Peddi AP TG collection:పెద్ది దూకుడు.. 10 రోజుల్లో రామ్ చరణ్ మూవీకి ఎన్ని కోట్లంటే?

Peddi AP TG collection:మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కించిన స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా 'పెద్ది'. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. జూన్ 4న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మిక్స్డ్ టాక్ అందుకున్నప్పటికీ, వసూళ్ల పరంగా మాత్రం తన సత్తా చాటుతోంది. ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంటున్న ఈ సినిమా కలెక్షన్ల పరంగా కొత్త రికార్డులను క్రియేట్ చేస్తుంది. ఇక 10 రోజు ( రెండో శనివారం) మరోసారి భారీ రెస్పాన్స్ అందుకుంది. ఈ నేపథ్యంలో పెద్ది సినిమా 10 రోజుల్లో ఎన్ని కోట్లు వసూలు చేసింది? తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని కోట్లు కొల్లగొట్టింది? అనే వివరాల్లోకి వెళ్తే..

బాక్సాఫీస్ వద్ద 'పెద్ది'విజయయాత్ర కొనసాగుతోంది. రెండో వారం వీకెండ్ లో మరోసారి వసూళ్లు మళ్లీ పుంజుకున్నాయి. ట్రేడ్ ట్రాకింగ్ పోర్టల్ శాక్‌నిల్క్ ప్రకారం 10వ రోజు పెద్ది సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ. 8.10 కోట్ల నెట్ కలెక్షన్లు అందుకోగా, రూ. 9. 55 కోట్ల గ్రాస్ సాధించింది. 9వ రోజు (శుక్రవారం) అందుకున్న రూ. 5. 15 కోట్లతో పోలిస్తే.. ఇది 57.3 శాతం ఎక్కువనని చెప్పాలి. తాజా వసూళ్లతో 'పెద్ది'ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ. 206. 80 కోట్ల నెట్ కలెక్షన్స్ అందుకోగా, గ్రాస్ కలెక్షన్లు రూ. 245.53 కోట్లకు చేరుకున్నాయి. ఇలా విడుదలైన 10 రోజుల్లోనే రూ. 200 కోట్ల నెట్ క్లబ్‌లోకి అడుగుపెట్టింది పెద్ది.

Peddi AP-TG Box Office Collections Day10

అలాగే.. ఓవర్సీస్ కూడా పెద్దికి భారీ రెస్పాన్స్ వస్తుంది. ఈ క్రమంలోనే 10వ రోజు ఓవర్సీస్‌ నుంచి మరో రూ.1 కోటి గ్రాస్ వసూలు చేసినట్టు తెలుస్తోంది. దీంతో విదేశీ వసూలు రూ. 51 కోట్లకు చేర్చుకున్నాయి. ఇలా దేశీయ మార్కెట్ లోనే కాకుండా విదేశీ మార్కెట్ లో భారీ ఆదరణ అందుకున్న పెద్ది సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 296.53 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించింది. దీంతో రూ.300 కోట్ల మార్క్‌కు కేవలం అడుగు దూరంలో నిలిచింది. ఇదిలా ఉంటే.. 9 రోజుల్లో పెద్ది సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 366 కోట్లు వసూలు చేసిందని నిర్మాతలు అధికారికంగా ప్రకటించడం గమనార్హం.

ఇక 'పెద్ది'ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో దూసుకపోతుంది. 10వ రోజు నాడు దేశవ్యాప్తంగా రూ. 9.55 కోట్ల గ్రాస్ అందుకుంటే.. అందులో తెలుగు రాష్ట్రాల నుంచి రూ.7 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి రూ. 3.87 కోట్లు అందుకోగా, తెలంగాణ నుంచి రూ. 3.5 కోట్లు అందుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా రూ. 245. 53 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధిస్తే.. ఈ రెండు రాష్ట్రాల నుంచి ఏకంగా రూ. 187. 55 కోట్ల గ్రాస్ కలెక్షన్లు అందుకున్నాయి. ఇలా పెద్ది సినిమా కలెక్షనల్లో తెలుగు రాష్ట్రాల వసూళ్లే ఎక్కువ.

ఇక ప్రాంతాల వారీగా 'పెద్ది' కలెక్షన్లను పరిశీలిస్తే, పెద్ది సినిమా గత 10 రోజుల్లో ఆంధ్రా, నైజాంలో భారీ వసూళ్లను నమోదు చేసింది. ఈ సినిమా తెలంగాణలో రూ. 50.5 కోట్లు, సీడెడ్‌లో రూ. 19.49 కోట్లు ఉత్తరాంధ్రలో 19.5 కోట్ల రూపాయలు వసూలు చేసిందనీ, ఇక మిగితా జల్లాలో కలిపి రూ. 50 కోట్ల వరకు వసూలు చేసినట్లు తెలుస్తోంది. దాంతో ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 141.5 కోట్ల రూపాయల నెట్, 187 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను సాధించిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఇలా వీకెండ్ జోరు కొనసాగితే రాబోయే రోజుల్లో సినిమా మరిన్ని రికార్డులను సొంతం చేసుకునే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Read more about: peddi box office report ramcharan
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X