Peddi 8 days AP TG collections: పెద్ది జోరు కొనసాగుతుందా? తెలుగు రాష్ట్రాల్లో బాక్సాఫీస్ పరిస్థితేంటీ?

Peddi collections: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, జాన్వీ కపూర్ హీరోహీరోయిన్స్ గా నటించిన సినిమా 'పెద్ది'. డైరెక్టర్ బుచ్చిబాబు సనా దర్శకత్వం తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ మంచి కలెక్షన్లు అందుకుంటుంది. ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా విడుదలైన తొలి రోజు నుంచే భారీ వసూళ్లను నమోదు చేస్తుంది. ముఖ్యంగా ప్రీమియర్ షోల నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో కూడా మంచి ఆదరణ పొందుతోంది. మొదటి వారం పూర్తి చేసుకొని రెండో వారంలోకి ప్రవేశించింది. అయితే ఈ సినిమా 8వ రోజు కలెక్షన్ల ఎంత? ఇప్పటి వరకు ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని కోట్లు వసూలు చేసిందనే వివరాల్లోకి వెళితే..

ట్రేడ్ లెక్కల ప్రకారం.. పెద్ది సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.279.35 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించి మరో మైలురాయి వైపు అడుగులు వేస్తోంది. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రామ్ చరణ్ మూవీ రూ.193. 55 కోట్ల నెట్ వసూళ్లు సాధించగా, గ్రాస్ కలెక్షన్స్ రూ.229.95 కోట్లకు చేరాయి. ఓవర్సీస్ మార్కెట్ నుంచి మరో రూ.49.40 కోట్ల గ్రాస్ రాబట్టడంతో మొత్తం వరల్డ్‌వైడ్ గ్రాస్ రూ.279.35 కోట్లకు చేరింది. ఇందులో దాదాపు 82.32 శాతం వసూళ్లు ఇండియన్ మార్కెట్ నుంచే రావడం విశేషం. ఓవర్సీస్ నుంచి 17.68 శాతం షేర్ రావడం సినిమాకు ఉన్న గ్లోబల్ రీచ్‌ను సూచిస్తోంది.

Peddi AP-TG Box Office Collections Day 8

'పెద్ది'సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద పరిస్థితి చూస్తే.. ఈ సినిమా ప్రీమియర్స్ ద్వారా రూ.18.50 కోట్ల నెట్ కలెక్షన్స్‌తో అందుకుంది. ఇక తొలి రోజు రూ.51 కోట్ల నెట్ వసూలు చేసిన ఈ సినిమా రెండో రోజు రూ.26.90 కోట్లు, మూడో రోజు రూ.29.10 కోట్లు, నాలుగో రోజు రూ.32.15 కోట్ల నెట్ కలెక్షన్లు అందుకుంది. అనంతరం వర్కింగ్ డేస్ ప్రభావంతో కలెక్షన్లు తగ్గినా, ఐదో రోజు రూ.12.35 కోట్లు, ఆరో రోజు రూ.9.70 కోట్లు, ఏడో రోజు రూ.7.55 కోట్లు, ఎనిమిదో రోజు రూ.6.30 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది. మొత్తంగా తొలి వారం ముగిసే సరికి 'పెద్ది' ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ.193.55 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టి రూ.200 కోట్ల మార్క్‌కు చేరువైంది.

మరోవైపు.. తెలుగు రాష్ట్రాల్లో 'పెద్ది'బాక్సాఫీస్ ప్రభంజనం మరింత స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కలిపి కేవలం ఏడు రోజుల్లోనే రూ.125.71 కోట్ల నెట్, సుమారు రూ.186.60 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించినట్టు తెలుస్తోంది. ఈ ఏడాది టాలీవుడ్ లో విడుదలైన తెలుగు సినిమాల్లో ఇది బెస్ట్ సినిమాల్లో పెద్ది ఒకటిగా నిలిచింది. ప్రాంతాల వారీగా చూస్తే నిజాం ఏరియా మరోసారి రామ్ చరణ్‌కు స్ట్రాంగ్ మార్కెట్‌గా నిరూపితమైంది.

ఇప్పటివరకు నిజాం నుంచి రూ.46.58 కోట్ల షేర్ రాగా, సీడెడ్ నుంచి రూ.17.58 కోట్లు వచ్చాయట. ఉత్తరాంధ్ర ప్రాంతం రూ.18.33 కోట్లతో మంచి వసూళ్లు నమోదు చేసింది. తూర్పు గోదావరి రూ.10.86 కోట్లు, పశ్చిమ గోదావరి రూ.7.64 కోట్లు, గుంటూరు రూ.11.14 కోట్లు, కృష్ణా రూ.8.67 కోట్లు, నెల్లూరు రూ.4.91 కోట్లు వసూలు చేసినట్టు తెలుస్తోంది. ట్రేడ్ వర్గాల విశ్లేషణ ప్రకారం.. 'పెద్ది'కి వీకెండ్‌లో మళ్లీ కలెక్షన్లు పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే రూ.279 కోట్లకు పైగా వరల్డ్‌వైడ్ గ్రాస్ సాధించిన ఈ సినిమా త్వరలోనే రూ.300 కోట్ల క్లబ్‌లో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇదిలా ఉంటే.. కేవలం 7 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 345 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ను రాబట్టి సరికొత్త రికార్డును సృష్టించిందని మూవీ మేకర్స్ అధికారికంగా ఓ పవర్‌ఫుల్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇలా మొత్తానికి రామ్ చరణ్ కెరీర్‌లో 'గేమ్ ఛేంజర్'తర్వాత వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్ కంబ్యాక్‌గా నిలిచింది.

Read more about: peddi box office report ramcharan
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X