Peddi 6 days AP-TG collections: రామ్ చరణ్ పెద్దికి పరీక్ష.. బాక్సాఫీస్ వద్ద అసలు పరిస్థితి ఇదే!

Peddi collections: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, జాన్వీ కపూర్ కథానాయికగా నటించిన సినిమా 'పెద్ది'. డైరెక్టర్ బుచ్చిబాబు సనా దర్శకత్వం తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా విడుదలైన తొలి వారం నుంచే భారీ వసూళ్లను నమోదు చేస్తూ ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. ముఖ్యంగా ప్రీమియర్ షోల నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో కూడా మంచి ఆదరణ పొందుతోంది. అయితే వీకెండ్ ముగిసిన తర్వాత సహజంగా వచ్చే వర్కింగ్ డే ప్రభావం 'పెద్ది'పై కూడా కనిపించింది. ఈ నేపథ్యంలో పెద్ది కలెక్షన్లు ఎంత? తెలుగు రాష్ట్రాల్లో ఎంత కలెక్ట్ చేసింది? అనే వివరాల్లోకెళ్తే..

పెద్ది కలెక్షన్లు వీకెండ్ దుమ్మురేపినా వీక్ డేస్ లో కలెక్షన్స్ తగ్గాయి. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. పెద్ది సినిమా ప్రీమియర్ల ద్వారా రూ.18.50 కోట్ల నెట్ కలెక్షన్లతో ఖాతా తెరిచింది. ఆ తర్వాత విడుదలైన మొదటి రోజు ఏకంగా రూ.51 కోట్ల నెట్ వసూళ్లతో బాక్సాఫీస్ వద్ద భారీ ఓపెనింగ్ నమోదు చేసింది. రెండో రోజు రూ.26.90 కోట్లు, మూడో రోజు రూ.29.10 కోట్లు, నాలుగో రోజు ఆదివారం రూ.32.15 కోట్ల నెట్ వసూళ్లను సాధించింది. వీకెండ్‌లో భారీ వసూళ్లు సాధించిన ఈ సినిమా సోమవారం నుంచి కలెక్షన్లు డ్రాప్‌ అవుతున్నాయి. ఐదో రోజు రూ.12.05 కోట్లు, ఆరో రోజు మంగళవారం రూ.9.65 కోట్ల నెట్ కలెక్షన్లను నమోదు చేసింది.

Peddi AP-TG Box Office Collections Day 6

ఆరు రోజులు ముగిసే నాటికి'పెద్ది' దేశవ్యాప్తంగా రూ.179.35 కోట్లు (నెట్ కలెక్షన్లు) చేరుకున్నాయి. ఇందులో తెలుగు వెర్షన్ వాటా అత్యధికంగా ఉండటం గమనార్హం. తెలుగు వెర్షన్ ను ఏకంగా రూ.161.55 కోట్ల నెట్ వసూళ్లు అందుకుందంటే మొత్తం ఇండియా నెట్ కలెక్షన్లలో దాదాపు 90 శాతం వసూళ్లు తెలుగు మార్కెట్ నుంచే వచ్చినట్లు స్పష్టమవుతోంది. ఇది రామ్ చరణ్‌కు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న స్టార్‌డమ్‌ను మరోసారి నిరూపిస్తోంది.

ఇక ఆరో రోజు భాషల వారీగా చూస్తే.. ఆరో రోజు నాడు రూ. 9.65 కోట్ల నెట్ కలెక్షన్లను నమోదు చేసింది. ఇందులో తెలుగు వెర్షన్ నుంచి రూ.7.75 కోట్లు వసూలు చేయగా, హిందీ వెర్షన్ రూ.1.65 కోట్లు సాధించింది. తమిళంలో రూ.0.15 కోట్లు, కన్నడలో రూ.0.07 కోట్లు, మలయాళంలో రూ.0.03 కోట్లు వచ్చాయి. దీన్ని బట్టి పెద్ది సినిమా ప్రధానంగా తెలుగు మార్కెట్‌పైనే ఆధారపడి ముందుకు సాగుతోందని అర్థమవుతోంది.

ఆక్యుపెన్సీ పరంగా పరిశీలిస్తే.. ఆరో రోజు తెలుగు వెర్షన్ మొత్తం ఆక్యుపెన్సీ 27.12 శాతంగా నమోదైంది. ఉదయం షోలలో 17.38 శాతం ఆక్యుపెన్సీ నమోదవగా, మధ్యాహ్నం 28.92 శాతం, సాయంత్రం 33.23 శాతం, రాత్రి 28.92 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది. ఇక ప్రధాన నగరాల్లో విశాఖపట్నం అత్యధికంగా 46 శాతం ఆక్యుపెన్సీని నమోదు కాగా, కాకినాడలో 40.3 శాతం, వరంగల్‌లో 39.3 శాతం, విజయవాడలో 32.8 శాతం, హైదరాబాద్‌లో 25.5 శాతం ఆక్యుపెన్సీ నమోదు కావడం విశేషం.

ట్రేడ్ రిపోర్ట్ ప్రకారం.. చూస్తే ప్రపంచవ్యాప్తంగా 'పెద్ది' ఇప్పటివరకు రూ. 261. 23 కోట్ల గ్రాస్ కలెక్షన్లను సాధించింది. ఇందులో ఇండియా గ్రాస్ రూ.213.23 కోట్లు కాగా, ఓవర్సీస్ మార్కెట్ నుంచి రూ.48 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయట. మొత్తం ప్రపంచవ్యాప్తంగా వచ్చిన వసూళ్లలో 81.63 శాతం వాటా ఇండియా మార్కెట్‌దే కాగా, 18.37 శాతం ఓవర్సీస్ మార్కెట్ నుంచి వచ్చిందట. ఇదిలా ఉంటే.. తాజాాగా 'పెద్ది' విడుదలైన కేవలం ఆరు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.332.1 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించిందని మూవీ మేకర్స్ ప్రకటించారు. ఈ సందర్భంగా 'రామ్ చరణ్ బాక్సాఫీస్ ఛాంపియన్’ అని మూవీ యూనిట్ ప్రత్యేక పోస్టర్ విడుదల చేయడం గమనార్హం.

మొతానికి పెద్ది మొదటి వారంలోనే భారీ వసూళ్లతో బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతోంది. అయితే.. వీక్‌డేలో కలెక్షన్లు తగ్గినా, తెలుగు రాష్ట్రాల్లో చెప్పుకోతగ్గ కలెక్షన్లు వస్తున్నాయి. రెండో వారాంతంలో మరోసారి కలెక్షన్లు పెరిగే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇదే జోరు కొనసాగితే 'పెద్ది' రామ్ చరణ్ కెరీర్‌లో మరో భారీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Read more about: peddi box office report ramcharan
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X