Peddhanna Day 3 Collections: పెద్దన్న ఆ విషయంలో చిన్నన్నే.. మూడో రోజు కలెక్షన్లు పరిస్థితి ఇది!

రజనీ కాంత్ హీరోగా నయన తార హీరోయిన్ గా దర్శకుడు శివ దర్శకత్వంలో రూపొందిన సినిమా అన్నాత్తె ఈ సినిమాను రజనీ మార్కెట్ దృష్ట్యా తెలుగు లో పెద్దన్న పేరుతో రిలీజ్ చేశారు. దీపావళి కానుకగా నవంబర్ 4 న విడుదల అయిన ఈ సినిమా కు మంచి ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. కానీ మొదటి రోజు నుంచే దారుణమైన కలెక్షన్లు వస్తున్నాయి. ఈ సినిమా మొత్తం మూడు రోజుల్లో ఎంత కలెక్ట్ చేసింది అనే వివరాల్లోకి వెళితే

భారీ మార్కెట్

భారీ మార్కెట్

సూపర్ స్టార్ రజినీకాంత్ కు తమిళ్ లో ఎలాగైతే అభిమానులు ఉంటారో, తెలుగులో కూడా అలాగే మంచి స్టార్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు. అయితే ఆయనకు ఫ్యాన్ ఫాలోయింగ్ గట్టిగా ఉన్నప్పటికీ ఈ మధ్య కాలంలో ఆయనకు సరైన హిట్ అయితే పడలేదు. రోబో సినిమా తర్వాత వచ్చిన అన్ని సినిమాలు పూర్తిస్థాయిలో హిట్ కొట్టలేక పోయాయి. అయితే ఆయన దీపావళి సంధర్భంగా అన్నాత్తె రీమేక్ పెద్దన్నతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

మంచి ప్రీ రిలీజ్

మంచి ప్రీ రిలీజ్

అజిత్ తో వీరం, విశ్వాసం లాంటి హిట్ సినిమాలు చేసి మాస్ దర్శకుడుగా పేరు తెచ్చుకున్న శివ రజనీకాంత్ స్టార్ ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకొని తెరకెక్కించిన సినిమా అన్నాత్తే. ఈ సినిమాతో ఎలాగైనా మంచి విజయాన్ని అందుకోవాలని తెలుగులో దాన్నే పెద్దన్న పేరుతొ భారీ ఎత్తున విడుదల చేశారు మన నిర్మాతలు. సినిమాలో నయనతార సహా కీర్తి సురేష్, జగపతిబాబు, ఖుష్బూ, మీనా లాంటి నటీనటులు ఉండడంతో తెలుగులో కూడా అంచనాలు పెరిగాయి.

ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత అంటే

ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత అంటే

అలా పెద్దన్న సినిమా తెలుగు రాష్ట్రాల్లో టోటల్ గా 12.5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకుంది. దీంతో బాక్సాఫీస్ వద్ద సినిమా 13 కోట్ల షేర్ అందుకోగలిగితే సినిమా సక్సెస్ అయినట్లు లెక్క. కానీ పెద్దన్న సినిమా మొదటి రోజు ఎవరూ ఊహించని విధంగా కలెక్షన్స్ విషయంలో భారీ డ్రాప్స్ తో షాక్ ఇచ్చింది. ఒక విధంగా రజనీకాంత్ తెలుగు సినిమా కలెక్షన్స్ లో ఇవి చాలా తక్కువ కాగా రెండో రోజు కూడా మరీ దారుణంగా కలెక్షన్స్ వచ్చాయి. మరి మూడో రోజు సంగతి ఎలా ఉందో చూద్దాం.

మూడో రోజు ఎంత వచ్చిందంటే?

మూడో రోజు ఎంత వచ్చిందంటే?

మూడవ రోజు పెద్దన్న సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో ఏరియాల వారీగా వచ్చిన షేర్ కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి. నైజాంలో 16 లక్షలు, సీడెడ్‌లో 8 లక్షలు, ఉత్తరాంధ్రతో 4 లక్షలు, తూర్పు గోదావరి జిల్లాలో 3 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లాలో 2 లక్షలు, గుంటూరులో 3 లక్షలు, కృష్ణా జిల్లాలో 3 లక్షలు, నెల్లూరులో 2 లక్షలు వచ్చాయి. ఆంధ్రా, నైజాంలో మూడవ రోజు మొత్తంగా 41 లక్షల షేర్ రాగా టోటల్ గా 68 లక్షల గ్రాస్ వసూళ్లను అందుకుంది.

మూడు రోజులకు కలిపి ఎంత?

మూడు రోజులకు కలిపి ఎంత?

మూడు రోజులకు కలిపి రోజు పెద్దన్న సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో ఏరియాల వారీగా వచ్చిన షేర్ కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి. నైజాంలో 95 లక్షలు, సీడెడ్‌లో 44 లక్షలు, ఉత్తరాంధ్రతో 27 లక్షలు, తూర్పు గోదావరి జిల్లాలో 19 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లాలో 14 లక్షలు, గుంటూరులో 32 లక్షలు, కృష్ణా జిల్లాలో 18 లక్షలు, నెల్లూరులో 15 లక్షలు వచ్చాయి. ఆంధ్రా, నైజాంలో మూడు రోజులకు రోజు మొత్తంగా 2.64 కోట్ల షేర్ రాగా టోటల్ గా 4.20 కోట్ల గ్రాస్ వసూళ్లను అందుకుంది.

ప్రపంచవ్యాప్తంగా చూస్తే

ప్రపంచవ్యాప్తంగా చూస్తే

ఈ సినిమా తమిళనాడులో మూడు రోజులకు కలిపి 61.55 కోట్ల గ్రాస్, 34.4 కోట్ల షేర్ వసూలు చేసింది. అలాగే కర్ణాటకలో 6.95 కోట్ల గ్రాస్, 3.55 కోట్ల షేర్ వసూలు చేసింది. ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో కలిపి 4.20 కోట్ల గ్రాస్ 2.64 కోట్ల షేర్ వసూలు చేసింది. కేరళలో 1.7 కోట్ల గ్రాస్ 0.82 కోట్ల షేర్ వసూలు చేసింది. మిగతా భారత దేశంలో 1.7 కోట్ల గ్రాస్, 0.80 కోట్ల షేర్ వసూలు చేసింది. ఇక భారత దేశం అంతా కలిపి 76.10 కోట్ల గ్రాస్, 42.21 కోట్ల షేర్ వసూలు చేసింది. అలాగే ఓవర్సేస్ లో 24 కోట్ల గ్రాస్, 11.80 కోట్ల షేర్ వసూలు చేసింది. మొత్తం ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల గ్రాస్, 54.01 కోట్ల షేర్ వసూలు చేసింది.

Recommended Video

Manchi Rojulochaie Movie Team Theatre Visit | Blockbuster Celebrations
రావాల్సింది ఎంతంటే?

రావాల్సింది ఎంతంటే?

ఇక తెలుగు రాష్ట్రాల్లో పెద్దన్న సినిమా మొత్తంగా 12.5 కోట్ల రిలీజ్ బిజినెస్ తో మార్కెట్లోకి వచ్చింది. బాక్సాఫీస్ వద్ద సక్సెస్ కావాలంటే 13 కోట్ల షేర్ ను రాబట్టాలి. ఇక మొదటి మూడు రోజుల్లో సినిమా కేవలం 2.643 కోట్ల షేర్ మాత్రమే రాబట్టింది. అంటే ఇంకా 10.36 కోట్ల వరకు షేర్ రావాల్సి ఉంది. మరి సినిమా ఆదివారం నాడు ఏమైనా లాభాలు అందుకుంటుందో లేదో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X