 Collections షాకింగ్‌గా పెద్ద కాపు 1 కలెక్షన్లు.. ఎన్ని కోట్ల కలెక్షన్లు వచ్చాయంటే?
సెన్సిబుల్ డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల తన రూట్ మార్చి చేసిన చిత్రం పెద్ద కాపు 1. ఇప్పటి వరకు మానవ సంబంధాలతో సినిమాలను తెరకెక్కించిన ఆయన తాజాగా గోదావరి జిల్లాలో కులాల కుంపట్లు, తెలుగు దేశం పార్టీ ఆవిర్బావం నేపథ్యంగా జరిగిన రాజకీయ కుట్రలు, ఎత్తుగడల నేపథ్యంగా ఈ సినిమాను తెరకెక్కించారు. పెద్దకాపులో ఎమోషన్స్, యాక్షన్, తదితర అంశాలు ప్రత్యేక ఆకర్షణగా మారాయి. ఈ క్రమంలో పెద్దకాపు సినిమా బడ్జెట్ ఎంత? ఎంత బిజినెస్ జరిగింది? కలెక్షన్లు ఎలా ఉన్నాయనే వివరాల్లోకి వెళితే..
పెద్ద కాపు 1 చిత్రానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే.. తన మేనల్లుడు విరాట్ కర్ణను టాలీవుడ్‌కు పరిచయం చేస్తూ ఈ సినిమాను అఖండ నిర్మాత మిర్యాల రవిందర్ రెడ్డి నిర్మించారు. ఈ సినిమాలో ప్రగతి శ్రీవాస్తవ, ప్రగతి శ్రీవాస్తవ, రావు రమేష్, నాగబాబు, తనికెళ్ల భరణి, బ్రిగిడా సాగా, నరేన్ తదితరులు నటించారు. మిక్కీ జే మేయర్ సంగీతం అందించారు. చోటా కే నాయుడు సినిమాటోగ్రాఫర్‌గా, మార్తాండ్ కే వెంకటేష్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు.

పెద్ద కాపు 1 సినిమా బడ్జెట్ విషయానికి వస్తే.. ఈ చిత్రాన్ని ఆర్టిస్టుల రెమ్యునరేషన్లు, ప్రమోషన్ ఖర్చుతో కలిపి మొత్తంగా 10 కోట్ల రూపాయల బడ్జెట్ జరిగింది. ఈ సినిమా టీజర్లు, ట్రైలర్లకు మంచి బజ్ క్రియేట్ కావడంతో మంచి బజ్ ఏర్పడింది. దాంతో భారీగా ఈ సినిమాను రిలీజ్ చేశారు. రిలీజ్‌కు ముందే ఈ సినిమా పెయిడ్ ప్రీమియర్లను ప్రదర్శించారు.
పెద్ద కాపు 1 సినిమాకు రిలీజ్ తర్వాత మిక్స్ డ్ టాక్ వచ్చింది. మీడియాలో ఓ వర్గం నెగిటివ్‌గా, మరో వర్గం పాజిటివ్‌గా స్పందించింది. దాంతో తొలి రోజు కొంత స్లోగానే కలెక్షన్లు నమోదు అయ్యాయి. అయితే చంద్రముఖి 2, స్కంద సినిమాల నుంచి భారీగా పోటీ ఉండటంతో భారీగా కలెక్షన్లు రాబట్టలేకపోయింది.
పెద్ద కాపు 1 సినిమా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి రూపాయల గ్రాస్, 1.5 గ్రాస్ వసూళ్లను నమోదు చేస్తుందనే అంచనాను ట్రేడ్ వర్గాలు వేస్తున్నాయి. ఇక ఓవర్సీస్ కలెక్షన్లు, ఇతర రాష్ట్రాల కలెక్షన్లు కలిపితే మొత్తంగా తొలి రోజు ఈ సినిమా 1.75 కోట్ల రూపాయలు వసూలు చేసే ఛాన్స్ కనిపిస్తున్నది.
పెద్ద కాపు 1 సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ విషయానికి వస్తే.. ఈ సినిమాకు మీడియం రేంజ్ లక్ష్యాన్ని ట్రేడ్ వర్గాలు నిర్ణయించాయి. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే బాక్సాఫీస్ వద్ద కనీసం 4 కోట్ల రూపాయల షేర్, 8 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టాల్సి ఉంది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎన్ని రోజుల్లో అందుకొంటుందో వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











