twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Peddhanna Day 1 Box Office Collections: మరోసారి తగ్గిన తలైవా హవా.. పండగ రోజే అతి తక్కువగా..

    |

    టాలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ ఒకప్పుడు తెలుగులో కూడా లోకల్ హీరోలతో సమానంగా బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో వసూళ్లను అందుకునే వారు. దాదాపు తమిళ్ లో ఎలాగైతే అభిమానుల సంఖ్యను పెంచుకుంమరో అలాగే తెలుగులో కూడా తనకంటూ ఓ స్టార్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు. అయితే ఆయనకు ఫ్యాన్ ఫాలోయింగ్ గట్టిగానే ఉన్నప్పటికీ కూడా బాక్సాఫీస్ వద్ద తెలుగులో సరైన విజయం దక్కడం లేదు.

    రోబో సినిమా తర్వాత వచ్చిన అన్ని సినిమాలు కూడా పూర్తిస్థాయిలో విజయాన్ని అందుకోలేక పోయాయి. ఇక ఇప్పుడు అన్నత్తై రీమేక్ ను పెద్దన్న గా తెలుగులో విడుదల చేశారు. ఇక ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు వచ్చిన కలెక్షన్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

    తెలుగులో భారీగానే..

    తెలుగులో భారీగానే..

    ఎక్కువగా అజిత్ తో కమర్షియల్ సినిమాలు చేసిన మాస్ దర్శకుడు శివ మొదటిసారి రజనీకాంత్ స్టార్ ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకొని తెరకెక్కించిన సినిమా పెద్దన్న. ఈ సినిమాతో ఎలాగైనా మంచి విజయాన్ని అందుకోవాలని తెలుగులో అయితే భారీగా విడుదల చేశారు. సినిమాలో నయనతార కీర్తి సురేష్ జగపతిబాబు స్టార్ నటీనటులు ఉండడంతో తెలుగులో కూడా అంచనాలు పెరిగాయి.

    ఈసారి ప్రమోషన్స్ చేయకుండానే?

    ఈసారి ప్రమోషన్స్ చేయకుండానే?

    రజినీకాంత్ ఎలాంటి సినిమా చేసినా కూడా తెలుగులో కూడా ప్రమోషన్స్ చేసేందుకు ఎక్కువ ఆసక్తిని చూపిస్తారు. కాని ఈసారి పెద్దన్న సినిమా విషయంలో మాత్రం ఆయన తెలుగు మార్కెట్ పై పెద్దగా ఫోకస్ చేయలేదు అనిపిస్తుంది. ఆరోగ్య కారణంగా కూడా ఆయన వెనక్కి తగ్గి ఉండవచ్చు. కానీ నిర్మాతలు మాత్రం రజనీకాంత్ మార్కెట్ను దృష్టిలో పెట్టుకొని తెలుగు రాష్ట్రాల్లో భారీగా విడుదల చేశారు.

    ప్రీ రిలీజ్ బిజినెస్..

    ప్రీ రిలీజ్ బిజినెస్..

    ఇక పెద్దన్న సినిమా మొదటి రోజు ఎవరూ ఊహించని విధంగా షాక్ ఇచ్చింది. ఒక విధంగా రజనీకాంత్ కెరీర్ లోనే మొదటి రోజు వచ్చిన తెలుగు కలెక్షన్స్ కు ఇవి చాలా తక్కువనే చెప్పాలి. ఇక పెద్దన్న సినిమా తెలుగు రాష్ట్రాల్లో టోటల్ గా 12.5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ తో విడుదలయ్యింది. బాక్సాఫీస్ వద్ద సినిమా 13 కోట్ల షేర్ అందుకోగలిగితే సినిమా సక్సెస్ అయినట్లు లెక్క.

     మొదటి రోజు వచ్చింది ఎంతంటే?

    మొదటి రోజు వచ్చింది ఎంతంటే?

    ఇక మొదటి రోజు పెద్దన్న సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో ఏరియాల వారిగా వచ్చిన షేర్ కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి. నైజాంలో 53 లక్షలు, సీడెడ్‌లో 24 లక్షలు, ఉత్తరాంధ్రతో 16 లక్షలు, తూర్పు గోదావరి జిల్లాలో 12 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లాలో 9 లక్షలు, గుంటూరులో లక్షలు, కృష్ణా జిల్లాలో 11 లక్షలు, నెల్లూరులో 10 లక్షలు వచ్చాయి. ఆంధ్రా, నైజాంలో మొదటి రోజు మొత్తంగా 1.70 కోట్ల షేర్ రాగా టోటల్ గా 2.45 కోట్ల గ్రాస్ వసూళ్లను అందుకుంది.

    Recommended Video

    Vishal చర్య ప్రతీ Star Hero కి పాఠం.. ఇదీ కదా హీరోయిజం అంటే || Filmibeat Telugu
    రావాల్సింది ఎంతంటే?

    రావాల్సింది ఎంతంటే?

    సినిమా వరల్డ్ వైడ్ గా తెలుగులో ఎంత వసూళ్లు అందుకుంది అనే విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో పెద్దన్న సినిమా మొత్తంగా 12.5 కోట్ల రిలీజ్ బిజినెస్ తో మార్కెట్లోకి వచ్చింది. బాక్సాఫీస్ వద్ద సక్సెస్ కావాలి అంటే 13 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంటుంది. ఇక మొదటి రోజులోనే సినిమా కేవలం 1.60 కోట్ల షేర్ మాత్రమే రాబట్టింది. అంటే ఇంకా 11.4 కోట్ల వరకు షేర్ రావాల్సి ఉంది. మరి సినిమా శని ఆదివారాల్లో ఏమైనా లాభాలు అందుకుంటుందో లేదో చూడాలి.

    English summary
    Peddhanna Day 1 Box Office Collections: Rajinikanth Movie Starts Decent..
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X