twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Peddhanna Day 2 Collections: రెండో రోజు దారుణంగా పడిపోయిన కలెక్షన్లు.. ఎంత వచ్చాయంటే?

    |

    రజనీకాంత్ హీరోగా నయనతార హీరోయిన్ గా యాక్షన్ సినిమాల దర్శకుడు శివ దర్శకత్వంలో రూపొందిన సినిమా అన్నాత్తె. ఈ సినిమాను తెలుగులో పెద్దన్న పేరుతో రిలీజ్ చేశారు.. దీపావళి కానుకగా నవంబర్ 4న విడుదల అయిన ఈ సినిమాకు రజినీకాంత్ మార్కెట్ దృష్యా మంచి ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. కానీ ఊహించని విధంగా కలెక్షన్లు వస్తున్నాయి. ఈ సినిమా రెండు రోజుల్లో ఎంత కలెక్ట్ చేసింది అనే వివరాల్లోకి వెళితే

    అంత మార్కెట్ ఉన్నా

    అంత మార్కెట్ ఉన్నా

    టాలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ తెలుగు లోకల్ హీరోలతో సమానంగా బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో వసూళ్లు అందుకునే వారు. తమిళ్ లో ఎలాగైతే అభిమానులు ఉంటారో, తెలుగులో కూడా అలాగే మంచి స్టార్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు ఆయన. అయితే ఆయనకు ఫ్యాన్ ఫాలోయింగ్ గట్టిగా ఉన్నప్పటికీ ఈ మధ్య కాలంలో ఆయనకు సరైన హిట్ అయితే పడలేదు. రోబో సినిమా తర్వాత వచ్చిన అన్ని సినిమాలు కూడా పూర్తిస్థాయిలో విజయాన్ని అందుకోలేక పోగా అన్నాత్తె రీమేక్ పెద్దన్నతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజుల కలెక్షన్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

    తెలుగులో కూడా

    తెలుగులో కూడా

    అజిత్ తో కమర్షియల్ సినిమాలు చేసి మాస్ దర్శకుడుగా పేరు తెచ్చుకున్న శివ మొదటిసారి రజనీకాంత్ స్టార్ ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకొని తెరకెక్కించిన సినిమా అన్నాత్తే. ఈ సినిమాతో ఎలాగైనా మంచి విజయాన్ని అందుకోవాలని తెలుగులో దాన్నే పెద్దన్న పేరుతొ భారీ ఎత్తున విడుదల చేశారు. సినిమాలో నయనతార కీర్తి సురేష్ జగపతిబాబు స్టార్ నటీనటులు ఉండడంతో తెలుగులో కూడా అంచనాలు పెరిగాయి. మాములుగా రజినీకాంత్ ఎలాంటి సినిమా చేసినా కూడా తెలుగులో కూడా ప్రమోషన్స్ చేస్తారు. కానీ అనారోగ్య కారణాలతో ఆయన ఎక్కడా ప్రమోషన్స్ చేయలేదు. కానీ రజనీకాంత్ మార్కెట్ దృష్టిలో పెట్టుకొని తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున విడుదల చేశారు.

    ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత అంటే

    ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత అంటే

    ఇక పెద్దన్న సినిమా తెలుగు రాష్ట్రాల్లో టోటల్ గా 12.5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ తో విడుదలయ్యింది. బాక్సాఫీస్ వద్ద సినిమా 13 కోట్ల షేర్ అందుకోగలిగితే సినిమా సక్సెస్ అయినట్లు లెక్క కానీ పెద్దన్న సినిమా మొదటి రోజు ఎవరూ ఊహించని విధంగా కలెక్షన్స్ విషయంలో షాక్ ఇచ్చింది. ఒక విధంగా రజనీకాంత్ కెరీర్ లోనే మొదటి రోజు వచ్చిన తెలుగు సినిమా కలెక్షన్స్ లో ఇవి చాలా తక్కువ. రెండో రోజు కూడా మరీ దారుణంగా కలెక్షన్స్ వచ్చాయి.

    రెండో రోజు ఎంత వచ్చిందంటే?

    రెండో రోజు ఎంత వచ్చిందంటే?

    రెండవ రోజు పెద్దన్న సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో ఏరియాల వారీగా వచ్చిన షేర్ కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి. నైజాంలో 26 లక్షలు, సీడెడ్‌లో 12 లక్షలు, ఉత్తరాంధ్రతో 7 లక్షలు, తూర్పు గోదావరి జిల్లాలో 4 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లాలో 3 లక్షలు, గుంటూరులో 4 లక్షలు, కృష్ణా జిల్లాలో 4 లక్షలు, నెల్లూరులో 2.6 లక్షలు వచ్చాయి. ఆంధ్రా, నైజాంలో మొదటి రోజు మొత్తంగా 63 లక్షల షేర్ రాగా టోటల్ గా కోటి రూపాయల గ్రాస్ వసూళ్లను అందుకుంది.

    రెండు రోజులకు కలిపి ఎంత?

    రెండు రోజులకు కలిపి ఎంత?


    రెండు రోజులకు కలిపి రోజు పెద్దన్న సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో ఏరియాల వారీగా వచ్చిన షేర్ కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి. నైజాంలో 79 లక్షలు, సీడెడ్‌లో 36 లక్షలు, ఉత్తరాంధ్రతో 23 లక్షలు, తూర్పు గోదావరి జిల్లాలో 16 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లాలో 12 లక్షలు, గుంటూరులో 29 లక్షలు, కృష్ణా జిల్లాలో 15 లక్షలు, నెల్లూరులో 13 లక్షలు వచ్చాయి. ఆంధ్రా, నైజాంలో మొదటి రోజు మొత్తంగా 2.23 కోట్ల షేర్ రాగా టోటల్ గా 3.45 కోట్ల గ్రాస్ వసూళ్లను అందుకుంది.

    రావాల్సింది ఎంతంటే?

    రావాల్సింది ఎంతంటే?


    సినిమా వరల్డ్ వైడ్ గా తెలుగులో ఎంత వసూళ్లు అందుకుంది అనే విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో పెద్దన్న సినిమా మొత్తంగా 12.5 కోట్ల రిలీజ్ బిజినెస్ తో మార్కెట్లోకి వచ్చింది. బాక్సాఫీస్ వద్ద సక్సెస్ కావాలంటే 13 కోట్ల షేర్ ను రాబట్టాలి. ఇక మొదటి రెండు రోజుల్లో సినిమా కేవలం2.23 కోట్ల షేర్ మాత్రమే రాబట్టింది. అంటే ఇంకా 10.77 కోట్ల వరకు షేర్ రావాల్సి ఉంది. మరి సినిమా శని, ఆదివారం నాడు ఏమైనా లాభాలు అందుకుంటుందో లేదో చూడాలి.

    ప్రపంచవ్యాప్తంగా చూస్తే

    ప్రపంచవ్యాప్తంగా చూస్తే

    ఈ సినిమా తమిళనాడులో రెండు రోజులకు కలిపి 44.45 కోట్ల గ్రాస్, 23.60 కోట్ల షేర్ వసూలు చేసింది. అలాగే కర్ణాటకలో 5.6కోట్ల గ్రాస్, 2.7కోట్ల షేర్ వసూలు చేసింది. ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో కలిపి 3.45కోట్ల గ్రాస్ 2.23 కోట్ల షేర్ వసూలు చేసింది. కేరళలో 1.5కోట్ల గ్రాస్ 0.70కోట్ల షేర్ వసూలు చేసింది. మిగతా భారత దేశంలో 1.4కోట్ల గ్రాస్, 0.65కోట్ల షేర్ వసూలు చేసింది. ఇక భారత దేశం అంతా కలిపి 56.40కోట్ల గ్రాస్, 29.88కోట్ల షేర్ వసూలు చేసింది. అలాగే ఓవర్సేస్ లో 22 కోట్ల గ్రాస్, 10.80కోట్ల షేర్ వసూలు చేసింది. మొత్తం ప్రపంచవ్యాప్తంగా 78.4కోట్ల గ్రాస్, 40.68కోట్ల షేర్ వసూలు చేసింది.

    English summary
    Peddhanna Day 2 Box Office Collections: Rajini kanth's peddanna movie collected 2.23 crores share, 3.45 crores gross collections in 2 days.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X