Peddi 4 days AP TG collections: పెద్ది దెబ్బకు బాక్సాఫీస్ షేక్.. రామ్ చరణ్ మూవీకి ఎన్ని కోట్లంటే?

Peddi Collections: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన 'పెద్ది' దుమ్మురేపుతోంది. బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. విడుదలైన తొలి మూడు రోజుల్లో ఈ సినిమా కలెక్షన్ల పరంగా సంచలనం సృష్టించింది. విడుదలైన నాలుగు రోజుల్లోనే రూ. 200 కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అసాధారణమైన వసూళ్లతో రికార్డులు సృష్టిస్తోంది. మాస్ ఎలిమెంట్స్, ఎమోషనల్ డ్రామా, రామ్ చరణ్ పెర్ఫార్మెన్స్‌కు ప్రేక్షకులు భారీగా కనెక్ట్ అవ్వడంతో ఏపీ, తెలంగాణలో థియేటర్ల వద్ద సందడి కనిపిస్తోంది. శనివారంతో పోలిస్తే ఆదివారం వసూళ్లు పెరిగాయి. నాలుగు రోజుల్లో బాక్సాఫీస్ బరిలో సినిమా ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందంటే?

రామ్ చరణ్ - బుచ్చి బాబు సనా కాంబోలో తెరకెక్కిన సినిమా 'పెద్ది'అంచనాలకు మించి వసూళ్లు రాబడుతూ ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. ఈ మూవీ ప్రీమియర్ల ద్వారా 19 కోట్ల నెట్, 22 కోట్ల గ్రాస్ కలెక్షన్లు చేయగా.. తొలి రోజు రూ.51 కోట్ల నెట్‌కలెక్షన్లు అందుకుంది. ఇక రెండో రోజు దేశవ్యాప్తంగా రూ.26.90 కోట్ల నెట్ కలెక్షన్లు వచ్చాయి. ఇక మూడో రోజు కలెక్షన్లు రూ. 28.85 కోట్లు అందుకుంది. ఇక నాలుగో రోజు ఆదివారం'పెద్ది'దేశవ్యాప్తంగా రూ. 31.90 కోట్ల నెట్ కలెక్షన్లు సాధించి తన సత్తా చాటింది. శనివారం కలెక్షన్లతో పోలిస్తే ఇది 10.6 శాతం పెరుగుదల కనిపించడం విశేషం. తొలి వీకెండ్ పెద్దిగాడు బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోశాడనే చెప్పాలి.

Peddi AP TG Box Office Collection Day 4 Ram Charan s Film Crosses 233 Crore Worldwide

వీకెండ్ కలెక్షన్ల జోరుతో పెద్ది దేశవ్యాప్తంగా మొత్తం రూ. 157.15 కోట్ల నెట్, రూ. 187.02 కోట్ల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది. ఇక ఓవర్సీస్ మార్కెట్‌లో కూడా 'పెద్ది' అద్భుత ప్రదర్శన కనబరుస్తోంది. నాలుగో రోజు విదేశాల్లో ఏకంగా రూ. 4 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. దీంతో మొత్తంగా ఓవర్సీస్ గ్రాస్‌ రూ. 46 కోట్లకు చేర్చింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా సినిమా మొత్తం గ్రాస్ కలెక్షన్లు రూ. 233.02 కోట్లకు చేరుకున్నాయి. విడుదలైన నాలుగు రోజుల్లోనే రూ.200 కోట్ల మార్క్‌ను దాటేయడం చిత్ర బాక్సాఫీస్ స్టామినాను నిరూపిస్తోంది.

ఈ సినిమాతో రామ్ చరణ్ తన కెరీర్‌లో మరో అరుదైన ఘనతను అందుకున్నారు. ఇప్పటికే 'రంగస్థలం', 'ఆర్ఆర్ఆర్' చిత్రాలతో రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఆయన, ఇప్పుడు 'పెద్ది'తో మూడోసారి ఆ ఫీట్‌ను నమోదు చేశారు. తద్వారా తెలుగు సినీ పరిశ్రమలో వరుసగా భారీ వసూళ్లు సాధిస్తున్న స్టార్ హీరోల జాబితాలో తన స్థానాన్ని మరింత బలపరిచారు. అయితే ఈ విజయానికి ప్రధాన బలం తెలుగు వెర్షన్ అని చెప్పాలి. నాలుగో రోజు వచ్చిన రూ. 31.90 కోట్ల నెట్ కలెక్షన్లలో ఏకంగా రూ. 27.50 కోట్లు తెలుగు వెర్షన్ నుంచే రావడం విశేషం. అంటే మొత్తం వసూళ్లలో అత్యధిక భాగం తెలుగు ప్రేక్షకుల నుంచే వచ్చినట్లు స్పష్టమవుతోంది. తెలుగు వెర్షన్‌కు 61 శాతం ఆక్యుపెన్సీ నమోదు కావడం సినిమాపై ప్రేక్షకుల ఆసక్తిని తెలియజేస్తోంది.

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన కేంద్రాల్లో 'పెద్ది'కు భారీ స్పందన లభించింది. విశాఖపట్నంలో 88.5 శాతం ఆక్యుపెన్సీ నమోదవగా, విజయవాడలో 80.3 శాతం, కాకినాడలో 79.3 శాతం, గుంటూరులో 72.3 శాతం ఆక్యుపెన్సీ నమోదయ్యాయి. హైదరాబాద్‌లో కూడా 66.3 శాతం ఆక్యుపెన్సీతో సినిమా బలమైన ప్రదర్శన కొనసాగించింది. ముఖ్యంగా మధ్యాహ్నం, సాయంత్రం షోలలో హౌస్‌ఫుల్ స్థాయిలో ప్రేక్షకులు థియేటర్లకు తరలివచ్చారు. తెలుగు 2D వెర్షన్‌కు నాలుగో రోజు మొత్తం 60.62 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది. మధ్యాహ్నం షోలకు 71.77 శాతం, సాయంత్రం షోలకు 74.08 శాతం ఆక్యుపెన్సీ రావడం సినిమాకు కుటుంబ ప్రేక్షకుల నుంచి కూడా మంచి ఆదరణ లభిస్తున్నట్లు సూచిస్తోంది.

ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం, ఇదే జోరు కొనసాగితే 'పెద్ది' త్వరలోనే ₹250 కోట్ల వరల్డ్‌వైడ్ గ్రాస్ క్లబ్‌లో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. తొలి వారంలోనే భారీ రికార్డులు నమోదు చేస్తున్న ఈ చిత్రం, రాబోయే రోజుల్లో మరిన్ని బాక్సాఫీస్ మైలురాళ్లు అందుకునే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు అందరి దృష్టి సోమవారం నుంచి ప్రారంభమయ్యే వర్కింగ్ డేస్ కలెక్షన్లపై ఉంది. సాధారణంగా వీకెండ్ తర్వాత వసూళ్లు తగ్గే అవకాశం ఉన్నప్పటికీ, సినిమాపై ఉన్న పాజిటివ్ టాక్, ఫ్యామిలీ ఆడియన్స్ ఆదరణ కొనసాగితే 'పెద్ది' మరిన్ని రికార్డులను బద్దలు కొట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Read more about: peddi box office report ramcharan
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X