Peddi Advance Booking: నార్త్ అమెరికాలో పెద్ది జోరు... రిలీజ్‌కు ముందు రామ్‌చరణ్‌ మూవీకి ఎన్ని కోట్లంటే?

బుచ్చిబాబు సానా దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తోన్న మూవీ పెద్ది. బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. జూన్ 4న పెద్ది చిత్రం వరల్డ్ వైడ్‌గా విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్లు, ప్రమోషనల్ కార్యక్రమాలు ఈ సినిమాపై అంచనాలను పెంచేస్తున్నాయి. నార్త్ అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ చేయగా.. ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఈ నేపథ్యంలో పెద్ది మూవీ బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ఈవెన్ టార్గెట్ ఎంత? నార్త్ అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్‌లో ఈ సినిమా ఎన్ని కోట్లు రాబట్టింది? ఈ వివరాల్లోకి వెళితే..

పెద్ది తారాగణం
కన్నడ సూపర్‌స్టార్ శివరాజ్ కుమార్, టాలీవుడ్ సీనియర్ నటుడు జగపతిబాబు, దివ్యెందు శర్మ, విజి చంద్రశేఖర్ తదితరులు పెద్ది మూవీలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. వృద్ది సినిమాస్, ఐవీవై ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్‌పై కిలారు వెంకట సతీష్, ఇషాన్ సక్సేనాలు పెద్ది సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఆస్కార్ అవార్డ్ విజేత, మ్యూజిక్ మ్యాస్ట్రో ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. రత్నవేలు కెమెరామెన్‌గా, నవీన్ నూలీ ఎడిటర్‌గా సేవలందిస్తున్నారు. జానీ మాస్టర్ కొరియోగ్రఫి అందిస్తుండగా.. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్‌లు సమర్పిస్తున్నాయి.

Peddi Advance Booking Ram Charan s Film Creates Sensation in North America with premiere pre-sales

పెద్ది బడ్జెట్ ఎంత?
నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషికం, ప్రొడక్షన్ కాస్ట్, పబ్లిసిటీ ఖర్చులతో కలిపి పెద్ది మూవీని 350 కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మిస్తున్నట్లుగా టాలీవుడ్ టాక్. 1980 నాటి విజయనగరం సెట్‌తో, భారీ క్రీడా మైదానం, తదితర అంశాల కోసం వేసిన సెట్‌ల కోసం నిర్మాతలు భారీ ఖర్చు చేశారు. గేమ్ ఛేంజర్ తర్వాత రామ్ చరణ్ చేస్తున్న మూవీ కావడంతో పాటు ఉప్పెన తర్వాత బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మూవీ కావడంతో పెద్దిపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి.

పెద్ది ప్రీ రిలీజ్ బిజినెస్
అంచనాలకు తగినట్లుగానే పెద్దికి భారీగా థియేట్రికల్, నాన్న థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లుగా ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ఇప్పటి వరకు అందుతున్న సమాచారం బట్టి నైజాం థియేట్రికల్ రైట్స్‌ని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ 63 కోట్ల రూపాయలకు దక్కించుకుంది. అలాగే ఓవర్సీస్‌ రైట్స్ 40 కోట్ల రూపాయలకు పైగా పలికినట్లుగా వార్తలు వస్తున్నాయి. నార్త్ ఇండియాలో జియో స్టూడియోస్, కర్ణాటకలో కిషోర్ ప్రొడక్షన్స్, తమిళనాడు కేరళలో థింక్ స్టూడియోస్ సంస్థలు పెద్ది థియేట్రికల్ హక్కులను సొంతం చేసుకున్నాయి.

పెద్ది నాన్ థియేట్రికల్ బిజినెస్
అలాగే పెద్ది సినిమా డిజిటల్ రైట్స్ దాదాపు 130 కోట్ల రూపాయలకు నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. శాటిలైట్ రైట్స్ 70 కోట్ల రూపాయలు, మ్యూజిక్ రైట్స్ 35 కోట్లు వరకు చేసినట్లుగా తెలుస్తోంది. మిగిలిన ఏరియాల థియేట్రికల్ రైట్స్‌తో కలిపి పెద్దికి ప్రీ రిలీజ్ బిజినెస్ 500 కోట్ల రూపాయలకు పైగా జరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన వివరాలు తెలియనున్నాయి.

నార్త్ అమెరికాలో పెద్ది కలెక్షన్స్
కేజీఎఫ్ సిరీస్, కాంతారా, సలార్ వంటి భారీ చిత్రాలను ప్రేక్షకులకు అందించిన హోంబలే ఫిల్మ్స్ వారు ఓవర్సీస్‌లో పెద్ది థియేట్రికల్ రైట్స్‌ను దక్కించుకున్నారు. అమెరికాలో రామ్ చరణ్‌కు ఉన్న ట్రాక్ రికార్డ్ నేపథ్యంలో పెద్దికి ప్రీమియర్స్ అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ అయిన వెంటనే మంచి స్పందన లభించింది. ఇప్పటి వరకు అమెరికాలోని 475 లోకేషన్స్‌లో 1401 షోలకు గాను 16236 టికెట్లు అమ్ముడై.. 4,60,089 డాలర్లు (4.40 కోట్ల రూపాయలు) రాబట్టింది. ఇక మొత్తం నార్త్ అమెరికాలో ఇప్పటి వరకు రామ్ చరణ్ మూవీకి అడ్వాన్స్ సేల్స్ కింద 510K డాలర్లు (4.87 కోట్ల రూపాయలు) వసూలు చేసినట్లుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ప్రీమియర్స్‌కు మరో 8 రోజులు సమయం ఉండటంతో పెద్దికి మరిన్ని కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X